BigTV English
Advertisement

Online UPI Payments : టెక్నాలజీని తెగ వాడేస్తున్నారుగా… ఆన్ లైన్ పేమెంట్స్ విలువ రూ.12.11 లక్షల కోట్లు…

Online UPI Payments : టెక్నాలజీని తెగ వాడేస్తున్నారుగా… ఆన్ లైన్ పేమెంట్స్ విలువ రూ.12.11 లక్షల కోట్లు…

Online UPI Payments : ఒక్క అక్టోబర్ లోనే రూ.731 కోట్ల గ్రోత్


టీకొట్టుకెళ్లినా.. కూరగాలు, పాలు కొన్నా… నోట్లతో పనేలేదు. చిల్లర లేదనే టెన్షనే అవసరం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఫోన్ ఫేనో, గూగుల్ పేనో, పేటిఎం ద్వారానో పేమెంట్ చేసేయొచ్చు. చిన్నచిన్న వ్యాపారులు కూడా ఇంతకుముందులా డబ్బులు అడగడం లేదు. కొనుగోలు పూర్తికాగానే క్యూఆర్ కోడ్ ను ముందర పెడుతున్నారు. డిజిటల్ పేమెంట్స్ సత్తా ఇది మరి. డిజిటల్ భారత్ తో ఇదంతా సాధ్యమవుతోందని ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. కేంద్రం యూపీఐ పేమెంట్స్ సిస్టం తీసుకొచ్చాక ఆన్ లైన్ పేమెంట్ విపరీతంగా పెరిగాయి. అవి ఎంతగా అంటే ప్రపంచంలోనే భారత్ ను ముందు స్థానంలో నిలబెట్టేటంత. ఒక్క అక్టోబర్ నెలనే తీసుకోండి. ఆ నెలలో రూ.731 కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయి. గతంతో పోల్చితే ఇది 7.7 శాతం ఎక్కువ. ఈ ఒక్క నెల ట్రాన్సక్షన్స్ తో భారత్ లో మొత్తం యూపీఐ లావాదేవీల విలువ రికార్డు స్థాయిలో రూ. 12.11 లక్షల కోట్లకు చేరిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-ఎన్.పి.సీ.ఐ. తెలిపింది.
ఇక సెప్టెంబర్ నెలలో ఆన్ లైన్ యూపీఐ లావాదేవీలు రూ.678 కోట్ల వరకు జరిగాయి. దీంతో సెప్టెంబర్ నెల వరకు మొత్తం యూపీఐ లావాదేవీలు రూ.11.16 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం పెరిగిన డిజిటల్ పేమెంట్స్ లో ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్-ఐ.ఎం.పి.ఎస్ లావాదేవీల సంఖ్య 48.25 కోట్లు. అంటే వీటి విలువ రూ.4.66 లక్షల కోట్లు. మరోవైపు సెప్టెంబర్ నెలతో పోల్చితే ఎన్.ఇ.టి.సి. ఫాస్టాగ్ ట్రాన్సాక్షన్స్ విలువ రూ.4,452 కోట్లకు పెరిగింది.
కరోనా వచ్చినప్పటి నుంచే మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ పెరిగాయని చెప్పొచ్చు. నోట్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని ప్రచారం జరగగానే జనం యూపీఐ పేమెంట్స్ పై ఆసక్తి చూపడం మొదలు పెట్టారు. ఫలితంగా నోట్ల వాడకం విపరీతంగా తగ్గింది. డిజిటల్ పేమెంట్స్ ను మరింతగా పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా… తాజాగా డిజిటల్ రుపీని తెచ్చింది. అయితే రిటైల్ రంగంలో ఇది అందుబాటులోకి రావడానికి మరో నెల పడుతుంది. ఇక ప్రతి నెల ఒక బిలియన్ అంటే వంద కోట్ల ఆన్ లైన్ లావాదేవీలు జరిగేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. అటు రిజర్వు బ్యాంకు కూడా ఇందుకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ని విడుదల చేసింది. సురక్షితమైన, వేగవంతమైన, సులభమైన పద్దతుల్లో లావాదేవీలు జరిగేలా చూడడం ఇందులో ముఖ్యమైంది.


Tags

Related News

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

Big Stories

×