BigTV English

AP Social Media Posts: మనుషులా..? పశువులా..? రోస్టింగ్ పేరుతో రోత.. సైకో చేష్టల కోత్త చట్టం..!

AP Social Media Posts: మనుషులా..? పశువులా..? రోస్టింగ్ పేరుతో రోత.. సైకో చేష్టల కోత్త చట్టం..!

AP Social Media Posts: సోషల్ మీడియాలో అకౌంట్ ఉంది. తోచింది రాసేస్తాం.. నచ్చింది పెట్టేస్తాం.. AI ఉంది కదా అని మార్ఫింగ్ చేస్తాం అంటే కుదరదు. ఇప్పటికే సోషల్ మీడియాలో రోత రాతలతో చాలా నష్టం జరిగింది. మరీ ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ఈ సోషల్ మీడియా వార్ కాస్తా మహిళలను కించపరిచేదాకా దారి తీసింది. చాలా మంది హర్ట్ అయ్యారు. పొలిటికల్ పార్టీల మధ్య సోషల్ వార్ ఓ రేంజ్ లో జరిగింది. అరెస్టులు కూడా జరిగాయ్. సో వీటికి చెక్ పెట్టేలా ఏపీ ప్రభుత్వం సరికొత్తగా ప్లాన్ చేస్తోంది.


ఏది పడితే అది రాస్తూ తప్పుడు ప్రచారాలు

సోషల్ మీడియాపై కంట్రోల్ పెద్దగా లేకపోవడంతో ఏది పడితే అది రాయడం, పోస్టులు పెట్టడం, అవతలి వారిని కించపరచడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, మార్ఫింగ్ చేయడం, రాజకీయ దురుద్దేశంతో పోస్టులు పెచ్చడం, రెచ్చగొట్టడం ఒక్కటేమిటి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అందుకే ఏపీ ప్రభుత్వం సరికొత్తగా ఫేక్ వ్యవహారాలను కంట్రోల్ చేసే కొత్త చట్టం దిశగా అడుగులు వేస్తోంది. అవును ఇప్పుడు సోషల్ మీడియాపై మరింత నిఘా పెరగబోతోంది. అలా చేయాలంటే ఏం చేయాలన్న విషయాలపై ఏపీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ఏపీ కూటమి ప్రభుత్వం రెడీ అవుతోంది. తప్పుడు సమాచారం, అసభ్య కంటెంట్, దూషణాత్మక పోస్టులను కంట్రోల్ చేసేందుకు ఒక కొత్త చట్టాన్ని రూపొందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ చట్టం రూపకల్పన కోసం మంత్రులు నాదెండ్ల మనోహర్, పార్థసారథి, సత్యకుమార్ యాదవ్, వంగలపూడి అనితలతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉపసంఘం విధివిధానాలను రూపొందించి, దాని అమలుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించి రిపోర్ట్ ఇస్తుంది.


ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో సోషల్ దుష్ర్పచారాలపై ఫోకస్

సెప్టెంబర్ 4న జరిగిన ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో ఈ సోషల్ మీడియా దుష్ప్రచారాల చుట్టూనే చర్చ జరిగింది. ఈ మీటింగ్ లో సోషల్ మీడియాల్లో ఏపీ ప్రభుత్వం అలాగే కూటమి పార్టీ నాయకులపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై చర్చ జరిగింది. భావప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తామని, కానీ అది అవతలి వారిని ఇబ్బంది పెట్టేలా అతిక్రమించేలా ఉంటే కుదరదన్నారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అసలు అకౌంట్ల కంటే ఫేక్ అకౌంట్లే ఎక్కువగా ఉంటున్నాయి. సో అసలైన ఖాతాలేవో తెలియాలంటే ఆధార్ ఆధారిత అకౌంటబిలిటీ ఉండేలా చట్టం రూపొందించాలని మంత్రులకు సూచించారు. సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణలో ఆధార్ ఆధారిత గుర్తింపును పరిగణనలోకి తీసుకోవడం ద్వారా దుర్వినియోగాన్ని అరికట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది అసలైన వ్యక్తుల గుర్తింపును ధృవీకరించడంలో ఉపయోగపడుతోందని, అసభ్య కంటెంట్‌కు చెక్ పెట్టగలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది.

న్యూజిలాండ్‌లో బలమైన సోషల్ మీడియా చట్టాలు

సోషల్ మీడియా పోస్టుల కట్టడిలో న్యూజిలాండ్‌లో బలమైన సోషల్ మీడియా చట్టాలు ఉన్నాయని, అలాగే ఇటీవలి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను స్టడీ చేసి, సమగ్ర చట్టాన్ని రూపొందించాలన్నారు సీఎం చంద్రబాబు. రాజకీయ దురుద్దేశాలతో చేసే తప్పుడు ప్రచారంతో ప్రభుత్వానికి నష్టం జరుగుతోంది. పదే పదే అవే పోస్టులు వైరల్ అయితే అదే నిజం అనుకునే పరిస్థితి జనంలోకి వస్తుంది. అందుకే ఇలాంటి వాటిని ఆదిలోనే గుర్తించి కట్టడి చేసేలా కొత్త చట్టాన్ని సీరియస్ గా తీసుకుంటోంది సర్కారు. సామాజిక మాధ్యమాల్లో వైఎస్ఆర్‌సీపీ నాయకులు, వారి సపోర్టర్స్ చేసే తప్పుడు ప్రచారాలపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలపై కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చర్చకు వచ్చాయి. కుప్పంకు కృష్ణా నదీ జలాలను అందిస్తున్నప్పటికీ, వైసీపీ నేతలు నీళ్లు అందడం లేదంటూ తప్పుడు పోస్టులతో ప్రచారం చేస్తున్నారన్నట్లు చర్చకు వచ్చింది. అలాగే యూరియా సరఫరాపై కూడా అసత్యాలు వ్యాప్తి చేసి రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. నిజానికి ఈ తప్పుడు ప్రచారాలను మంత్రులు, ఎమ్మెల్యేలు సమర్థంగా తిప్పికొట్టలేకపోవడం వల్ల ప్రభుత్వ ఇమేజ్‌కు నష్టం జరుగుతోందన్న అభిప్రాయం క్యాబినెట్ మీటింగ్ లో వ్యక్తమైంది. సుగాలి ప్రీతి కేసుపైనా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రియాక్ట్ అయ్యారు. సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలిచినందుకు తనను రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని విషప్రచారం చేస్తున్నారని మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ అన్నట్లు తెలిసింది. ఈ కేసును సీబీఐకి కూడా కూటమి ప్రభుత్వం అప్పగించింది. ఓవరాల్ గా సమాజంలో చిచ్చుపెట్టే కంటెంట్‌ను నిషేధించడం, మహిళలపై అసభ్య పోస్టులను అరికట్టడం ఈ చట్టం ప్రధాన లక్ష్యాలుగా ఉండబోతున్నాయ్.

సోషల్ మీడియాలో హద్దులు దాటిన పోస్టులు

సోషల్ మీడియాకు పవర్ చాలా ఉంది. ప్రభుత్వాలనే కదిలిస్తుంది. నిశ్శబ్ద ఉద్యమాలను నడిపిస్తుంటుంది. దీన్ని మంచికి వాడుకుంటే చాలా మంచి జరుగుతుంది. అదే చెడుకు వాడితే వచ్చేవి సమస్యలు, అనర్థాలే. అయితే ఏపీలో సోషల్ మీడియాతో మంచి జరగడం అటుంచితే అనర్థాలే ఎక్కువగా జరుగుతున్నాయ్. అందుకే వీరందరినీ కట్టడి చేసేలా కొత్త చట్టం చేసే దిశగా ఆలోచన చేయాల్సి వస్తోంది. సోషల్ మీడియా వాడకం ఎక్కడ ఎలా ఉంటుందో గానీ ఏపీలో మాత్రం కంప్లీట్ స్టోరీ వేరు. సోషల్ మీడియాతో ప్రత్యర్థులను సూటిపోటి కామెంట్లతో వేధించడం, ముఖ్యంగా లీడర్ల భార్యలపై అసభ్య కామెంట్లు పెట్టించడం, వ్యక్తిత్వ హననాలకు పాల్పడడం ఇవన్నీ జరిగాయి. చాలా మంది బాధపడ్డారు. లోలోన కుమిలిపోయారు. ఇదంతా రాజకీయంగా జరిగిన యుద్ధమే. అయితే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ క్లియర్ గా చెబుతుంటాయి.. కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారమే పోస్టులు పెట్టాలంటారు. కానీ ఆ మాట వినేదెవరు? అబ్యూజివ్ కామెంట్లతో నిండిపోతున్నాయ్. ఫేక్ ప్రచారాలు జోరందుకుంటున్నాయ్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ పని చేసినా అందులో అవాస్తవాలను ప్రచారం చేస్తూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయ్. అమరావతి మునిగిపోతుందని మొన్నటిదాకా ప్రచారం జరిగింది. లేటెస్ట్ గా ఏపీ ప్రభుత్వ అద్దె హెలికాప్టర్‌పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని కూటమి ప్రభుత్వం మండిపడుతోంది. కొత్త హెలికాప్టర్ కొనకపోయినా కొన్నట్లు దుష్ప్ర చారం చేస్తున్నారంటున్నారు. మరో ఎగ్జాంపుల్.. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేకపోయినా.. కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చిందన్న ప్రచారం పెరుగుతోంది. దీన్ని నమ్మొద్దని పశుసంవర్దక శాఖ అధికారులు అంటున్నారు. సో ఇలా చెబుతూ పోతే రోజూ ఇలాంటి ఉదాహరణలెన్నో. అందుకే స్ట్రిక్ట్ యాక్షన్ దిశగా అడుగులు పడుతున్నాయ్.

కూటమి ప్రభుత్వం రాగానే వందల మందికి నోటీసులు

ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతోనే సోషల్ మీడియా సైకోల సంగతి తేల్చే పనిలో పడ్డారు. గతంలో ఇష్టం వచ్చిన కామెంట్లు పెట్టి వేధించిన వారి ఆట కట్టించారు. వందల మందికి నోటీసులు ఇచ్చారు. చాలామందిపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. నిజానికి ఐటీ చట్టం ప్రకారం ఇలా సోషల్ మీడియాలో అబ్యూజివ్ గా ప్రవర్తిస్తే పెద్దగా కఠిన శిక్షలు లేవు. దీంతో చాలా మంది రెచ్చిపోవడానికి కారణమైంది. సో ఇవన్నీ చూసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీలో గతంలో ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. సోషల్‌ మీడియా వెళ్తున్న అపసవ్య ధోరణిని సరిచేయడం ఈ సభ నుంచే ప్రారంభం కావాలని, సోషల్‌ మీడియా అబ్యూజ్‌ ప్రొటెక్షన్‌ బిల్లును సాధ్యమైనంత త్వరగా తీసుకురావాలని సూచించారు. అదే సమయంలో అసెంబ్లీలో సోషల్ మీడియా సైకోలను ఉక్కుపాదంతో అణచివేస్తామని సీఎం కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొత్త బిల్లు తెచ్చే దిశగా మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటుతో అడుగులు పడుతున్నాయ్.

ఫేక్ అకౌంట్ల నుంచి పోస్టులు పెట్టినా బుక్ ఖాయమే

ప్రస్తుతం ఏపీలో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిని ఫేక్ అకౌంట్ల ద్వారా పెట్టినా సరే గుర్తు పట్టేస్తున్నారు. లైకులు కొట్టినా, ఫార్వర్డ్ చేసినా, కమ్యూనిటీ గైడ్ లైన్స్ కట్టు దాటి కామెంట్లు పెట్టినా అందరూ బుక్ అవుతున్నారు. BNSS సెక్షన్ 111 ప్రయోగిస్తుండడంతో చాలా మంది కాళ్లబేరానికి వస్తున్న పరిస్థితి. అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడితే తప్పేముందని ఏపీ హైకోర్టు గతంలో ప్రశ్నించింది కూడా. గతంలో న్యాయమూర్తులను కూడా వదలకుండా దూషిస్తూ పోస్టులు పెట్టారని గుర్తు చేసింది ధర్మాసనం. సోషల్‌ మీడియా పోస్టులను తేలికగా తీసుకోవద్దు. వాటిని ఎవిడెన్స్‌గా పరిగణిస్తారు. ఒకవేళ పోస్ట్‌ పెట్టి వెంటనే డిలీట్‌ చేసినా అది కూడా రికార్డ్‌ అవుతుంది. రిట్రైవ్ చేస్తారు కూడా. చిన్నపిల్లలను ఇబ్బంది పెట్టినట్లుగా ఉంటే పోక్సో చట్టం సెక్షన్‌ 57-బీ కింద, ఎస్సీఎస్టీలను ఇబ్బంది పెడితే అట్రాసిటీ కింద కేసులు బుక్ అవుతాయ్. ఏపీలో సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లు వచ్చి చట్టంగా మారితే శిక్షలను కఠినం చేసే అవకాశం ఉంది. సో ఏపీలో బిల్లు తెస్తే అది దేశవ్యాప్తంగా పార్లమెంట్ లోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే స్వచ్ఛమైన సోషల్ మీడియా చూడగలుగుతామన్న నమ్మకం కూడా చాలా మందిలో కలుగుతోంది.

సోషల్ మీడియా వార్‌లో విజేతలెవరూ లేరు

ఏపీలో సోషల్ మీడియా వార్ ఎప్పుడో హద్దులు దాటిపోయింది. ఇందులో విజేతలుగా ఎవరూ మిగలలేదు. అందరూ బాధితులే. ముఖ్యంగా మహిళల క్యారెక్టర్ టార్గెట్ గా జరిగిన పోస్టింగ్ లు సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేశాయి. కొందరి అత్యుత్సాహం రెండు వైపులా నష్టాన్నే మిగులుస్తోంది. వీటితో రాజకీయంగా ఉపయోగం లేకపోగా అన్నీ సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి.
ఏపీలో రాజకీయాలకు గతంలో మహిళలే మొదటి టార్గెట్ అయ్యారు. ఇటీవలి కాలంలో ఈ విపరీత ధోరణి మరింతగా పెరిగింది. అందుకే ఈ కొత్త చట్టంపై అడుగులు వేగంగా పడుతున్నాయ్. పైగా ఇప్పుడు ఏ చిన్న వర్షం పడ్డా రాజధాని అమరావతి ప్రాంతం మునిగిపోతుందన్న ప్రచారాలు పెరిగాయ్. వీటన్నిటికీ కౌంటర్ గా కొత్త చట్టం రూపంలో కథ మారబోతోంది.

Also Read: గణేశ్ శోభాయాత్రకు భారీ భద్రత.. 40 లక్షల మంది భక్తుల పాల్గొంటారని అంచనా

ఈ కొత్త చట్టం రూపకల్పన సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంలో పాజిటివ్ రిజల్ట్ ఇవ్వగలుగుతుందనుకున్నా.. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కులపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న వెర్షన్ వినిపిస్తుంది. వైఎస్ఆర్‌సీపీ ఈ చట్టాన్ని రాజకీయ ప్రతీకారంగా, విమర్శలను అణచివేసే ప్రయత్నమని ఆరోపిస్తోంది. సుగాలి ప్రీతి కేసు వంటి సున్నితమైన అంశాలు పొలిటికల్ టర్న్ గా మారడం, ఫేక్ న్యూస్ ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టించడంతో ఏపీ రాజకీయాల్లో ఉద్రిక్తతను పెంచుతున్నాయి. కొత్తగా చేసే చట్టం తప్పుడు ప్రచారాన్ని కంట్రోల్ చేస్తుందన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉంది. అందులో సున్నిత అంశాలు కూడా ఉన్నాయి. మరి ఏం జరుగుతుందన్నది చట్టంగా మారాక తేలనుంది.

Story By Vidya Sagar, Bigtv

Related News

AP Liquor Scam: మిథున్ రెడ్డికి బెయిల్.. రిలీజ్ ఎప్పుడంటే..?

Jagan To Assembly: అసెంబ్లీకి వద్దులే.. సింపతీ వస్తే చాలులే

Turakapalem Deaths: ఆ గ్రామ ప్రజలు వంట చేసుకోవద్దు.. ఆదేశాలు జారీ చేసిన సీఎం

AP Govt Schemes: ఏపీకి స్పెషల్ అవార్డు.. దీని వెనుక అసలు కథ ఇదే!

Chandra Grahanam 2025: సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం.. శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన..!

Big Stories

×