E-Paper
Advertisement

Multani Mitti For Skin Glow: ముల్తానీ మిట్టితో.. మొటిమలు మాయం

Multani Mitti For Skin Glow: ముల్తానీ మిట్టితో.. మొటిమలు మాయం
Advertisement

Multani Mitti For Skin Glow:  ఏ వయసు వారైనా సరే.. తమ ముఖం యొక్క గ్లో చెక్కుచెదరకుండా ఉండాలని కోరుకుంటారు. అంతే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలా హోం రెమెడీస్‌ని ఉపయోగిస్తారు. అలాంటి వారు ఇంట్లోనే ఉండే ముల్తానీ మిట్టినితో ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ముల్తానీ మిట్టి ముఖానికి ఉపయోగించడం వల్ల చర్మం యొక్క గ్లో పెరుగుతుంది. అంతే కాకుండా ముఖంపై మొటిమలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఫేస్ చాలా స్మూత్ గా కూడా మారుతుంది. ఎలాంటి ఖర్చు లేకుండానే ముల్తానీ మట్టితో గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

Advertisement

ముఖ్యంగా ముల్తానీ మిట్టి చర్మానికి మేలు చేస్తుంది. ఇందులో పెరుగు, రోజ్ వాటర్, నిమ్మరసం కలిపితే దాని లక్షణాలు మరింత పెరుగుతాయి.మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫేస్ ప్యాక్ తయారీ..

Advertisement

కావలసినవి:
ముల్తానీ మిట్టి – 2 టేబుల్ స్పూన్లు
రోజ్ వాటర్ – 2 టేబుల్ స్పూన్లు
పెరుగు – 1 టేబుల్ స్పూన్
నీరు – 1 టేబుల్ స్పూన్లు (సన్నని పేస్ట్ చేయడానికి)
నిమ్మరసం – 1 స్పూన్

ఎలా అప్లై చేయాలి ?

ముందుగా మీ ముఖాన్ని తేలికపాటి క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ఒక బౌల్‌లో పైన చెప్పిన మోతాదుల్లో ముల్తానీ మిట్టిని తీసుకుని అందులో రోజ్ వాటర్, పెరుగు, నీరు, నిమ్మరసం కలపండి . ఆ తర్వాత దీనిని పేస్ట్ లాగా చేయండి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా వేయండి. ఆ తర్వాత 15 నిమిషాల పాటు ఉంచి ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

Also Read: ఈ ఫేస్ ప్యాక్ ఒక్కసారి ట్రై చేస్తే చాలు.. మెరిసిపోతారు

ముల్తానీ మిట్టి  పేస్ ప్యాక్ ప్రయోజనాలు..
ముల్తానీ మిట్టి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా ముఖంపై మొటిమలు రాకుండా చేస్తుంది.
పెరుగు , నిమ్మరసంలో ఉండే పోషకాలు పేస్ పై ఉన్న జిడ్డును తొలగించి అందంగా మెరిసేలా చేస్తాయి.
రోజ్ వాటర్ చర్మ సౌంద్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×