BigTV English
Advertisement

Boys Qualities: అబ్బాయిలూ మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే, మీకు ఈ జన్మలో గర్ల్ ఫ్రెండ్ దొరకదు

Boys Qualities: అబ్బాయిలూ మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే, మీకు ఈ జన్మలో గర్ల్ ఫ్రెండ్ దొరకదు

ప్రేమ, పెళ్లి… ఈ రెండూ జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. అమ్మాయిలు ఒకప్పుడు ఇంట్లో ఎవరిని చూస్తే వారినే పెళ్లి చేసుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో మారాయి. ఆధునిక కాలంలో అమ్మాయిలు తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. వివాహానికి ముందు అమ్మాయిలు కాబోయే జీవిత భాగస్వామి గురించి కొన్ని అంచనాలను ముందే ఊహించుకుంటున్నారు. ఆ అంచనాలను చేరుకుంటేనే వారు అబ్బాయిలని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. వారి జీవిత భాగస్వామి విషయంలో మాత్రం రాజీ పడడం లేదు. వివాహానికి సంబంధించి అబ్బాయిల్లో కొన్ని లక్షణాలు ఉంటే అమ్మాయిలు చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి అబ్బాయిల్లో ఎలాంటి లక్షణాలు అమ్మాయిలకు నచ్చవో తెలుసుకోవాల్సిన అవసరం మగవారికి ఉంది.


అమ్మాయిలు జీవితంలో స్వేచ్ఛను కోరుకుంటారు. తల్లిదండ్రులు తమను ఎంత ప్రేమగా, స్వేచ్ఛగా పెంచారో… జీవిత భాగస్వామి కూడా అంతే స్వేచ్ఛను ఇవ్వాలని కోరుకుంటారు. కండిషన్లు పెట్టే అబ్బాయిలను పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ఇష్టపడరు. కాబట్టి మీకు అలాంటి కండిషన్లు పెట్టే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి.

సంబంధాలకు విలువ ఇచ్చే వారిని అమ్మాయిలు ఇష్టపడతారు సంబంధాలను కేవలం గడ్డిపోచలా తెంపేసుకుంటే అలాంటి అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడరు. సంబంధ బాంధవ్యాల విషయంలో విలువనిచ్చేవారిని అమ్మాయిలు పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడతారు. కాబట్టి మీరు అనుబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.


జంతువులను హింసించడం, జంతువులను చూసి అసహ్యించుకునే వారిని అమ్మాయిలు ఇష్టపడరు. ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువమంది జంతు ప్రేమికులు. వారు రోడ్డుమీద కనిపించే బుజ్జి కుక్క పిల్లలను కూడా ప్రేమగా చూస్తారు. మీరు వాటిని చూసి అసహ్యించుకోవడం,  తిట్టడం వంటివి చేస్తే అమ్మాయిలు మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు.

కొట్టుకోబోయే భార్యకు విలువిచ్చే మనిషిని అమ్మాయిలు కోరుకుంటారు. కాబట్టి మీరు చేసుకోబోయే అమ్మాయి పక్కన ఉన్నప్పుడు ఇతరులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, వారి గురించి ఎక్కువగా మాట్లాడటం వంటివి చేయకూడదు.

మాట ఇచ్చి తప్పే మగవారిని అమ్మాయిలు అస్సలు ఇష్టపడరు. మీరు మాట ఇస్తే అది పెట్టుకోవడానికి ప్రయత్నించండి. లేకుంటే మీ బంధం పెళ్లి వరకు చేరుకోదు. మాట ఇచ్చి తప్పే మనుషులను ఆడవాళ్ళందరూ పక్కన పెడతారు. అలాంటి వారిని నమ్మకూడదనుకుంటారు. కాబట్టి పెళ్లికి ముందు మీరు అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వారికి ఇచ్చిన మాటను ఎప్పటికప్పుడు నిలబెట్టుకోవాలి. లేకపోతే మీ పెళ్లి జరగడం కష్టమే.

ఎదుటివారు చెబుతున్నది వినకుండా గట్టిగా అరవడం, చీటికిమాటికి గొడవలు పడడం వంటివి అమ్మాయిలకు ఇష్టపడరు. కాబట్టి అమ్మాయిల ముందు మీరు ఇతరులతో గొడవలు పడడం, అరవడం, బూతులు తిట్టడం వంటివి చేయకండి. అలాంటి లక్షణాలు మీలో ఉంటే అమ్మాయి ఆ క్షణమే మీపై విరక్తి చెంది వదిలేస్తుంది.

నిర్ణయాలు సరిగ్గా తీసుకుని అబ్బాయిలు.. అమ్మాయిలు మనసులకు నచ్చుతారు. మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం రేపటికి మార్చుకుంటూ ఉంటే యువతులు వారిని ఇష్టపడరు. ఎందుకంటే పెళ్లయిన తర్వాత కూడా మీరు సరైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పెడతారేమో అని అనుమానిస్తారు. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అబ్బాయిల్ని అసలు ఇష్టపడరు.

Also Read: ఈ మూడు లక్షణాలు కనిపిస్తే.. అతడు మీ స్నేహితుడు కాదు, శత్రువు అని అర్థం చేసుకోండి

ఇతరులతో సున్నితంగా ఉండే అబ్బాయిలే అమ్మాయిలకు నచ్చుతారు. తప్పు ఎదుటివారిదైనా ఒక ‘సారీ’ చెబితే ఎలాంటి సమస్యలు రావని అమ్మాయిలు నమ్ముతారు. కాబట్టి చిన్న చిన్న విషయాలకి ఇతరులపై అరవకుండా క్షమించమని అడిగే అబ్బాయిలు… అమ్మాయిలకు ఎంతో మంచిగా కనిపిస్తారు. అలా అని మరీ అతిగా సారీలు చెబుతూ ఉంటే అమ్మాయిలకి విరక్తి రావడం ఖాయం. కాబట్టి తక్కువగా మాట్లాడడం, సున్నితంగా ఉండడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఇతరులపై అరవకపోవడం, ఉన్నంతలో జీవించడం, గొప్పలు చెప్పకపోవడం, అతిగా ఖర్చు పెట్టకపోవడం ఇలాంటివన్నీ అమ్మాయిలకి నచ్చుతాయి. కాబట్టి మీరు ఈ లక్షణాలను కలిగి ఉంటే త్వరగా ఏ అమ్మాయి అయినా మిమ్మల్ని ఇష్టపడుతుంది.

Related News

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి!

Big Stories

×