Thandel Trailer: అక్కినేని నాగచైతన్య నటిస్తున్న పాన్ ఇండియా సినిమా తండేల్. కార్తికేయ 2 సినిమాతో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చై సరసన లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి నటిస్తుంది. మొదటి నుంచి ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి.
డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం, లవ్ స్టోరీ లాంటి హిట్ సినిమా తరువాత చై- సాయిపల్లవి కలిసి నటించడం.. పాత్ర నచ్చకపోయినా.. ప్రాధాన్యత లేకపోయినా సాయిపల్లవి ఏ సినిమాను ఒప్పుకోదు. అలాంటింది ఈ సినిమా ఒప్పుకోవం.. మొట్టమొదటిసారి చై పాన్ ఇండియా సినిమా చేయడం.. ఇలా తండేల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతూ వస్తున్నాయి. ఇక వీటన్నింటికి తోడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్.
Sankranthiki Vasthunam: బ్లాక్ బస్టర్ పొంగల్ వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్
ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతి సాంగ్.. చార్ట్ బస్టర్ గా నిలిచాయి. వింటేజ్ దేవిశ్రీ మ్యూజిక్ అంటే ఇలానే ఉంటుందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. తాజాగా తండేల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
తండేల్ రాజుగా నాగచైతన్య కనిపించగా.. సత్య అనే పాత్రలో సాయిపల్లవి కనిపించింది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను మరోసారి అలరిస్తుందని చెప్పొచ్చు. చై నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు చై చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు.. తండేల్ మరో ఎత్తు అనిపించేలా అతని ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఒక మత్స్యకారుడిగా చై జీవించేశాడు. ఇక సాయిపల్లవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
” రాజు.. ఊర్లో అందరు ఏటేటో మాట్లాడుకుంటున్నార్రా” అంటూ సాయిపల్లవి చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలయ్యింది. ఇక రాజు- సత్యల లవ్ స్టోరీ ఎంతో చూడచక్కగా ఉంది. కొన్ని కారణాల వలన రాజు.. ఏటికి పోవాల్సి వస్తుంది. సత్య ఎంత చెప్పినా వినకుండా రాజు సముద్రంలోకి వెళ్తాడు. అక్కడ చేపల పట్టేవారందరిని పాకిస్తాన్ సైన్యం అరెస్ట్ చేస్తుంది. ఇక అక్కడినుంచి రాజు.. ఇంటికి ఎలా చేరుకున్నాడు.. ? రాజు కోసం సత్య ఏం చేసింది.. ? చివరికి రాజు- సత్య కలిశారా .. ? అన్నది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.
మొదటి నుంచి కూడా తండేల్ అంటే ఏంటి.. ? అనే అనుమానం ప్రేక్షకుల్లో ఉంది. తండేల్ అంటే గుజరాత్ లో బోట్ ఆపరేటర్ అని చందూ మొండేటి చెప్పుకొచ్చాడు. ఇక ట్రైలర్ లో తండేల్ కు అసలైన అర్ధం చెప్పుకొచ్చాడు. తండేల్ అంటే ఓనర్ కాదు.. లీడర్ అని చెప్పుకొచ్చాడు. మరి ఈ లీడర్.. తన ప్రజల ప్రాణాలను ఎలా కాపాడాడు అనేది తెలియాలంటే ఫిబ్రవరి 7 వరకు ఆగాల్సిందే.