E-Paper
Advertisement

Rock Salt: రాక్ సాల్ట్‌తో జీర్ణ సమస్యలు దూరం.. మరెన్నో ప్రయోజనాలు

Rock Salt: రాక్ సాల్ట్‌తో జీర్ణ సమస్యలు దూరం.. మరెన్నో ప్రయోజనాలు
Advertisement

Rock Salt: మన దేశంలో రాళ్ల ఉప్పును ఉపవాస సమయంలో ఎక్కువగా తింటారు. మరికొందరు దీనిని ఆహార పదార్థాల తయారీలో కూడా చేర్చుకుంటారు. గత కొన్ని దశాబ్దాలలో, రాతి ఉప్పు స్థానంలోనే తెల్ల ఉప్పు వాడుకలోకి వచ్చింది. ఇదిలా ఉంటే లక్షణాల పరంగా రాక్ సాల్ట్, సాధారణ తెల్ల ఉప్పు కంటే ఇది చాలా మెరుగైనది. రాక్ సాల్ట్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు శరీరానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది.

రాక్ సాల్ట్‌ను రాతి ఉప్పు అని కూడా పిలుస్తారు. ఇది సహజంగా లభించే ఉప్పు. ఇది సాధారణ ఉప్పు కంటే తక్కువ ప్రాసెస్ చేయబడుతుంది. అనేక ఖనిజాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో ఇది అనేక వ్యాధులకు దివ్యౌషధంగా పరిగణించబడుతుంది.

Advertisement

రాతి ఉప్పు తినడం వల్ల 5 పెద్ద ప్రయోజనాలు..

జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది:
రాతి ఉప్పు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి దోహదం చేస్తుంది. అంతే కాకుండా మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తుంది. అజీర్ణం సమస్యతో ఇబ్బందిపడేవారు తరుచుగా రాక్ సాల్ట్ తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Advertisement

శరీరంలోని నీటి పరిమాణాన్ని సమతుల్యంగా ఉంచుతుంది:
రాతి ఉప్పు శరీరంలోని నీటి పరిమాణాన్ని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరం నుండి వ్యర్థాలను తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది.

ఎముకలను బలపరుస్తుంది:
రాక్ సాల్ట్‌లో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఎముకల బలహీనతతో బాధపడే వారికి రాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఆహారంలో రాక్ సాల్ట్ ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.

రక్తపోటును నియంత్రిస్తుంది:
తక్కువ లేదా అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొనే వారు రాక్ సాల్ట్ ను తినాలి. రాతి ఉప్పు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె సంబంధిత సమస్యలతో  ఇబ్బంది పడేవారు రాక్ సాల్ట్ తినడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. శరీరానిరి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.

Also Read: ఈ 5 అలవాట్లతో అనారోగ్య సమస్యలు రావు

చర్మానికి మేలు చేస్తుంది:
రాతి ఉప్పు చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఇది మొటిమలు, మచ్చలు, ఇతర చర్మ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.

జాగ్రత్తలు:
రాక్ సాల్ట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించినప్పటికీ అధిక వినియోగం ఆరోగ్యానికి హానికరం.

మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే.. రాక్ సాల్ట్ తీసుకునే ముందు మీరు వైద్యుడిని సంప్రదించండి.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

Big Stories

Advertisement
×