E-Paper
Advertisement

Raja Saab: ఫ్యాన్స్ కి శుభవార్త.. డార్లింగ్ ఫ్యాన్స్ కోసం మరో వరల్డ్..!

Raja Saab: ఫ్యాన్స్ కి శుభవార్త.. డార్లింగ్ ఫ్యాన్స్ కోసం మరో వరల్డ్..!
Advertisement

Raja Saab.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా హీరో అయిపోయిన రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas ),ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా హీరోగా పేరు దక్కించుకున్న ప్రభాస్ బాహుబలి 2 తో ఆ ఇమేజ్ కాస్త మరింత పెరిగిపోయింది. ఆ తర్వాత వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నా.. సరైన విజయం మాత్రం వరించలేదు. అయితే ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898AD సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు ప్రభాస్. రూ.700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.1800 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

ప్రభాస్ అభిమానులకు శుభవార్త..

Advertisement

ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం రాజా సాబ్. ప్రముఖ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్తగా కనిపించబోతున్నట్లు సమాచారం. హర్రర్, కామెడీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ రిద్ది కుమార్ మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిభట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులే అవుతున్న ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ రాకపోవడం అభిమానులలో తీవ్ర నిరాశను మిగులుస్థోందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తూ.. తాజాగా ప్రెస్ మీట్ లో.. ప్రభాస్ పుట్టినరోజు నాడు అనగా అక్టోబర్ 23 నుంచి ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లు ఇస్తామని అటు అభిమానులను ఇటు మీడియా మిత్రులను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తామని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్ తెలిపారు.

అభిమానుల కోసం మరో ప్రపంచం..

Advertisement

ఎస్ కే ఎన్ విషయానికి వస్తే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా పేరు దక్కించుకున్నారు. మాస్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై సహ వ్యవస్థాపకుడిగా , యజమానిగా కూడా పేరు దక్కించుకున్న ఈయన,మంచి రోజులు వచ్చాయి, రొమాన్స్, 3 రొసెస్ వంటి ఓటిటి సిరీస్ లనే కాకుండా బేబీ, ఈ రోజుల్లో , భలే భలే మగాడివోయ్ వంటి చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం రాజాసాబ్ చిత్రానికి సహానిర్మాతగా పనిచేస్తున్నారు ఎస్కేఎన్. ఈ నేపథ్యంలోనే ఒక ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయన రాజాసాబ్ గురించి చెప్పుకొచ్చారు. అటు మారుతి ఇటు ప్రభాస్ ఇద్దరూ కూడా ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రభాస్ పుట్టిన రోజు నుంచి ఇక వరుస అప్డేట్లు ఇస్తాము.. సినిమా విడుదలయ్యే వరకు కూడా అదే జోష్ లో అభిమానులను నింపబోతున్నాము అంటూ ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×