E-Paper
Advertisement

Pulses Storage Tips: పప్పులకు పురుగు పడుతుందా? ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి

Pulses Storage Tips: పప్పులకు పురుగు పడుతుందా?  ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి
Advertisement

Pulses Storage Tips: వంట గదిలో ఆహార వస్తువులను ఎక్కువ రోజుల పాటు నిలువ చేస్తే పురుగులు పడుతుంటాయి. ఇందులో మరీ ముఖ్యంగా పప్పు దినుసులకు త్వరగా పురులుగు పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ తరునంలో పప్పులకు పురుగులు పట్టకుండా ఉండేందుకు మహిళలు మార్కెట్లో దొరికే రసాయనాలు వాడుతుంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి అసలు మంచివి కావని.. ఇబ్బందులు కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు. పురుగులు పట్టకుండా ఉండేందుకు వాడే బోరిక్ యాసిడ్ వంటి రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అందువల్ల రసాయనాలు కాకుండా ఇంట్లోని ఆరోగ్య చిట్కాలు పాటిస్తే మంచిది. మరి అవేంటో తెలుసుకుందాం.

Advertisement

ఇంగువ..

ఇంగువతో పప్పులను పురుగుల బారి నుండి రక్షించవచ్చు. డబ్బాలలో పప్పులను స్టోర్ చేసుకునే ముందు ఈ చిన్న పదార్థాన్ని ఉపయోగిస్తే ఎటువంటి సమస్యలు రావట. పప్పు చారులో ఉపయోగించే ఇంగువకు పప్పులకు పురుగులు పట్టకుండా ఉండేలా కూడా కాపాడుతుంది. ఘాటు వాసనతో ఉండే ఇంగువ స్మెల్ వల్ల పురుగులు దెబ్బకు పారిపోతాయి లేదా చచ్చిపోతాయి. అందువల్ల బియ్యం పప్పులు వంటి ఎక్కువ కాలం నిల్వ ఉంచే వాటిలో ఇంగువను వేయడం వల్ల పురుగులు పట్టకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Also Read: మహిళలు కట్టుకునే చీరలతో కూడా క్యాన్సర్ బారిన పడతారని మీకు తెలుసా ?

ఎలా ఉపయోగించాలి..

ఇంగువను చిటికెడంత తీసుకుని ఒక బట్టలో చుట్టాలి. దానిని బియ్యం లేదా పప్పులను స్టోర్ చేసే డబ్బాలలో ఉంచాలి. అందువల్ల ఇంగువ వాసన ఆ డబ్బాలో మొత్తం వ్యాపించి చెడు వాసనను కూడా నియంత్రిస్తుంది. అంతేకాదు ఇంగువను ఆరోగ్య సమస్యలకు కూడా ఉపయోగిస్తారని చాలా మందికి తెలియదు. శ్వాస సమస్యలతో బాధపడుతున్న వారికి ఇంగువ చాలా మేలు చేస్తుంది. ఇంగువకు కఫాన్ని తగ్గించే శక్తి ఉండడం వల్ల ఏ సమస్యను అయినా తరిమికొడుతుంది. ఇంగువ పొడిని కాస్త తేనె, అల్లం రసంలో కలుపుకుని తీసుకోవడం వల్ల దగ్గు సమస్యకు దూరం అవ్వొచ్చు.

Tags

Related News

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

Big Stories

Advertisement
×