Goa Tour Package 2024: సమ్మర్ వచ్చిందంటే చాలు లో ప్రతి ఒక్కరు టూర్లు కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్లాలా.. తక్కువ బడ్జెట్ తో ఏ ప్రదేశానికి వెళ్లాలా అని చూస్తూ ఉంటారు. పైగా సమ్మర్ హాలిడేస్ కావడంతో గోవా వెళ్లేందుకు అక్కడ బీచ్ ల్లో ఆహ్లాదకరంగా గడిపేందుకు ప్రతి ఒక్కరు టూర్లు కోసం ప్లాన్ చేస్తుంటారు. వీకెండ్ టూర్ కి వెళ్లాలనుకునే వారి కోసం టూరిజం సంస్థలు గోవాకు ప్రత్యేక టూర్ ప్యాకేజీను ప్రకటిస్తున్నాయి.
ఇప్పటికే హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లేందుకు ఐర్ సీటీసీ టూరిజం ట్యూర్ ప్యాకేజి ఆపరేట్ చేస్తుంది. అతి తక్కువ బడ్జెట్ తో ఎలా వెళ్లాలో ఇప్పడు చూద్దాం. ఒక వ్యక్తి కేవలం 1000 రూపాయలతోనే గోవాకు వెళ్లి రావచ్చు. అవునండి బాబు, ఇది నిజం ఎలాగంటే.. గోవాకు వెళ్లేందుకు ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి.
Also Read: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 733 పోస్టులు.. తొందరగా అప్లై చేసేయండి..
కాచిగూడ నుంచి ఎలహంక వరకు వెళ్లే రైలు గోవా మీదగా వెళ్తుంది. అందుకోసం 17 గంటల 15 నిముషాల టైం పడుతుంది. ఇక టిక్కెట్ ఛార్జ్ విషయానికి వస్తే స్లీపర్ క్లాస్ విభాగంలో ఒక పర్సన్ కి 425 రూపాయలు భారతీయ రైల్వే ఛార్జ్ ఇస్తుంది. గోవా నుంచి తిరిగి ప్రయాణం చేసేందుకు కూడా టికెట్ బుక్ చేసుకువోచ్చు.
దీంతో ఎంచక్కా మీరు గోవా వెళ్లిరావచ్చు. ఈ ట్రైన్ వారానికి నాలుగు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇద్దరు, ముగ్గురు స్నేహితులు కలిసి వెళ్లిన కూడా మూడు వేల రూపాయలతో గోవా ట్రిప్ అవుతుంది. ఇంకా అక్కడ ఖర్చులు అంటారా.. మీ ఇష్టాన్ని బట్టి ఖర్చు చేసుకోవచ్చు. అయితే గోవా టూర్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి, పైగా సమ్మర్ హాలిడేస్ కాబట్టి, కొన్ని రోజులు ముందుగానే మీరు టికెట్ ని బుక్ చేసుకుంటే మంచిది. దీంతో ఈజీగా తక్కువ ఖర్చుతో గోవా ట్రిప్ వెళ్లి ఎంజాయ్ చేసి రావచ్చు.