BigTV English

Family Star: విజయ్ కన్నా ముందు ఫ్యామిలీ స్టార్ కు అనుకున్న హీరో ఎవరో తెలుసా.. ?

Family Star: విజయ్ కన్నా ముందు ఫ్యామిలీ స్టార్ కు అనుకున్న హీరో ఎవరో తెలుసా.. ?


Family Star: ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు ముందే రాసి ఉంటుందన్ని పెద్దలు చెప్తారు. అలాగే ఇండస్ట్రీలో కూడా ప్రతి సినిమా మీద హీరో పేరు రాసి ఉంటుంది. ఏ హీరోకు రాసిపెట్టి ఉంటే.. ఆ కథ ఎక్కడికి వెళ్లినా ఆ హీరో దగ్గరకే వచ్చి చేరుతుంది. ఇది చాలాసార్లు రుజువయ్యిందికూడా. ఇప్పుడెందుకు మనం ఇంత ఫిలాసఫీగా మాట్లాడుకుంటున్నాం అంటే.. ఇండస్ట్రీలో సాధారణంగా ఒక సినిమా ఒక హీరో కోసం రాసుకొంటే.. ఇంకో హీరోతో చేయాల్సి వచ్చింది. ముందు ఈ హీరోయిన్ ను అనుకున్నాం.. ఆ తరువాత వేరే హీరోయిన్ ను తీసుకొచ్చా.. ఇలాంటి మాటలు వింటూనే ఉంటాం.

తాజాగా రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా.. విజయ్ దేవరకొండ చేయాల్సింది కాదు. అవును.. మీరు వింటుంది నిజమే.. మొదట ఈ కథ నాగ చైతన్య దగ్గరకు వచ్చింది. నిర్మాత కూడా దిల్ రాజు కాదు.  ఏంటి ఇదంతా కన్ఫ్యూజ్ గా ఉంది.. అనుకుంటున్నారా.. ? డిటైల్డ్ గా మాట్లాడుకుందాం రండి.


పరుశురామ్ పెట్ల.. గీతగోవిందం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక సక్సెస్ డైరెక్టర్ ను ఏ హీరో, నిర్మాత వదలాలి అనుకోరు. అందుకే అల్లు అరవింద్ కూడా పరుశురామ్ తదుపరి సినిమా తన బ్యానర్ లో చేయాలని అడ్వాన్స్ కూడా ఇచ్చి లాక్ చేశాడు. ఇక ఈ సినిమానే నాగేశ్వరరావు. అక్కినేని నాగచైతన్య హీరోగా ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాలం గడుస్తున్న కొద్దీ ఈ సినిమా పట్టాలెక్కడం దేవుడు ఎరుగు. డైరెక్టరే పత్తా లేకుండా పోయాడు. అల్లు అరవింద్, చై అతని కోసం రెండేళ్లు వరకు ఎదురుచూసారు.

పరుశురామ్ సైతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, కథ మార్చాలని ఇలా చెప్పుకుంటూ తిరిగాడు. ఈలోపే మహేష్ బాబు డేట్స్ దొరికాయి. సర్కారువారి పాటపై అంచనాలు పెరిగాయి. దీంతో చైను పక్కకు నెట్టి.. మొదట మహేష్ తో సినిమా తీశేశాడు. ఆ తరువాత విజయ్ దేవరకొండతో కథా చర్చలు జరుగుతుండడంతో.. చైకు కోపం వచ్చి.. సినిమా చేయను అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు చై తో చేయాలనుకున్న కథనే విజయ్ తో ది ఫ్యామిలీ స్టార్ గా తెరకెక్కించాడు. ఇక అల్లు అరవింద్.. చైతో తండేల్ లాంటి రా అండ్ రస్టిక్ సినిమాను నిర్మిస్తున్నాడు. ఉదయం నుంచి ఫ్యామిలీ స్టార్ మిక్స్డ్ టాక్ అందుకోవడంతో చై అభిమానులు.. నువ్వు తప్పుకొని మంచి పనిచేసావ్ అన్నా అని కొందరు.. నాగ చైతన్య తప్పించుకున్నాడు.. విజయ్ బలి అయ్యాడు , మనం సేఫ్ అని చై, అల్లు అరవింద్ అనుకుంటూ ఉంటారు అని ఇంకొందరు కామెంట్స్ పెట్టుకొస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×