E-Paper
Advertisement

Food For High Cholesterol: కొలెస్ట్రాల్ తగ్గాలా ? వీటిని పొరపాటున కూడా తినొద్దు !

Food For High Cholesterol: కొలెస్ట్రాల్ తగ్గాలా ? వీటిని పొరపాటున కూడా తినొద్దు !
Advertisement

Food For High Cholesterol: ఈ రోజుల్లో అధిక కొలెస్ట్రాల్ సాధారణ సమస్యగా మారింది. కానీ దానిని నిర్లక్ష్యం చేయడం అనేది తీవ్రమైన ప్రమాదాన్ని ఆహ్వానించినట్లే. ఊబకాయం మాత్రమే ఈ వ్యాధికి మూలకారణమని అనుకుంటాం. కానీ సన్నగా ఉన్నవారు కూడా వారి సిరల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవచ్చు . మీ కొలెస్ట్రాల్ రిపోర్ట్ లో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నట్లు చూపిస్తే.. లేదా మీరు గుండె జబ్బులను నివారించాలనుకుంటే.. ఈ మూడు రకాల ఆహార పదార్థాలను తినడం మానేయాలి. ఇంతకీ ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిదనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రాన్స్ ఫ్యాట్స్:
ముందుగా మార్కెట్‌లో దొరికే వేయించిన ఆహార పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి. సమోసాలు, కచోరీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, ప్యాక్ చేసిన చిప్స్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఈ కొవ్వులు మీ శరీరానికి విషం లాంటివి. అవి మీ ” చెడు ” కొలెస్ట్రాల్ ( LDL)ను పెంచడమే కాకుండా.. మీ “మంచి” కొలెస్ట్రాల్ ( HDL)ను కూడా తగ్గిస్తాయి. మీరు గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే.. ఈరోజు నుంచే వీటికి దూరంగా ఉండండి.

Advertisement

ప్రాసెస్ చేసిన మాంసం:
మీరు శాఖాహారులు కాకపోతే.. తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మటన్, సంతృప్త కొవ్వులో ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కొలెస్ట్రాల్‌ను నేరుగా పెంచుతుంది. అంతే కాకుండా ఈ కలయిక మీ గుండె ఆరోగ్యానికి చాలా హానికరం. వీటికి బదులుగా మీరు స్కిన్ లెస్ చికెన్ లేదా చేపలను ఎంచుకోవచ్చు .

Also Read: వారాల తరబడి బెడ్‌షీట్లు మార్చడం లేదా? అయితే ఈ సమస్యలు తప్పవు!

Advertisement

స్వీట్లు, పిండి పదార్థాలు:
“తీపికి కొలెస్ట్రాల్ తో సంబంధం ఏంటి ?” అని మీరు అనుకోవచ్చు. ఇది చాలా బలమైన సంబంధం. మీరు ఎక్కువగా చక్కెర, స్వీట్లు, కూల్ డ్రింక్స్ లేదా శుద్ధి చేసిన పిండితో తయారు చేసిన ఆహారాలు ( పాస్తా, బిస్కెట్లు వంటివి ) తిన్నప్పుడు.. మీ కాలేయం వాటిని ట్రైగ్లిజరైడ్లుగా మారుస్తుంది. ట్రైగ్లిజరైడ్లు కూడా ఒక రకమైన కొవ్వు . అవి పెరిగినప్పుడు.. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపు తప్పుతాయి. కాబట్టి.. మీరు మీ కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలనుకుంటే.. మీ చక్కెర తీసుకోవడం పరిమితం చేయడం చాలా ముఖ్యం.

మనం ఏమి తినాలి ?
మీ ఆహారంలో ఫైబర్ పెంచుకోండి. ఓట్స్, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, గింజలు (బాదం, వాల్‌నట్‌లు వంటివి) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవి సిరల్లో పేరుకుపోయిన అదనపు కొవ్వులను గ్రహించి బయటకు పంపడంలో సహాయ పడతాయి. గుర్తుంచుకోండి. రుచి తాత్కాలికమే.. కానీ గుండె ఆరోగ్యం జీవితాంతం ఉంటుంది.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×