E-Paper
Advertisement

Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, 17 మంది సజీవ దహనం, మరికొందరి

Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, 17 మంది సజీవ దహనం, మరికొందరి
Advertisement

Bus Accident: కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చిత్రదుర్గలోని సమీపంలోని హిరియూర్ వద్ద ఓ బస్సు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 17 మందికి పైగా సజీవ దహనమైనట్టు తెలుస్తోంది. వేగంగా వస్తున్న ఓ బస్సు.. కంటైనర్‌ లారీని ఢీ కొట్టింది. వెంటనే మంటలు చెలరేగాయి. చాలామంది గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

బెంగుళూరు నుంచి గోకర్ణకు ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు వెళ్తోంది. గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బస్సు వేగంగా వెళ్తోంది. ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీ కొట్టింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్పాట్‌లో 17 మంది సజీవ దహనమయ్యారు.

Advertisement

ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఘటన సమయంలో బస్సులో 32 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వారంతా గాఢమైన నిద్రలో ఉన్నారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపు చాలామంది దహనమయ్యారు. అందులో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. 

లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, 17 మంది సజీవ దహనం

కొంతమంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకున్నారని, మరికొందరు దిగి తమ ప్రాణాలను కాపాడుకోగలిగారని స్థానికులు చెబుతున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

ప్రమాదానికి గురైన బస్సు సీ బర్డ్ ట్రావెల్‌కి చెందినది. ఈ బస్సు బెంగళూరు నుండి అర్ధరాత్రి 12 గంటల సమయంలో శివమొగ్గకు బయలుదేరింది. తెల్లవారుజామున దాదాపు మూడు గంటల సమీపంలో హిరియూర్ వద్ద ప్రమాదానికి గురైంది. మొత్తం 31 మంది ప్రయాణికులు బస్సు‌ని బుక్ చేసుకున్నారు. డ్రైవర్ తో సహా 32 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. 

ALSO READ:  తమిళనాడు ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి 

వేగంగా వెళ్తున్న సమయంలో బస్సు ఎదురుగా వస్తున్న కంటైనర్‌ని ఢీకొట్టింది. డీజిల్ ట్యాంక్‌కి మంటలు అట్టుకోవడంతో తొలుత లారీలో మంటలు వ్యాపించాయి.  తర్వాత బస్సు‌కు ఆ మంటలు వ్యాపించాయి. ఈలోగా అటువైపు వెళ్తున్న వాహనదారులు ఆగి, మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రప్రయత్నాలు చేశారు.  వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

వారి వచ్చేసరికి దాదాపు లారీ, బస్సు దాదాపు కాలిపోయాయి. కేవలం 10 మంది ప్రయాణికులు బస్సు నుంచి దిగిపోయారని స్థానికుల మాట. చాలా మంది ప్రయాణికులకు కాలిన గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×