Divorce: విడాకులు అనేది కేవలం ఒక చట్ట పరమైన ప్రక్రియ మాత్రమే కాదు.. అది ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేసే మానసిక, సామాజిక ప్రయాణం. సమాజం విడాకులను ఒక ముగింపుగా చూస్తే.. ఆ అనుభవాన్ని అనుభవించిన వారు దానిని ఒక కొత్త పాఠంగా చూస్తారు. ఆ తర్వాత కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కుంటారు. ఏది ఏమైనా విడాకులు తీసుకున్న వారికి మాత్రమే తెలిసే 30 ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భావోద్వేగ, మానసిక మార్పులు:
ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు: పెళ్లయ్యాక కూడా ఒంటరిగా ఉండటం కంటే.. విడాకుల తర్వాత ఒంటరిగా ఉండటం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.
అపరాధభావం:తప్పు ఎవరిదైనా,”నేను ఇంకా బాగా ప్రయత్నించి ఉంటే బాగుండేదేమో” అనే ఆలోచన అప్పుడప్పుడు వేధిస్తుంది.
విముక్తి: విడాకులు పూర్తయిన తర్వాత ఒక పెద్ద భారం దిగిపోయినట్లు.. స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నట్లు అనిపిస్తుంది.
సమాజం దృష్టి:విడాకులు తీసుకున్న వ్యక్తిని చూసే విధానంలో సమాజం ఇప్పటికీ చిన్నచూపు చూస్తుందని అర్థమవుతుంది.
గౌరవం ముఖ్యం: ప్రేమ లేకపోయినా బతకవచ్చు కానీ.. ఆత్మగౌరవం లేని చోట ఉండలేమని తెలుస్తుంది.
సామాజిక, కుటుంబ సంబంధాలు:
స్నేహితుల ఫిల్టరింగ్: విడాకుల సమయంలో ఎవరు నిజమైన స్నేహితులో.. ఎవరు కేవలం కాలక్షేపానికో అర్థమవుతుంది.
ఫ్యామిలీ ఫంక్షన్లు:పెళ్లిళ్లకు లేదా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు ఎదురయ్యే ప్రశ్నలు ఒక పెద్ద సవాలుగా మారుతాయి.
సపోర్ట్ సిస్టమ్: కష్టకాలంలో కుటుంబం ఇచ్చే మద్దతు విలువ ఏంటో అప్పుడే తెలుస్తుంది.
పిర్యాదులు: విడాకుల తర్వాత ఇద్దరు వ్యక్తులు పరస్పరం నిందించుకోవడం వల్ల వచ్చే నష్టం ఏంటో అర్థమవుతుంది.
పిల్లల బాధ్యత: పిల్లలు ఉన్నప్పుడు ‘కో-పేరెంటింగ్’ చేయడం ఎంత కష్టమో, ఎంత ముఖ్యమో తెలుస్తుంది.
వ్యక్తిగత ఎదుగుదల, పాఠాలు:
స్వయం సమృద్ధి: ఇంట్లో చిన్న చిన్న పనుల నుంచి బ్యాంక్ పనుల వరకు అన్నీ తనే చేసుకోవడం నేర్చుకుంటారు.
నిర్ణయాధికారం: తన జీవితంపై తనకు పూర్తి అధికారం ఉందని గుర్తించడం ఒక కొత్త అనుభూతి.
రెండో పెళ్లిపై భయం: మరోసారి ఎవరినైనా నమ్మాలంటే చాలా సమయం పడుతుంది.
తప్పుల గుర్తింపు: గతంలో తాను చేసిన తప్పులేంటో ప్రశాంతంగా విశ్లేషించుకునే అవకాశం దొరుకుతుంది.
సంతోషం అంటే ఏమిటి: సంతోషం అనేది మరొక వ్యక్తిపై ఆధారపడి ఉండదని అర్థమవుతుంది.
ఆర్థిక, ఆచరణాత్మక విషయాలు:
ఆర్థిక ప్రణాళిక: ఒంటరిగా బతుకుతున్నప్పుడు డబ్బును ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో అర్థమవుతుంది.
చట్టపరమైన చిక్కులు: విడాకుల ప్రక్రియలో కోర్టులు, వకీళ్ల చుట్టూ తిరగడం ఒక నరకంలా అనిపిస్తుంది.
ఇంటి నిర్వహణ: ఇంటిని మెయింటెనెన్స్ చేయడం ఎంత శ్రమతో కూడుకున్నదో తెలుస్తుంది.
ఆరోగ్యంపై శ్రద్ధ: మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా వ్యాయామం ఎంత అవసరమో గుర్తిస్తారు.
అలవాట్ల మార్పు: పాత జ్ఞాపకాలు ఉన్న వస్తువులను, ప్రదేశాలను వదిలేయడం నేర్చుకుంటారు.
మిగిలిన కొన్ని చేదు నిజాలు:
సోషల్ మీడియా: మాజీ భాగస్వామి ప్రొఫైల్‌ను చెక్ చేయడం మానేయడం ఒక పెద్ద విజయం.
క్షమించడం: భాగస్వామిని క్షమించడం కంటే.. తనను తాను క్షమించుకోవడం గొప్ప విషయమని తెలుస్తుంది.
నిద్రలేని రాత్రులు: గతం గురించి ఆలోచిస్తూ గడిపిన రాత్రులు ఎన్నో ఉంటాయి.
సమయం ఔషధం: కాలం గడుస్తున్న కొద్దీ గాయాలు మానిపోతాయని అనుభవపూర్వకంగా తెలుస్తుంది.
సందేశం: విడాకులు అంటే జీవితం ముగిసిపోవడం కాదు, మరో కొత్త అధ్యాయం మొదలవ్వడం.
విడాకులు తీసుకున్న ప్రతి వ్యక్తి ఒక యుద్ధాన్ని గెలిచిన సైనికుడి వంటి వారు. వారు పొందే అనుభవాలు వారిని మరింత దృఢంగా మారుస్తాయి. జీవితంలో రాజీ పడి బాధపడటం కంటే, ధైర్యంగా విడిపోయి కొత్తగా బతకడం మేలని నమ్ముతారు.