E-Paper
Advertisement

Hair Transplant: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకునే ముందు ఈ 5 సైడ్ ఎఫెక్టుల గురించి తెలుసుకోండి

Hair Transplant: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకునే ముందు ఈ 5 సైడ్ ఎఫెక్టుల గురించి తెలుసుకోండి
Advertisement

ఆధునిక కాలంలో జుట్టు ఊడిపోవడం సాధారణ సమస్యగా మారిపోయింది. వయసు పెరగడం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, వారసత్వంగా రావడం వంటి కారణాలతో జుట్టు పలుచగా మారుతోంది. అందుకే చాలామంది హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని ఆలోచిస్తున్నారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది తల వెనుక భాగంలో ఉన్న బలమైన వెంట్రుకలను తీసుకుని జుట్టు లేని ప్రాంతంలో నాటే ప్రక్రియ. ఇది ఎంతో మందికి మంచి ఫలితాలు ఇస్తుంది. కానీ ఇది సర్జరీ కిందకే వస్తుంది. కాబట్టి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకునే ముందు ఈ సమస్యల గురించి తెలుసుకోవడం మంచిది.

వాపు వస్తుంది
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన తర్వాత నుదురు లేదా కళ్ల చుట్టూ కొద్దిగా వాపు కనిపించవచ్చు. ఇది చాలా సాధారణం. సర్జరీ సమయంలో చర్మంలో ద్రవాలు చేరడం వల్ల ఇలా జరుగుతుంది. ఎక్కువగా రెండు నుంచి రోజుల్లో తగ్గిపోతుంది. చల్లని కాంప్రెస్ పెట్టుకుంటే ఉపశమనం ఉంటుంది.

Advertisement

నొప్పి రావడం
వెంట్రుకలను ట్రాన్స్‌ప్లాంట్ చేసిన ప్రాంతంలో కొద్దిగా నొప్పి లేదా గట్టిగా అనిపించవచ్చు. ముఖ్యంగా జుట్టు తీసుకున్న డోనర్ ప్రాంతంలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం సహజంగా గాయం మాన్పుకుంటున్న సంకేతంగా భావించాలి. డాక్టర్ ఇచ్చిన మందులు వాడితే త్వరగా తగ్గుతుంది.

తాత్కాలికంగా జుట్టు ఊడటం
ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత కొన్ని వారాల్లో కొత్తగా నాటిన జుట్టు కొంత ఊడిపోవచ్చు. దీన్నే షాక్ లాస్ అంటారు. ఇది సాధారణంగా జరుగుతుంది. జుట్టు రూట్స్ లోపలే ఉంటాయి. కొన్ని నెలల తర్వాత మళ్లీ కొత్త జుట్టు పెరుగుతుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు.

Advertisement

Also read: Garlic Karam Dosa: నోరూరించే వెల్లుల్లి కారం దోశె రెసిపీ, కొబ్బరిచట్నీతో తింటే స్వర్గం కనిపిస్తుంది

దురద, ఎర్రబారడం
గాయం మానుతున్న సమయంలో స్కాల్ప్‌లో దురద లేదా ఎర్రబారడం రావచ్చు. ఇది హీలింగ్ ప్రాసెస్‌లో భాగం. అయితే గోకడం వంటివి చేయకూడదు. గోకితే కొత్తగా నాటిన జుట్టు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. డాక్టర్ సూచించిన లోషన్లు లేదా షాంపూలు వాడితే సమస్య తగ్గుతుంది.

ఇన్ఫెక్షన్,మచ్చలు
ఇది అరుదుగా కనిపించే సమస్య. కానీ సరైన శుభ్రత పాటించకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అనుభవం లేని క్లినిక్‌లో చేస్తే మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అందుకే మంచి డాక్టర్ దగ్గర చేయించుకోవాలి.

హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలు
1. డాక్టర్ చెప్పిన విధంగా మందులు, షాంపూ వాడాలి.
2. మొదటి కొన్ని రోజులు తలను గట్టిగా తాకకూడదు.
3. సూర్యరశ్మి, దుమ్ము నుండి తలను రక్షించాలి.
4. గోకడం, రుద్దడం చేయకూడదు.

హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చాలా మందికి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి ఇస్తుంది. అయితే మంచి ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. పైగా కొన్ని చిన్న సైడ్ ఎఫెక్ట్స్ రావడం సహజం. కాబట్టి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలనుకుంటే తొందరపడకుండా ముందుగా పూర్తి సమాచారం తెలుసుకోండి.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×