ఎక్కువ మందికి ఇష్టమైన అల్పాహారాల్లో దోశె ఒకటి. ప్రతిరోజూ దోశె పెట్టినా తినేసేవారు కోట్లలో ఉన్నారు.దోశెలో అనేక రకాలు ఉన్నాయి. ఇక్కడ మేము వెల్లుల్లి కారం దోశె రెసిపీ ఇచ్చాము. వెల్లుల్లి, ఎండుమిర్చి, చింతపండు కలిపి తయారు చేసే చట్నీని దోస మీద రాసి వేయిస్తే రోడ్‌సైడ్ హోటల్ స్టైల్ రుచి వస్తుంది. ఈ ప్రత్యేకమైన దోశ తమిళనాడు ప్రాంతంలో ప్రసిద్ధి పొందింది. కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటుంది.
వెల్లుల్లి కారం దోశె రెసిపీకి కావాల్సిన పదార్థాలు
ఎండుమిర్చి – 8
వెల్లుల్లి – 10 రెబ్బలు
చింతపండు – చిన్న నిమ్మకాయ సైజులో
ఉప్పు – తగినంత
నూనె – 2 టేబుల్ స్పూన్లు
దోశె పిండి – అవసరమైనంత
నెయ్యి లేదా నూనె – తగినంత
Also read: Carrot Bobbatlu: క్యారెట్ హల్వా స్టఫ్ చేసిన బొబ్బట్లు రెసిపీ.. చూస్తేనే నోరూరిపోతుంది
వెల్లుల్లి కారం దోశె రెసిపీ
1. మొదట ఎండుమిర్చి, చింతపండును వేడి నీటిలో సుమారు 30 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత కళాయిలో కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి రెబ్బలను స్వల్పంగా వేయించి తీసుకోవాలి.
2. ఇప్పుడు మిక్సీ జార్‌లో నానబెట్టిన మిర్చి, చింతపండు, వేయించిన వెల్లుల్లి, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఈ పేస్ట్‌ను కళాయిలో కొద్దిగా నూనెతో 2 నిమిషాలు వేయిస్తే పచ్చి వాసన పోయి మంచి సువాసన వస్తుంది. దీన్ని పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయాలి. పెనం వేడెక్కా పిండితో దోశె వేసుకోవాలి. చుట్టూ నూనె లేదా నెయ్యి వేసుకోవాలి.
4. ఇప్పుడు ముందుగా తయారుచేసిన వెల్లుల్లి కారం చట్నీని దోవె పై భాగంలో పలుచగా రాయాలి. ఇది రత్యేకమైన రుచి ఇస్తుంది.
5. తర్వాత దోశ కింద భాగం గోధుమ రంగులోకి మారినప్పుడు మడిచి తీసేయాలి. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేస్తే రోడ్‌సైడ్ స్టైల్ కారం దోశలా అనిపిస్తుంది.
Also read: Mutton Curry: కొత్తిమీర మటన్ ఇలా వండారంటే గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది, రెసిపీ ఇదిగో
ఈ వెల్లుల్లిక కారం దోవను కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ లేదా సాంబార్‌తో సర్వ్ చేస్తే చా రుచిగా ఉంటుంది. ఎలాంటి చట్నీ లేకుండా కూడా దీన్ని తినేయవచ్చు. ఎందుకంటే దోశె పై ఉన్న వెల్లుల్లి మిశ్రమం మంచి రుచిని ఇస్తుంది. ఇంకెందుకాలస్యం ఓసారి ఈ స్టైల్ లో వెల్లుల్లి కారం దోశె ప్రయత్నించి చూడండి.