Money management: ధనవంతులు అవ్వడం అంటే కేవలం రాత్రికి రాత్రే లాటరీ తగలడం లేదా భారీ వ్యాపారాలు చేయడం మాత్రమే కాదు. నిజమైన సంపద అనేది మనం రోజువారీ జీవితంలో పాటించే చిన్న చిన్న అలవాట్ల ద్వారా నిర్మించబడుతుంది. చాలా మంది ఆర్థికంగా ఎదగలేకపోవడానికి కారణం ఆదాయం తక్కువ ఉండటం కాదు. డబ్బును నిర్వహించే పద్ధతి తెలియకపోవడమే. క్రమశిక్షణతో కూడిన చిన్న మార్పులు కాలక్రమేణా భారీ ఆర్థిక స్వాతంత్రాన్ని అందిస్తాయి. నిశ్శబ్దంగా మిమ్మల్ని కోటీశ్వరులను చేసే ఆ 5 శక్తివంతమైన అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ముందుగా మీకే చెల్లించుకోండి :
చాలామంది జీతం రాగానే ఖర్చులు పోను మిగిలినది పొదుపు చేయాలనుకుంటారు. కానీ ధనవంతులు కావాలని అనుకుని పెట్టుకోవడం. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా మీ ఆదాయ వనరులను పెంచుకోవచ్చు. పుస్తకాలు చదవడం, సెమినార్లకు వెళ్లడం లేదా ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడం వల్ల డబ్బును ఎలా సంపాదించాలో, ఎలా నిలబెట్టుకోవాలో మీకు అర్థమవుతుంది. మీ జ్ఞానం పెరిగే కొద్దీ మీ సంపాదన సామర్థ్యం కూడా పెరుగుతుంది.
2. కాంపౌండింగ్ శక్తిని ఉపయోగించడం :
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అన్నట్లు, కాంపౌండింగ్ అనేది ప్రపంచంలోని ఎనిమిదో వింత. చిన్న వయస్సు నుండే స్వల్ప మొత్తాన్ని స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల.. వడ్డీ మీద వడ్డీ పెరిగి కొన్ని ఏళ్లలో అది ఊహించని పెద్ద మొత్తంగా మారుతుంది. ఇక్కడ మీరు ఎంత పెడుతున్నారనే దానికంటే.. ఎంత కాలం పాటు పెడుతున్నారనేది ముఖ్యం.
3. అవసరానికి, కోరికకు మధ్య వ్యత్యాసం గుర్తించడం :
ధనవంతులు కావాలనుకునే వారు తమ ఖర్చులను నిశితంగా గమనిస్తారు. ఒక వస్తువు కొనే ముందు “ఇది నాకు నిజంగా అవసరమా ? లేక కేవలం ఇతరులను చూసి కొంటున్నానా ?” అని ప్రశ్నించుకోవాలి. ముఖ్యంగా క్రెడిట్ కార్డులు, EMI లపై ఆధారపడి విలాసవంతమైన వస్తువులు కొనడం మానేయాలి. ఆ చిన్న పొదుపే మీ పెట్టుబడికి పెట్టుబడిగా మారుతుంది.
4. నిరంతర అభ్యాసం, నైపుణ్యం పెంచుకోవడం :
అన్ని పెట్టుబడుల కంటే గొప్పది మీపై మీరు పెట్టుబడి పెట్టుకోవడం. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా మీ ఆదాయ వనరులను పెంచుకోవచ్చు. పుస్తకాలు చదవడం, సెమినార్లకు వెళ్లడం లేదా ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడం వల్ల డబ్బును ఎలా సంపాదించాలో మరియు ఎలా నిలబెట్టుకోవాలో మీకు అర్థమవుతుంది. మీ జ్ఞానం పెరిగే కొద్దీ మీ సంపాదన సామర్థ్యం కూడా పెరుగుతుంది.
Also Read: రోజంతా చిప్స్ తినాలనిపిస్తోందా ? ఈ హార్మోన్ల మార్పులే కారణం కావచ్చు!
5. అదనపు ఆదాయ మార్గాలను సృష్టించుకోవడం :
కేవలం ఒక్క ఉద్యోగం లేదా ఒక్క ఆదాయం మీద ఆధారపడటం ఆర్థికంగా రిస్క్ అని ధనవంతులు భావిస్తారు. ఖాళీ సమయంలో సైడ్ హస్టిల్స్ చేయడం, షేర్ల ద్వారా డివిడెండ్లు పొందడం లేదా అద్దె ద్వారా ఆదాయం వచ్చేలా చూసుకోవడం వంటివి చేయాలి. మీ నిద్రలో కూడా మీకు డబ్బు వచ్చే మార్గం లేకపోతే.. మీరు చనిపోయే వరకు కష్టపడుతూనే ఉండాల్సి వస్తుంది.
పైన పేర్కొన్న ఈ ఐదు అలవాట్లు ప్రారంభంలో చాలా చిన్నవిగా అనిపించవచ్చు. కానీ ఇవి మీ జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని,స్వేచ్ఛను తీసుకువస్తాయి. సంపద సృష్టించడం అనేది ఒక ప్రయాణం, దానికి ఓర్పు, క్రమశిక్షణ చాలా అవసరం.