E-Paper
Advertisement

Salty Foods: రోజంతా చిప్స్ తినాలనిపిస్తోందా ? ఈ హార్మోన్ల మార్పులే కారణం కావచ్చు!

Salty Foods: రోజంతా చిప్స్ తినాలనిపిస్తోందా ? ఈ హార్మోన్ల మార్పులే కారణం కావచ్చు!
Advertisement

Salty Foods: చాలా మందికి చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఉప్పగా ఉండే స్నాక్స్ తినాలని పదే పదే అనిపిస్తుంటుంది. ఇది కేవలం మీ రుచికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. దీని వెనక మీ శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత కూడా ఉండవచ్చు. ముఖ్యంగా ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసోల్, ఆకలిని నియంత్రించే ఘ్రెలిన్ వంటి హార్మోన్లు తేడా వస్తే.. ఇలాంటి క్రేవింగ్స్ మొదలవుతాయి. ఈ హార్మోన్ల గోల ఏంటో ? వీటిని ఎలా అదుపులో ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఒత్తిడి, కార్టిసోల్ :
మనకి బాగా స్ట్రెస్ (ఒత్తిడి)గా ఉన్నప్పుడు, అడ్రినల్ గ్రంథులు కార్టిసోల్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఈ హార్మోన్ ఎక్కువైతే శరీరం తక్షణ శక్తి కోసం గ్లూకోజ్, ఉప్పును కోరుకుంటుంది.
ఒత్తిడిలో ఉన్నప్పుడు మన మెదడు “రివార్డ్” కోసం వెతుకుతుంది. చిప్స్ వంటి ఉప్పగా, కరకరలాడే పదార్థాలు తిన్నప్పుడు మెదడులో డోపమైన్ విడుదలయ్యి కాసేపు ఉపశమనం లభిస్తుంది. అందుకే బ్యాడ్ మూడ్‌లో ఉన్నప్పుడు ఒక చిప్స్ ప్యాకెట్ ఖాళీ చేయడం మనకు తెలియకుండానే జరిగిపోతుంది.

Advertisement

2. ఘ్రెలిన్, లెప్టిన్ :
ఈ రెండు హార్మోన్లు ఆకలిని కంట్రోల్ చేస్తాయి.

ఘ్రెలిన్ : ఇది మనకు ఆకలి వేసేలా చేస్తుంది. దీనిని ‘ఆకలి హార్మోన్’ అంటారు.

Advertisement

లెప్టిన్ : కడుపు నిండిందని మెదడుకు సిగ్నల్ ఇస్తుంది.

మీరు సరిగ్గా నిద్రపోకపోయినా లేదా ఎక్కువ ఒత్తిడికి గురైనా.. శరీరంలో ఘ్రెలిన్ పెరిగిపోయి లెప్టిన్ తగ్గిపోతుంది. ఫలితంగా కడుపు నిండినా కూడా ఇంకా ఏదో తినాలని.. ముఖ్యంగా సాల్టీ స్నాక్స్ మీదకు మనసు పోతుంది.

3. అల్డోస్టెరాన్ :
మన శరీరంలో ఉప్పు (సోడియం), నీరు ఎంత ఉండాలో నిర్ణయించేది అల్డోస్టెరాన్. అడ్రినల్ గ్రంథులు సరిగ్గా పనిచేయకపోయినా , లేదా శరీరంలో సోడియం తగ్గిపోయినా ఈ హార్మోన్ ప్రభావంతో ఉప్పు ఎక్కువగా ఉన్న చిప్స్ తినాలనే కోరిక విపరీతంగా కలుగుతుంది. దీనిని మెడికల్ పరిభాషలో ‘సాల్ట్ క్రేవింగ్’ అంటారు.

4. నిద్ర లేమి :
మీరు రోజుకు 7-8 గంటలు నిద్రపోకపోతే.. మీ మెదడు నిర్ణయాలు తీసుకునే శక్తిని కోల్పోతుంది. నిద్ర లేకపోవడం వల్ల రక్తంలో కార్టిసోల్ స్థాయిలు పెరిగి, శరీరానికి అలసటగా అనిపిస్తుంది. ఆ అలసటను పోగొట్టడానికి మెదడు తక్షణమే ‘సాల్ట్ కిక్’ కావాలని చిప్స్ వంటి స్నాక్స్ వైపు మళ్లుతుంది.

Also Read: రక్తహీనతకు చెక్ పెట్టాలంటే.. రోజూ ఈ 5 ఎండుద్రాక్షలు చాలు!

క్రేవింగ్స్‌ను ఎలా తగ్గించుకోవాలి ?
హార్మోన్ల ఇంబాలెన్స్ వల్ల కలిగే ఈ క్రేవింగ్స్‌ను అడ్డుకోవడానికి కొన్ని చిట్కాలు.

నీరు ఎక్కువగా తాగండి: ఒక్కోసారి దాహాన్ని కూడా మెదడు ఆకలిగా పొరబడుతుంది. చిప్స్ తినాలనిపించినప్పుడు ఒక గ్లాసు నీరు తాగి చూడండి.

మెగ్నీషియం, పొటాషియం: ఆకుకూరలు, అరటిపండ్లు, బాదం వంటివి ఆహారంలో చేర్చుకోండి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కాపాడి ఉప్పు క్రేవింగ్స్‌ను తగ్గిస్తాయి.

ప్రోటీన్ ఫుడ్: గుడ్లు, పప్పు ధాన్యాలు తింటే.. కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల స్నాక్స్ తినాలనే ఆలోచన రాదు.

ఒత్తిడిని తగ్గించుకోండి: యోగా లేదా మెడిటేషన్ ద్వారా కార్టిసోల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×