E-Paper
Advertisement

Kavya Kalyanram: డ్రెస్ ఓకేనా? అంటూ ముందు తనకే ఫోటోలు షేర్ చేస్తా అంటోన్న హీరోయిన్..!

Kavya Kalyanram: డ్రెస్ ఓకేనా? అంటూ ముందు తనకే ఫోటోలు షేర్ చేస్తా అంటోన్న హీరోయిన్..!
Advertisement

Kavya Kalyanram: పొట్టి పిల్ల.. పొట్టి పిల్ల అంటూ మనకు దగ్గరైనతెలుగు సినీ నటి కావ్య కళ్యాణ్ రామ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో.. కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలతో పాటు ఆమె పెట్టిన క్యాప్షన్ చాలా మందికి నచ్చింది. ఏదైనా డ్రెస్ బాగుందా లేదా అనేదానికి.. నేను ముందుగా నా ఫోటోలు మా అమ్మకి పంపిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. డ్రస్ ఓకేనా అని అమ్మకు ఫోటో పంపడం తన అలవాటు అని తెలిపింది.

షేర్ చేసిన ఫోటోలో కావ్య అద్దం ముందు నిలబడి సెల్ఫీ తీసుకుంటున్నట్టు కనిపించింది. ఒక ఫోటోలో ఆమె చీరలో ఉండగా మరో ఫోటోలో ఆరెంజ్ రంగు ఫుల్ స్లీవ్ టాప్‌, బ్లూ జీన్స్ ధరించింది. అన్ని ఫోటోలలో కూడా ఈమె చాలా అందంగా కనిపించారు.

Advertisement

కావ్య కళ్యాణ్ రామ్ 1998 జూలై 20న కొత్తగూడెంలో జన్మించింది. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండడంతో బాలనటిగా సినీ ప్రయాణం మొదలుపెట్టింది. హైదరాబాద్‌లో పెరిగిన కావ్య చిన్న వయసులోనే పలు సినిమాల్లో నటించింది.

Advertisement

స్నేహమంటే ఇదేరా సినిమాతో ఆమె బాలనటిగా మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత గంగోత్రి, ఠాగూర్, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, పాండురంగడు, ఉల్లాసంగా ఉత్సాహంగా వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది. ఈ సినిమాలన్నీ ఆమెకు మంచి అనుభవాన్ని ఇచ్చాయి.

చదువు పూర్తయ్యాక కావ్య మళ్లీ సినిమాల వైపు అడుగులు వేసింది. 2022లో విడుదలైన మసూదా సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు మంచి స్పందన వచ్చింది.

2023లో వచ్చిన బలగం సినిమా కావ్య కెరీర్‌లో ముఖ్యమైన మలుపు. ఆ సినిమాలో సంద్య పాత్రతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. అదే ఏడాది ఉస్తాద్ సినిమాలో కూడా నటించింది.

ఇప్పుడు కావ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన జీవితంలోని చిన్న చిన్న విషయాలను అభిమానులతో పంచుకుంటూ.. సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది.

ALSO READ: Ram Charan: ఫాన్స్ అత్యుత్సాహం.. ఫైర్ అయిన చరణ్…ఇలా తయారయ్యారేంట్రా బాబు!

Related News

ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ ఏమన్నారంటే.. ఓ నా సిద్ధయ్య’పై ఆసక్తికర కామెంట్స్

సిగ్మా ట్రైలర్.. విజయ్ కొడుకు జేసన్ సంజయ్ అదరగొట్టాడే!

అనుపమ పెళ్లికూతురైపోయిందే….ఎంత అందంగా ఉందో!

రష్మికకు ఇదేం పిచ్చి బాబోయ్.. అనిమే కోసం ఏకంగా 25 ఎపిసోడ్లు!

వరుణ్ తేజ్-లావణ్య ఇటలీ ట్రిప్.. వాయువ్ తేజ్ క్యూట్ మూమెంట్స్ అదుర్స్!

మూవింగ్.. డ్యాన్సింగ్.. క్రియేటింగ్.. అనసూయ ఫుల్ జోష్‌లో ఉందిగా!

మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్!

దివి అందం చూసి మాటలు రావట్లేదట.. ఏం రాశాడో చూస్తే!

Big Stories

Advertisement
×