E-Paper
Advertisement

తెల్లటి బూట్లు మురికిగా అయ్యాయా? ఉతకడం, రుద్దడం లేకుండానే మెరిపించే 5 సీక్రెట్ ట్రిక్స్!

తెల్లటి బూట్లు మురికిగా అయ్యాయా? ఉతకడం, రుద్దడం లేకుండానే మెరిపించే 5 సీక్రెట్ ట్రిక్స్!

How to clean white shoes: ఈ రోజుల్లో వైట్ షూస్ వేసుకోవడం ఒక క్రేజీ ఫ్యాషన్ ట్రెండ్. జీన్స్ అయినా, క్యాజువల్ డ్రెస్ అయినా తెల్లటి స్నీకర్స్ వేసుకుంటే.. వచ్చే లుక్కే వేరు. అయితే.. వీటితో ఉన్న ఒకే ఒక్క పెద్ద తలనొప్పి ఏంటంటే.. ఇవి చాలా త్వరగా మురికిగా అయిపోతాయి. వీటిని ప్రతిసారీ నీళ్లలో నానబెట్టి, బ్రష్‌లతో గట్టిగా రుద్ది ఉతకాలంటే అబ్బా చాలా పెద్ద ప్రాసెస్.. అందుకే, అసలు ఉతికే పనే లేకుండా, కేవలం మన ఇంట్లో దొరికే 5 సింపుల్ పదార్థాలతో మీ వైట్ షూస్‌ని మళ్లీ మల్లెపూవులా ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం.

1. మైసెలార్ వాటర్ మ్యాజిక్:
ఆడవాళ్లు మేకప్ రిమూవ్ చేయడానికి వాడే ‘మైసెలార్ వాటర్’ వైట్ షూస్‌ని క్లీన్ చేయడానికి ఒక అద్భుతమైన గ్యాడ్జెట్ లా పనిచేస్తుంది. ముఖ్యంగా లెదర్ లేదా రబ్బర్ వైట్ షూస్ పైన ఉండే నల్లటి మచ్చలను తీసేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఒక కాటన్ ప్యాడ్ లేదా మెత్తటి క్లాత్ పై కొద్దిగా మైసెలార్ వాటర్ వేసి, షూస్ పైన మురికి ఉన్న చోట లైట్‌గా తుడిస్తే చాలు.. మురికినంతా అది లాగేసుకుంటుంది.

2. బేకింగ్ సోడా అండ్ వైట్ వెనిగర్ కాంబో:
మన కిచెన్‌లో ఉండే బేకింగ్ సోడా, వెనిగర్ కలిస్తే మురికికి మరణశాసనమే. ఒక చిన్న గిన్నెలో ఒక చెంచా బేకింగ్ సోడా, ఒక చెంచా వైట్ వెనిగర్ వేసి పేస్ట్‌లా కలపండి. ఈ పేస్ట్‌ను ఒక పాత టూత్‌బ్రష్ సాయంతో షూస్ పైన మురికిగా ఉన్న భాగంలో మెల్లగా అప్లై చేయండి. గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా పూసి ఒక 15 నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత ఒక పొడి గుడ్డతో తుడిచేస్తే మీ షూస్ మునుపటిలా తెల్లగా మెరిసిపోతాయి.

3. టూత్‌పేస్ట్ ట్రిక్:
మన పళ్లను తెల్లగా మార్చే టూత్‌పేస్ట్.. మన తెల్లటి బూట్లను కూడా అంతే తెల్లగా మారుస్తుంది. అయితే ఇక్కడ కేవలం వైట్ కలర్ జెల్-కాని టూత్‌పేస్ట్‌ను మాత్రమే వాడాలి. షూస్ అడుగు భాగంలో ఉండే వైట్ రబ్బర్ సోల్‌పై మురికి ఎక్కువగా పేరుకుపోతుంది. అక్కడ కొద్దిగా టూత్‌పేస్ట్ రాసి, ఒక్క నిమిషం ఆగాక తడి క్లాత్‌తో క్లీన్ చేస్తే చాలు, జిడ్డు మురికి అంతా మాయం అవుతుంది.

4. నెయిల్ పాలిష్ రిమూవర్ :
షూస్ పైన కొన్నిసార్లు బైక్ చైన్ గ్రీజ్ మరకలు లేదా గట్టిగా అంటుకుపోయే నల్లటి గీతలు పడుతుంటాయి. ఇవి నార్మల్ గా అస్సలు వదలవు. అలాంటప్పుడు కాస్త ‘నెయిల్ పాలిష్ రిమూవర్’ (అసిటోన్)ను కాటన్ పై వేసి ఆ మరకలపై జస్ట్ అలా ప్రెస్ చేస్తూ తుడవండి. ఎంతటి మొండి మచ్చలైనా సెకన్లలో కరిగిపోతాయి. (గమనిక: దీనిని కేవలం రబ్బర్ లేదా లెదర్ భాగాలపైనే వాడాలి, క్లాత్ షూస్ పై వద్దు).

5. బేబీ పౌడర్ హాక్:
క్యాన్వాస్ లేదా కాటన్ క్లాత్‌తో చేసిన వైట్ షూస్ తడిస్తే పసుపు రంగు మచ్చలు పడుతుంటాయి. వీటికి బేబీ పౌడర్ పర్ఫెక్ట్ సొల్యూషన్. కొద్దిగా బేబీ పౌడర్ , గోరువెచ్చని నీళ్లను కలిపి థిక్ పేస్ట్‌లా చేసి షూస్ పై పూయండి. అది పూర్తిగా ఆరిపోయాక (ఎండలో పెట్టొచ్చు), జస్ట్ ఆ పౌడర్‌ను దులపండి. పౌడర్‌తో పాటు మురికి, పసుపు మచ్చలు కూడా రాలిపోతాయి. పైగా షూస్ మంచి సువాసన కూడా వస్తాయి.

వైట్ షూస్ మెయింటెనెన్స్ అనేది పెద్ద కష్టమైన పని ఏమీ కాదు.. జస్ట్ స్మార్ట్‌గా ఆలోచిస్తే చాలు. నెక్స్ట్ టైమ్ మీ తెల్లటి బూట్లు మురికిగా అయినప్పుడు సండే అంతా వాటిని ఉతకడానికి టైమ్ వేస్ట్ చేసుకోకుండా.. పైన చెప్పిన మైసెలార్ వాటర్ లేదా టూత్‌పేస్ట్ లాంటి సింపుల్ లైఫ్ హాక్స్ ట్రై చేయండి. మీ స్టైలిష్ వైట్ స్నీకర్స్‌తో ఎప్పుడూ ట్రెండీగా మెరిసిపోండి.

Related News

జుట్టు పీచులా మారిపోయిందా? శనగపిండి హెయిర్ మాస్క్‌తో మెరిసిపోవడం గ్యారెంటీ!

టాయిలెట్ క్లీనర్లతో ప్రాణాంతక ముప్పా? ప్రతి ఇంట్లోనూ జరిగే అతిపెద్ద తప్పు ఇదే!

సర్‌ప్రైజ్ అంటే ఇది కదా! అమ్మ లైఫ్‌ని ఈజీ చేసే 5 మోస్ట్ యూస్‌ఫుల్ గిఫ్ట్స్!

ఫంక్షన్లకు బెస్ట్ రిటర్న్ గిఫ్ట్స్.. ఈ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఇస్తే.. గెస్టులు ఫిదా అవ్వాల్సిందే!

షుగర్ వ్యాధి ఉంటే పాలు తాగవచ్చా? డాక్టర్లు చెబుతున్న జాగ్రత్తలు ఇవే

వేసవిలో కూడా చర్మం ఉంటుంది కూల్ కూల్.. ఈ స్కిన్‌కేర్ జాగ్రత్తలే ఉపాయం

ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఉండాల్సిన మ్యాజికల్ ఫుడ్.. కొబ్బరి పువ్వుతో ఇన్ని లాభాలా?

Big Stories

×