E-Paper
Advertisement

Health Benefits Of Kiwi: కివీ ఫ్రూట్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ సమస్యలన్నీ మాయం

Health Benefits Of Kiwi: కివీ ఫ్రూట్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ సమస్యలన్నీ మాయం
Advertisement

Health Benefits Of Kiwi: వర్షాకాలంలో ముఖ్యంగా చిన్నవారి నుంచి పెద్దల వరకు అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అందుకు ముఖ్య కారణం వాతావరణంలోని మార్పులే. వర్షాకాలంలో నీరు కలుషితం కావడంతో పాటు దోమల బెడద కూడా బాగా పెరుగుతుంది. దీంతో జబ్బులు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఫ్లూ, డెంగ్యూ, టైఫాయిడ్, న్యుమోనియా, మలేరియా, వాంతులు, విరేచనాలు, కామెర్ల వంటివి వస్తూ ఉంటాయి. ప్రధానంగా చెప్పుకోవాల్సింది డెంగ్యూ.

డెంగ్యూ అటాక్ అయిందంటే మాత్రం తీవ్రంగా జర్వం వస్తుంది. అలాంటి సమయంలో దీనికి తగిన చికిత్స తీసుకుంటే మాత్రం తీవ్ర అనారోగ్య సమస్యగా మారుతుంది. కానీ అలా జరగకపోతే మాత్రం ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. డెంగ్యూ బారిన పడినప్పుడు కివీ ఫ్రూట్ తినడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. కివీ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

యాంటీ ఆక్సిడెంట్లతో పాటు పోషకాలు పుష్కలంగా కివీలో ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటతో పాటు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కివీ తిపనడం వల్ల తగ్గుముఖం పడతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో అధికంగా ఉండే విటమిన్ సి తోపాటు ఇతర పోషకాలు జలుబును నివారించడంలో సహాయపడతాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి.

ముఖ్యంగా కివీలో ఉండే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్, ఫోలేట్, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు రక్తంలో ప్లేట్‌లెట్స్ ఉత్పత్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. కాబట్టి డెంగ్యూ బారిన పడిన వారు ఈ ఫ్రూట్ తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

Advertisement

2009లో జర్నల్ ఆఫ్ ట్రాఫికల్ మెడిసిన్ అండ్ హైజిన్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం డెంగ్యూ జ్వరం వల్ల ప్లేట్‌లెట్ సంఖ్య తక్కువగా ఉన్న రోగులు రోజుకు రెండు కివీ పండ్లు తింటే వారిలో ప్లేట్ లెట్స్ సంఖ్య పెరిగిందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్ కు చెందిన పోషకాహార నిపుణులు పాల్గొన్నారు. కివీలోని పోషకాలు రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరగడానికి చాలా తోడ్పడతాయి.

కివీ పండ్లలో ఉండే మంచి కొలెస్ట్రాల్ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. అంతే కాకుండా బీపీని కూడా అదుపులో ఉంచుతుంది. మలబద్ధక సమస్యను కూడా నివారిస్తుంది. కొన్ని రకాల కాన్సర్‌లను నిరోధించడంలో కూడా సహాయపడుతుంది. ఎముకలు దృఢంగా ఉంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

Also Read: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా.. అయితే ఐరన్ లోపం ఉన్నట్లే !

కివీ పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ సవ్యంగా ఉంటుంది. అంతే కాకుండా చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే ఇది కడుపులో మంట కూడా రాకుండా చేస్తుంది. వీటిలో అధిక కేలరీలు, పీచు పదార్థం ఉండటం వల్ల కివీ పప్రూట్ తిన్నప్పుడు నిండిన భావన కూడా కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే ఈ పండ్లు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న కివీ పండ్లను తినడం అలవాటు చేసుకోండి.

Related News

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

ప్రతిరోజూ హెల్మెట్ ధరిస్తే జుట్టు డ్యామేజ్.. ఈ సులభమైన హెయిర్ కేర్ చిట్కాలు మీ కోసం

పాము, ముంగీస లాంటి స్వభావం వీరిది.. ఈ తేదీల్లో పుట్టినవారు పెళ్లి తరువాత గొడవపడుతూనే ఉంటారు

మద్యం లేదా సిగరెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రమాదకరం.. ఏది ముందుగా మానేయాలి?

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

Big Stories

Advertisement
×