BigTV English

Iron Deficiency Symptoms: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా.. అయితే ఐరన్ లోపం ఉన్నట్లే !

Iron Deficiency Symptoms: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా.. అయితే ఐరన్ లోపం ఉన్నట్లే !

Iron Deficiency Symptoms: మన శరీరంలో రక్తం ముఖ్య పాత్ర పోషిస్తుంది. బ్లడ్‌లో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అది పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంటుంది. శరీరంలో తగినంత రక్తం లేకపోతే దానిని ఎనీమియా అని అంటారు. శరీరంలో తగిన మోతాదులో ఐరన్ లేకపోవడంతో పాటు విటమిన్ లోపం కూడా రక్తహీనతకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతుంటారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల ఈ సమస్య  తెలుస్తుంది. అలా కాకుండా ముందుగానే మన శరీరంలో కొన్ని లక్షణాల వల్ల ఐరన్ లోపంను గుర్తించవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


లివర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు, ఎక్కువ రోజుల నుంచి మందులు వాడే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా క్యాన్సర్ చికిత్సలో భాగం అయిన కీమోథెరపీ ట్రీట్ మెంట్ చేసుకున్న వారిలో రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఏర్పడే ఎనీమియా ఐరన్ లోపం వల్ల ఏర్పడుతుంది. ఆహారం ద్వారా ఐరన్ లభించనప్పుడు లేదా శరీరంలోని కణాలు ఆహారంలోని ఐరన్‌ను శోషించనప్పుడు ఈ రకం ఎనీమియా వస్తుంది.

తీవ్రమైన అలసట: రక్తహీనతతో బాధపడేవారు బాగా విశ్రాంతి తీసుకున్నప్పటికీ తీవ్రమైన నీరసంతో బాధపడుతూ ఉంటారు. రోజు వారి పనులకు కూడా అలసిపోతారు. అలాగే వీరు చేయల్సిన పని పట్ల ద్యాసను పెట్టలేకపోతారు.
తలనొప్పి: రక్తహీనత ఉన్న వారిలో తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. అంతే కాకుండా తరుచుగా మైకం వచ్చినట్లు కూడా అనిపిస్తుంది.


  • ఐరన్ లోపంతో బాధపడే వారిలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడం వల్ల పెదవులు, గోళ్లు, చర్మం పాలిపోయినట్లు ఉంటుంది.
  • శ్వాస తీసకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఇంకా ఛాతిలో నొప్పి కూడా వస్తుంటుంది.
  • శరీరంలో తగినంత ఐరన్ లేకపోతే ఆక్సిజన్ ప్రసరణ తగ్గుతుంది. దీని వల్ల వేడి వాతావరణంలో కూడా కళ్లు, చేతులు చల్లగా మారుతాయి.
  • జుట్టు కూడా పొడిబారుతుంది. అంతే కాకుండా గోర్లు పెళుసుగా మారుతాయి.

Related News

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Big Stories

×