E-Paper
Advertisement

Collagen Boosting Drinks: కొల్లాజెన్ బూస్టింగ్ డ్రింక్స్.. ఇవి తాగితే నేచురల్ గ్లో మీ సొంతం !

Collagen Boosting Drinks: కొల్లాజెన్ బూస్టింగ్ డ్రింక్స్.. ఇవి తాగితే నేచురల్ గ్లో మీ సొంతం !
Advertisement

Collagen Boosting Drinks: కొల్లాజెన్ అనేది మన చర్మానికి పునాదిలాంటిది. ఇది చర్మానికి స్థితిస్థాపకత, దృఢత్వాన్ని ఇస్తుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ, మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని వల్ల ముడతలు, సన్నని గీతలు, చర్మం వదులుగా మారడం వంటివి జరుగుతాయి. అంతే కాకుండా చిన్న వయస్సులోనే ఫేస్‌లో గ్లో తొలగిపోతుంది. ఇలాంటి సమయంలో హోం మేడ్ డ్రింక్స్ తయారు చేసుకుని తాగడం మంచిది. కొల్లాజెన్ బూస్టింగ్ డ్రింక్స్ ఎలా తయారు చేసుకుని తాగాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. బోన్ జ్యూస్:
ఎముకల రసం అనేది కొల్లాజెన్‌ను అందించే అద్భుతమైన సహజ వనరు. కోడి లేదా గొర్రెల ఎముకలను ఎక్కువ సమయం పాటు ఉడకబెట్టడం ద్వారా తయారుచేస్తారు.
ఈ రసంలో సహజంగానే కొల్లాజెన్, అమినో ఆమ్లాలు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిని క్రమం తప్పకుండా తాగడం వల్ల చర్మానికి లోపలి నుంచి పోషణ లభిస్తుంది. దీని వల్లఎలాస్టిసిటీ మెరుగుపడుతుంది. అంతే కాకుండా ముడతలు తగ్గుతాయి. దీనిని అలాగే వేడిగా తాగవచ్చు లేదా సూప్‌లలో బేస్‌గా కూడా ఉపయోగించవచ్చు.

Advertisement

2.సిట్రస్ పండ్లతో నింపిన జ్యూస్:
కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి చాలా అవసరం. నిమ్మకాయలు, నారింజ, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ నీటిలో నిమ్మకాయ, నారింజ ముక్కలను వేసి తాగడం ద్వారా రిఫ్రెష్‌మెంట్‌తో.. పాటు, రోజువారీ అవసరమయ్యే చర్మానికి మేలు చేసే విటమిన్ సి కూడా లభిస్తుంది. ఇది చర్మం దృఢత్వాన్ని, హైడ్రేషన్‌ను మెరుగు పరుస్తుంది. ఉదయం లేదా రోజులో ఎప్పుడైనా దీనిని తీసుకోవచ్చు.

3. గ్రీన్ స్మూతీస్:
ఆకుపచ్చ కూరగాయలు, పండ్ల మిశ్రమంతో తయారు చేసే గ్రీన్ స్మూతీస్, చర్మ ఆరోగ్యానికి చాలా మంచివి.ఆకుకూరల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కణాలను రక్షించి, రిపేర్ చేయడంలో సహాయ పడతాయి. వీటిని అరటిపండు లేదా ఇతర పండ్లతో కలిపి తాగడం కొల్లాజెన్ ఉత్పత్తికి పరోక్షంగా సహాయ పడుతుంది. పాలకూర, అరటిపండు, కొంచెం నీరు లేదా కొబ్బరి నీరు కలిపి స్మూతీగా చేసుకొని తాగాలి.

Advertisement

4. బెర్రీ స్మూతీస్:
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్‌బెర్రీలు వంటి బెర్రీలలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బెర్రీలలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి కొల్లాజెన్‌ను రక్షిస్తాయి. ఇవి కొల్లాజెన్ ఏర్పడటానికి కూడా మద్దతునిస్తాయి. బెర్రీలను పెరుగు లేదా బాదం పాలతో కలిపి తాగడం వల్ల చర్మం వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుంది. వివిధ రకాల బెర్రీలు, కొద్దిగా పెరుగు లేదా కొబ్బరి పాలు కలిపి స్మూతీగా చేసుకోవచ్చు. వీటిలో చియా గింజలు చేర్చుకుంటే.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా లభిస్తాయి.

Also Read: చలికాలంలో హెయిర్ డ్రైయర్ వాడితే..ఏం జరుగుతుందో తెలుసా ?

5. పసుపు పాలు:
భారతీయ సాంప్రదాయంలో పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది. దీనిని ‘గోల్డెన్ డ్రింక్’ అని కూడా అంటారు. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థానికి బలమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మం లోపల మంటను తగ్గించి, కొల్లాజెన్‌ను దెబ్బతినకుండా రక్షిస్తాయి. ఆరోగ్యకరమైన చర్మానికి ఇది బంగారు మెరుపును ఇస్తుంది. రాత్రి పడుకునే ముందు చిటికెడు పసుపును వెచ్చని పాలల్లో కలిపి తాగాలి. దీనిని తరచుగా తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

6. కొబ్బరి నీరు:
కొబ్బరి నీరు అనేది ప్రకృతి సిద్ధంగా లభించే ఒక అద్భుతమైన హైడ్రేషన్ డ్రింక్. కొబ్బరి నీటిలో సహజమైన ఎలక్ట్రోలైట్స్, మినరల్స్, సైటోకినిన్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచి, దాని స్థితిస్థాపకతను కాపాడతాయి. చర్మాన్ని నిండుగా, కాంతివంతంగా, దృఢంగా ఉంచడంలో ఇది సహాయ పడుతుంది.
రోజుకు ఒక గ్లాసు కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యానికి, చర్మానికి చాలా మంచిది.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×