South Africa Coach statement: దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ముగిసింది. చరిత్రలో లేని రీతిలో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. గౌహతి వేదికగా జరిగిన రెండవ టెస్టులో భారత్ 408 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. రెండు టెస్ట్ లలో ఓడి సిరీస్ లో 0 – 2 తో వైట్ వాష్ కి గురైంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హయాంలో 13 నెలల్లో స్వదేశంలో భారత్ క్లీన్ స్వీప్ కావడం ఇది రెండవసారి.
Also Read: Sunil Gavaskar: ఈ ముగ్గురు ఇంకా కొనసాగితే, టీమిండియా మరో జింబాబ్వే కావడం పక్కా ?
అలాగే గత 25 ఏళ్లలో భారత గడ్డపై సఫారీలకు ఇది తొలి సిరీస్ విజయం. అయితే రెండవ టెస్టు చివరి రోజున భారత్ గెలుపొందాలంటే మరో 522 పరుగులు చేయాల్సిన సమయంలో.. ఇక అది అసాధ్యం అంతా భావించారు. ఇక దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే ఎనిమిది వికెట్లు తీస్తే సరిపోతుంది. అయితే మంగళవారం రోజు ఆట ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
మంగళవారం రోజు ఆట ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ శుక్రీ కోన్రాడ్ ఓ సంచలన ప్రకటన చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై భారత క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. నాలుగవ రోజు ఆట ముగిసిన తరువాత మీడియా సమావేశంలో దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ ని ఓ జర్నలిస్ట్ ఈ విధంగా ప్రశ్నించాడు. “మీరు ముందే ఎందుకు డిక్లేర్ ఇవ్వలేదు.. ఆల్రెడీ టార్గెట్ పెద్దగానే ఉంది కదా..! అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకి దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ మాట్లాడుతూ.. ” భారత జట్టు మైదానంలో ఎక్కువ సమయం గడపాలని మేము కోరుకున్నాం. వారిని మోకాళ్ళ పైకి తీసుకురావాలని అనుకున్నాం. అందుకే రెండవ ఇన్నింగ్స్ ని ఆలస్యంగా డిక్లేర్ చేశాం. చాలాసేపు వారిని క్రీజ్ లో ఉంచేలా చేసి.. ఆఖరికి వారిని మా ముందు సాష్టాంగపడేలా చేయడం కోసమే ఈ ఇన్నింగ్స్ ని ఆలస్యంగా డిక్లేర్ చేశాం. వాళ్లు రెండవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయాలి. కానీ ఫలితం మాకు అనుకూలంగా రావాలి. ఆఖరి రోజు ఆఖరి నిమిషం వరకు వాళ్లు పోరాడుతూనే ఉండాలి. చివరికి వారిపై మాది పైచేయి అవుతుంది” అని అన్నాడు.
గ్రోవెల్ అనే పదాన్ని ఉపయోగించి ఈ వివాదానికి తెర తీశాడు దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ కోన్రాడ్. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నేను వేరొకరి ఈ వ్యాఖ్యాన్ని దొంగిలిస్తున్నానని తెలిపాడు. 1976లో క్లైవ్ లాయిడ్ నేతృత్వంలోని వెస్టిండీస్ జట్టుతో సిరీస్ కి ముందు ఇంగ్లాండ్ దివంగత కెప్టెన్ టోనీ గ్రెగ్ చేసిన ప్రసిద్ధ ఇంటర్వ్యూ నుంచి ఒక వ్యాఖ్యాన్ని దొంగిలిస్తున్నానని తెలిపాడు. అయితే అతని టీమ్ ఆ సిరీస్ ని 0 – 3 తో కోల్పోయింది.
Also Read: Womens blind cricket: అంధుల క్రికెటర్లు ఇంత దారుణమా… కుళ్లిన పండ్లను తిని బతికేస్తున్నారా?
ఆ ప్రసిద్ధ ఇంటర్వ్యూ నుంచి దక్షిణాఫ్రికా కోచ్ ఓ పదాన్ని ఉపయోగిస్తూ.. {we wanted them {India} to really grovel} అని అన్నాడు. గ్రోవెల్ అంటే నేలపై పడుకోవడం లేదా పాకడం అని అర్థం. ఈ పదాన్ని దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష విషయం, కరేబియన్ ఆటగాళ్ల సందర్భంలో ఉపయోగించారు. అయితే దక్షిణాఫ్రికా కోచ్ చేసిన ఈ కామెంట్స్ పై టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సహా.. సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం డేల్ స్టేయిన్ కూడా విమర్శలు గుప్పించారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">