Homemade hair growth spray: జుట్టు రాలడం, పలచబడటం అనేది నేడు చాలా మందిని వేధిస్తున్న సమస్య మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ ప్రొడక్ట్స్ వాడి విసిగిపోయారా? అయితే మీ వంటింట్లో దొరికే సహజసిద్ధమైన వస్తువులతోనే అద్భుతమైన హెయిర్ గ్రోత్ స్ప్రేలను తయారు చేసుకోవచ్చు. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి సహాయ పడతాయి. తక్కువ ఖర్చుతో, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే 6 రకాల హెయిర్ స్ప్రేల గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు పెరుగుదలకు 6 అద్భుతమైన హోమ్ మేడ్ హెయిర్ స్ప్రేలు:
జుట్టు ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మీద ఎంత ఆధారపడి ఉంటుందో.. మనం తీసుకునే జాగ్రత్తల మీద కూడా అంతే ఆధారపడి ఉంటుంది. రసాయనాలతో కూడిన సీరమ్స్ కంటే సహజ సిద్ధమైన స్ప్రేలు జుట్టుకు ప్రాణం పోస్తాయి.
1. రోజ్‌మేరీ వాటర్ స్ప్రే :
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హెయిర్ గ్రోత్ కోసం అత్యధికంగా వాడుతున్నది రోజ్‌మేరీ వాటర్. ఇది తలలో రక్త ప్రసరణను పెంచి జుట్టు వేగంగా పెరగడానికి సహాయ పడుతుంది.
తయారీ: ఎండిన లేదా పచ్చి రోజ్‌మేరీ ఆకులను నీటిలో వేసి 15 నిమిషాల పాటు మరిగించి.. ఆ నీటిని చల్లార్చి స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి.
2. రైస్ వాటర్ స్ప్రే :
బియ్యం కడిగిన నీటిలో ఇనోసిటాల్ అనే కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇది జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది.
తయారీ: బియ్యాన్ని కడిగి ఆ నీటిని 24 గంటల పాటు పులియబెట్టి.. ఆ తర్వాత తలకు స్ప్రే చేసుకోవాలి.ఇది జుట్టుకు మంచి మెరుపును ఇస్తుంది.
3. ఉల్లిపాయ రసం స్ప్రే :
ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. కొత్త జుట్టు మొలవడానికి ఇది బెస్ట్ రెమెడీ.
తయారీ: ఉల్లిపాయ జ్యూస్ తీసి అందులో కొంచెం రోజ్ వాటర్ లేదా ఎసెన్షియల్ ఆయిల్ కలిపి స్ప్రే చేసుకోవాలి (వాసన పోవడానికి).
4. మెంతుల నీటి స్ప్రే:
మెంతుల్లో ప్రోటీన్ , నికోటినిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని వెంటనే అరికడతాయి.
తయారీ: మెంతులను రాత్రంతా నానబెట్టి.. మరుసటి రోజు ఆ నీటిని స్ప్రే బాటిల్‌లో పోసి తలకు పట్టించాలి.a
Also Read: రాత్రిపూట మామిడి పండు తింటున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి!
5. గ్రీన్ టీ హెయిర్ స్ప్రే:
గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు రాలడానికి కారణమయ్యే హార్మోన్లను నియంత్రిస్తాయి.
తయారీ: ఒక కప్పు నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ వేసి మరిగించి, ఆ నీటిని చల్లార్చి స్ప్రే చేసుకోవాలి.ఇది చుండ్రును కూడా తగ్గిస్తుంది.
6. అలోవెరా, కొబ్బరి నీళ్ల స్ప్రే:
జుట్టు డ్రైగా, నిర్జీవంగా ఉన్నవారికి ఇది అమృతం లాంటిది.
తయారీ: తాజా కలబంద జెల్‌ను కొబ్బరి నీళ్లతో కలిపి మిక్సీ పట్టి, వడకట్టి స్ప్రే చేయాలి. ఇది జుట్టుకు సహజమైన మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది.
ఎలా వాడాలి?
ఈ స్ప్రేలను వారానికి రెండు లేదా మూడు సార్లు జుట్టు కుదుళ్లకు పట్టించి.. వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. క్రమం తప్పకుండా 4 వారాలు పాటిస్తే అద్భుతమైన మార్పును గమనించవచ్చు.