E-Paper
Advertisement

తమిళనాడు సీఎం విజయ్ జీతం ఎంతో తెలుసా? సినిమా అంత కాదండోయ్, కాకపోతే ఆ సదుపాయాలే వేరు

తమిళనాడు సీఎం విజయ్ జీతం ఎంతో తెలుసా? సినిమా అంత కాదండోయ్, కాకపోతే ఆ సదుపాయాలే వేరు
Advertisement

Chennai: తన కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు సీఎం విజయ్. నటన నుంచి పక్కకు తప్పుకుని రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారు. ముఖ్యమంత్రిగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఆయన, ప్రజా సేవకుడిగా నెలకు ఎంత జీతం తీసుకోబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకీ విజయ్ జీతం ఎంతో తెలుసా?

తమిళనాడు సీఎం విజయ్ జీతం ఎంతో తెలుసా?

Advertisement

తమిళనాడు సీఎం విజయ్ జీతం విషయానికి వద్దాం. ముఖ్యమంత్రికి నెలకు రూ. 2,05,000 వేతనంగా అందుతుంది. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కాస్త తక్కువనే చెప్పాలి. ఎమ్మెల్యేగా లభించే నియోజకవర్గం దినసరి భత్యం వంటి అలవెన్సులను కలుపుకుంటే దాదాపుగా నెలకు రూ. 2,85,000 వస్తుంది.

ఇక ప్రజా ప్రతినిధిగా అధికారిక పనులు, సమావేశాల ఖర్చుల కోసం వీటిని చెల్లించనున్నారు. జీతం కంటే ఇతర సదుపాయాలు బీభత్సంగా ఉంటాయి. జీతంతో పాటు సీఎం హోదాలో పలు ప్రభుత్వ సౌకర్యాలు లభించనున్నాయి. చెన్నైలోని ఓ విలాసవంతమైన ప్రాంతంలో అధికారిక నివాస బంగ్లాను కేటాయిస్తారు.

Advertisement

సినిమా అంత కాదండోయ్, కాకపోతే ఆ సదుపాయాలే వేరు

అందులో క్యాంపు కార్యాలయం, సిబ్బంది కోసం ఏర్పాట్లు ఉంటాయి. ప్రయాణాల కోసం బుల్లెట్ ‌ప్రూఫ్ వాహనం, ఆపై పూర్తి కాన్వాయ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అధికారిక పర్యటనల సమయంలో రాష్ట్రం లేదా దేశంలో పర్యటించేటప్పుడు విమాన, రైలు, రోడ్డు ప్రయాణ ఖర్చులను ప్రభుత్వమే చూసుకుంటుంది. అంతేకాక బస కోసం స్టేట్ గెస్ట్‌ ఉంటుంది.

ముఖ్యమంత్రికి అత్యున్నత స్థాయి భద్రత కల్పిస్తారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతతోపాటు 30 మందికి పైగా ఎలైట్ కమాండోలు, పోలీసు సిబ్బంది నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తారు. పదవీ విరమణ తర్వాత మాజీ సీఎం హోదాలో పెన్షన్, వైద్య సదుపాయాలు, ఉచిత రైలు ప్రయాణం, పరిమిత సిబ్బందితో కూడిన ఆఫీసు నిర్వహణ ఖర్చులు వంటి ప్రయోజనాలు జీవితకాలం కొనసాగుతాయి.

ALSO READ: సరిహద్దు వివాదాలకు చెక్.. రంగంలోకి దిగిన బెంగాల్ సర్కార్.. అక్రమ చొరబాట్లకు ఇక దారులు మూసుకుపోయినట్లే!

ఆ లెక్కన వచ్చిన జీతం కంటే వచ్చే అలవెన్సులు ఎక్కువేనన్నమాట. ఇక నటుడిగా ఆయన తీసుకున్న పారితోషికంటే తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ రెమ్యూనరేషన్ చెప్పనక్కర్లేదు. అవన్నీ చూసుకుంటే కోట్ల నుంచి లక్షలకు పడిపోయారని ఆయన ఫ్యాన్స్ లోని ఓ వర్గం చెబుతోంది.

Related News

రైతులను నెలకు రూ.3 వేలు పెన్షన్.. ఆ స్కీమ్ గురించి తెలుసా, వెంటనే అప్లై చేయండి?

రోడ్డుపై BMW బీభత్సం, స్పాట్‌లో ముగ్గురు మృతి, ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం.. చిన్నారితో సహా ఇద్దరు భక్తులు దుర్మరణం

భార్య ప్రైవేట్ పార్ట్స్ కొరికితే.. భర్త ముక్కు కొరికేశాడు, యూపీలో విచిత్రమైన ఘటన

రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళ .. TTEతో వాగ్వాదం, స్వయంగా బట్టలు చించుకుని

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. జలపాతంలోకి దూసుకెళ్లిన కారు, 8 మంది మృతి

భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్!

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లోనూ షాక్!

Big Stories

Advertisement
×