E-Paper
Advertisement

ఏపీలో ఎక్కువ.. అండమాన్ లో తక్కువ.. ఇవాళ్టి పెట్రోల్, డీజిలో రేట్లు ఇవే!

ఏపీలో ఎక్కువ.. అండమాన్ లో తక్కువ.. ఇవాళ్టి పెట్రోల్, డీజిలో రేట్లు ఇవే!
Advertisement

Petrol and Diesel on May 11, 2026: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. పన్నులు, రవాణా ఖర్చులు, స్థానిక చార్జీల కారణంగా ప్రతి రాష్ట్రంలో ఇంధన ధరలు వేరుగా ఉంటాయి. 2026 మే 11 నాటి గణాంకాల ప్రకారం.. కొన్ని రాష్ట్రాల్లో ధరలు చాలా ఎక్కువగా ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా కనిపిస్తున్నాయి.

ఏపీలో మండుతున్న పెట్రో ధరలు

ప్రస్తుతం దేశంలో అత్యధిక ఇంధన ధరలు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. రాష్ట్రంలోని పలు నగరాల్లో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.108 నుంచి రూ.110 వరకు ఉంది. డీజిల్ ధరలు కూడా ఏపీలో ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పన్నులు, వ్యాట్, రవాణా ఖర్చులు ఎక్కువగా ఉండటం ఫ్యూయెల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీ ప్రజలపై అదనపు భారం పడుతోంది.

Advertisement

అటు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కూడా ఇంధన ధరలు ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయి. తాజా వివరాల ప్రకారం.. డీజిల్ ధర సుమారు రూ.95.70 వరకు ఉంది. పెట్రోల్ ధర కూడా ఎక్కువగానే ఉంది. హైదరాబాద్ లో వాహనాల వినియోగం ఎక్కువగా ఉండటం, రవాణా అవసరాలు అధికంగా ఉండటం లాంటి అంశాలు ధరలపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇంధన ధరలు భారీగానే ఉన్నాయి. హోషంగాబాద్ లాంటి ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి.

అండమాన్ లో తక్కువ ధరలు

ఇక దేశంలో అత్యల్ప ఇంధన ధరలు ఉన్న ప్రాంతాల విషయానికి వస్తే, అండమాన్ నికోబార్ దీవులు ముందున్నాయి. అక్కడ పెట్రోల్ ధర సుమారు రూ.82 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ.78 వరకు ఉంది. కేంద్ర పాలిత ప్రాంతం కావడం, పన్నుల తక్కువగా ఉండటం వల్ల ప్యూయెల్ ధరలు తక్కువగా ఉన్నాయి. ఢిల్లీ, నోయిడా వంటి నగరాల్లో కూడా ఇంధన ధరలు ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే కొంత తక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా డీజిల్ ధర అక్కడ సుమారు రూ.87.81గా ఉంది. తక్కువ రాష్ట్ర పన్నులు, కేంద్ర నియంత్రణ విధానాలే ధరల తగ్గుదలకు కారణంగా చెప్తున్నారు.

ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు ధర సవరణ

Advertisement

ఇంధన ధరలు ప్రతి రోజు ఉదయం 6 గంటలకు మారే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, డాలర్ మారకం విలువ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పన్నులు లాంటి అంశాల ఆధారంగా ధరల్లో మార్పులు ఉంటాయి. అందుకే, ప్రతి రోజూ ధరలు మారే అవకాశం ఉంటుంది.  వాహనదారులు తమ నగరంలో తాజా పెట్రోల్, డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే ఆయిల్ కంపెనీల అధికారిక యాప్‌ లు, వెబ్‌ సైట్లు ఉపయోగించవచ్చు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హెచ్‌పీసీఎల్ వంటి సంస్థలు ప్రతిరోజూ తాజా ధరలను విడుదల చేస్తున్నాయి.

Read Also: మే 15లోపు పేలనున్న ఫ్యూయెల్ బాంబ్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు?

Related News

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×