E-Paper
Advertisement

మొటిమల సమస్యతో విసిగిపోయారా? అరటిపండు తొక్కతో 10 నిమిషాల్లో మ్యాజిక్ గ్లో!

మొటిమల సమస్యతో విసిగిపోయారా? అరటిపండు తొక్కతో 10 నిమిషాల్లో మ్యాజిక్ గ్లో!
Advertisement

Banana peel for acne removal: యూత్‌ని వేధించే అతిపెద్ద బ్యూటీ ప్రాబ్లమ్ ఏంటంటే.. మొటిమలు. మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, ఫేస్ వాష్‌లు వాడినా ఇవి తగ్గకపోగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. కానీ.. మన ఇంట్లో దొరికే అరటిపండు తొక్కతోనే మొటిమలను శాశ్వతంగా వదిలించుకోవచ్చని మీకు తెలుసా? అరటి తొక్కలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేసి మొటిమలను తగ్గిస్తాయి. అరటిపండు తొక్కను ఏ 6 పద్ధతులలో వాడి మొటిమలను తరిమికొట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటిపండు తొక్కతో మొటిమలను తగ్గించే 6 పద్ధతులు:

Advertisement

1. డైరెక్ట్ రబ్బింగ్ పద్ధతి:
ఇది అన్నింటికంటే చాలా సులువైన మార్గం. ఒక తాజా అరటిపండు తొక్కను తీసుకుని.. దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముఖాన్ని మైల్డ్ ఫేస్ వాష్‌తో క్లీన్ చేసుకున్న తర్వాత.. ఆ అరటి తొక్క లోపలి భాగం (తెల్లటి వైపు) మొటిమలు ఉన్న చోట మెల్లగా రుద్దాలి. అలా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు సర్క్యులర్ మోషన్‌లో మసాజ్ చేయాలి. ఆ తొక్క లోపలి భాగం నల్లగా మారేంతవరకు రుద్ది, ఆపై ఒక 20 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో మొహం కడుక్కోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే మొటిమల సైజ్ వేగంగా తగ్గుతుంది.

2. అరటి తొక్క , నిమ్మరసం కాంబినేషన్:
నిమ్మరసంలో ఉండే విటమిన్-సి, సిట్రిక్ యాసిడ్ చర్మంపై ఉన్న బ్యాక్టీరియాను చంపేస్తాయి. ఒక స్పూన్ అరటిపండు తొక్క పేస్ట్ (తొక్కను మిక్సీ పట్టింది) తీసుకుని, అందులో కొన్ని చుక్కల ఫ్రెష్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక కాటన్ బాల్ సహాయంతో మొటిమలు, నల్లటి మచ్చలు ఉన్న చోట మాత్రమే అప్లై చేయాలి. ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచి.. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఈ పద్ధతిని వాడే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

Advertisement

3. అరటి తొక్క,పసుపు ప్యాక్ :
మన ఇళ్లలో వాడే పసుపులో అద్భుతమైన యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అరటిపండు తొక్క లోపలి భాగాన్ని చెంచాతో స్క్రాప్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో చిటికెడు కస్తూరి పసుపు లేదా వంట పసుపు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌లా వేసుకుని అరగంట పాటు ఆరనివ్వాలి. పసుపు , అరటి తొక్కల వల్ల మొటిమల వల్ల వచ్చే వాపును, నొప్పిని ఇన్‌స్టంట్‌గా తగ్గిస్తుంది. వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది.

4. అరటి తొక్క, తేనె మాయిశ్చరైజర్ :
తేనె చర్మానికి సహజసిద్ధమైన తేమను అందించడమే కాకుండా.. మొటిమలను కలిగించే ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అరటిపండు తొక్కను మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసి, అందులో ఒక చెంచా ఆర్గానిక్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తేనె చర్మాన్ని సాఫ్ట్‌గా మారిస్తే, అరటి తొక్కలోని పొటాషియం చర్మ రంధ్రాలలో ఉన్న మురికిని గుంజేస్తుంది. డ్రై స్కిన్ ఉండి, మొటిమల సమస్యతో బాధపడేవారికి ఇది బెస్ట్ హోమ్ రెమెడీ.

5. అరటి తొక్క, బేకింగ్ సోడా స్క్రబ్ :
చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ , ఆయిల్ పేరుకుపోవడం వల్ల కూడా మొటిమలు వస్తుంటాయి. వీటిని తొలగించడానికి ఒక చెంచా అరటి తొక్క పేస్ట్‌లో అర చెంచా బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా నీరు చేర్చి ముఖంపై స్క్రబ్‌లా చాలా సాఫ్ట్‌గా రుద్దాలి. బేకింగ్ సోడా చర్మ రంధ్రాలను క్లీన్ చేస్తుంది. అయితే గుర్తుంచుకోండి.. మొటిమలు పెద్దగా, నొప్పితో ఉన్నప్పుడు స్క్రబ్బింగ్ అస్సలు చేయకూడదు.కేవలం వైట్‌హెడ్స్, బ్లాక్‌హెడ్స్ ఉండి చిన్న చిన్న మొటిమలు ఉన్నప్పుడే ఈ పద్ధతిని వాడాలి.

6. అరటి తొక్క, ఓట్స్‌తో క్లెన్సింగ్ :
ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఓట్స్ ఒక వరమనే చెప్పాలి. ఇది ఫేస్ పై ఉన్న ఎక్స్‌ట్రా ఆయిల్‌ను పీల్చేస్తుంది. ఒక చెంచా ఓట్స్ పౌడర్, ఒక చెంచా అరటిపండు తొక్క పేస్ట్, కొద్దిగా పాలు లేదా రోజ్ వాటర్ కలిపి థిక్ పేస్ట్‌లా చేయాలి. దీనిని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది చర్మానికి మంచి గ్లో ఇవ్వడమే కాకుండా, భవిష్యత్తులో మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది.

వేల రూపాయల క్రీములు కొనే బదులు, రోజూ ఇంట్లో దొరికే అరటిపండు తొక్కతోనే ఈజీగా మొటిమలను తగ్గించుకోవచ్చు. ఈ 6 పద్ధతులలో మీ చర్మ తత్వానికి సరిపోయే ఏదో ఒక పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే, మీ ముఖంపై మొటిమలు మాయమవడమే కాదు.. స్కిన్ టోన్ కూడా అద్భుతంగా మెరుగుపడుతుంది.

Related News

వర్షాకాలంలో ఊసరవెల్లులు ఇంట్లో వస్తున్నాయా? దూరంగా ఉంచేందుకు ఈ 3 చిట్కాలు

మీరు సన్‌స్క్రీన్ పిల్స్ తీసుకుంటున్నారా? జాగ్రత్త చర్మ వైద్యులు ఏం చెబుతున్నారంటే

స్కూల్ పిల్లలకు వర్షాకాలంలో ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువ.. ఆరోగ్యకరంగా ఉండేందుకు ఈ అలవాట్లు తప్పనిసరి

ఒడిస్సీ సినిమా.. తామర పువ్వు తింటే జ్ఞాపకశక్తి పోతుందా? నిపుణులు ఏమంటున్నారు?

గోళ్లు-కనుబొమ్మలు-కాలివేళ్లు.. ఇవే ఓ వ్యక్తి సంపద రహస్యం, కాకపోతే

లీవ్ కోసం బాస్‌కి 50 వింత సాకులు చెప్పిన డెవలపర్.. చివరికి ఏమైందో తెలిస్తే షాక్ అవుతారు!

చామన ఛాయ లేదా నల్లగా ఉండే వారికి మ్యాచింగ్ కలర్స్.. ఈ 7 కలర్ డ్రెస్‌లతో రాయల్ లుక్

ప్రేమ రూపం చూసి కలుగుతుందా లేక మనసు చూసి పుడుతుందా? నిజం చేదుగా ఉంటుంది

Big Stories

Advertisement
×