E-Paper
Advertisement

ఈవీ కొనాలనుకునే వారికి ఏథర్ షాక్.. రిజ్టా ధరలు పెంపు!

ఈవీ కొనాలనుకునే వారికి ఏథర్ షాక్..  రిజ్టా ధరలు పెంపు!
Advertisement

Ather Rizta Price Revision: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావిస్తున్న వారికి ఏథర్ షాకిచ్చింది. తన పాపులర్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ రిజ్టా ధరలను పెంచినట్లు ప్రకటించింది. కొత్త ధరలను వెంటనే అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ ధరల పెంపు అన్ని వేరియంట్లపై వర్తిస్తుందని వెల్లడించింది. ఎంట్రీ-లెవల్ 2.9kWh బ్యాటరీతో వచ్చే రిజ్టా S వేరియంట్ ధర రూ.3,000 పెరిగింది. మరోవైపు, రిజ్టా Z వేరియంట్లతో పాటు 3.7kWh బ్యాటరీ ప్యాక్‌ తో వచ్చే S వేరియంట్ ధరలను రూ.4,000 వరకు పెంచారు.

ధరల పెంపునకు కారణం ఏంటంటే?

ధరల సవరణకు ప్రధాన కారణం ఉత్పత్తి ఖర్చులు పెరగడమేనని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ముడి పదార్థాల ధరలు పెరగడం, తయారీ వ్యయాలు అధికం కావడం వల్ల ఆటోమొబైల్ రంగంలోని అనేక కంపెనీలు ధరలను సవరించాల్సి వచ్చింది. ఏథర్ కూడా అదే దారిలో నడిచింది.

ధరల పెంపు తర్వాత ఏ వేరియంట్ రేట్ ఎంత?

Advertisement

ధరల పెంపు తర్వాత రిజ్టా S (2.9kWh) వేరియంట్ ప్రారంభ ధర రూ.1,21,046గా ఉంది. రిజ్టా Z (2.9kWh) ధర రూ.1,39,045కు చేరుకుంది. పెద్ద బ్యాటరీతో వచ్చే రిజ్టా S (3.7kWh) ధర రూ.1,43,547 కాగా, టాప్ ఎండ్ రిజ్టా Z (3.7kWh) ధర రూ.1,59,046గా నిర్ణయించారు.

రిజ్టా పనితీరు గురించి..   

రిజ్టా బ్యాటరీ పనితీరు విషయానికి వస్తే, 2.9kWh బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 105 కిలోమీటర్ల వరకు వాస్తవ రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. పెద్ద 3.7kWh బ్యాటరీతో ఈ రేంజ్ 125 కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. రోజువారీ నగర ప్రయాణాలకు ఈ రేంజ్ సరిపోతుందని భావిస్తున్నారు. బ్యాటరీలకు ఐదేళ్లు, 60,000 కిలోమీటర్ల వారంటీ కూడా లభిస్తుంది. అదనంగా IP67 రేటింగ్ ఉండటంతో వాటర్, దుమ్ము ధూళి నుంచి కూడా మంచి రక్షణ లభిస్తుంది.

ఆకట్టుకునేలా ఫీచర్లు

Advertisement

ఫీచర్ల పరంగా కూడా రిజ్టా మంచి ప్యాకేజీని అందిస్తోంది. టాప్ వేరియంట్ అయిన Zలో 7 అంగుళాల కలర్ TFT డిస్‌ ప్లే ఉంటుంది. దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటి స్మార్ట్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. S వేరియంట్‌ లో మాత్రం ఏథర్ 450Sలో ఉపయోగించిన డీప్‌వ్యూ LCD డిస్‌ ప్లేను అందిస్తున్నారు.

స్కూటర్‌లో స్మార్ట్ ఎకో, జిప్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆటో హోల్డ్, రివర్స్ మోడ్ వంటి ఉపయోగకరమైన ఫీచర్లతో పాటు మ్యాజిక్ ట్విస్ట్ అనే ప్రత్యేక ఫీచర్ కూడా అందిస్తున్నారు. దీని సహాయంతో బ్రేక్‌ను ఉపయోగించకుండానే రీజెనరేటివ్ బ్రేకింగ్ ద్వారా స్కూటర్ వేగాన్ని తగ్గించవచ్చు. ధరలు పెరిగినప్పటికీ మంచి రేంజ్, ఆధునిక ఫీచర్లు, కుటుంబ వినియోగానికి అనువైన డిజైన్ కారణంగా ఏథర్ రిజ్టా ఇప్పటికీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు బెస్ట్ ఆప్షన్ గానే కొనసాగుతోంది.

Read Also: హీరో సంచలన ప్రకటన.. ఇక అన్ని బైకులు ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ లోనే!

Related News

పాత వాహనాలు ఉన్నాయా? కేంద్రం అదిరిపోయే ఆఫర్లు.. చలానాలు, ట్యాక్స్ మాఫీ!

మళ్లీ షాకిచ్చిన మారుతి.. ఆగస్టులో మరోసారి కార్ల ధరల పెంపు!

కొత్త టయోటా హిలక్స్ టీజర్ రిలీజ్.. ఈసారి లుక్ మామూలుగా లేదు!

పండుగకు ముందు బజాజ్ బ్లాస్ట్.. ఒకేసారి 10 కొత్త మోడళ్లు ఎంట్రీ!

లాంచ్‌కు ముందే బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ సీక్రెట్స్ లీక్.. కొత్త ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

వర్షాకాలంలో ఇంట్లో EV ఛార్జింగ్ చేస్తున్నారా? ఈ ఒక్క తప్పు చేస్తే అగ్గికి బుగ్గి అవ్వడం పక్కా!

యమహా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లుక్ లీక్.. ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు!

సిట్రోయెన్ మాస్టర్ స్ట్రోక్.. బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల!

Big Stories

Advertisement
×