E-Paper
Advertisement

Women Health: ఉద్యోగ మహిళల్లో పెరుగుతున్న నిశ్శబ్ద ముప్పు.. ఈ హార్మోన్ వ్యాధితో కష్టమే

Women Health: ఉద్యోగ మహిళల్లో పెరుగుతున్న నిశ్శబ్ద ముప్పు.. ఈ హార్మోన్ వ్యాధితో కష్టమే

ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య అధికంగాఉంది. వారిలో థైరాయిడ్ సమస్య అధికంగా పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. అలసట, బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలిపోవడం, మూడ్ మార్పులు వంటి లక్షణాలతో ఎంతో మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఈ లక్షణాలను చాలామంది సాధారణ పని ఒత్తిడిగా భావించి పట్టించుకోవడం లేదు. కానీ వైద్యులు చెబుతున్న ప్రకారం చాలా సందర్భాల్లో థైరాయిడ్ సమస్యల మొదటి సంకేతాలుగా భావించాలని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య నెమ్మదిగా మొదలవుతుండటంతో వెంటనే స్పష్టంగా కనిపించదు. అందుకే దీనిని నిశ్శబ్ద హార్మోన్ ముప్పుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కెరీర్, కుటుంబ బాధ్యతల మధ్య తమ ఆరోగ్యాన్ని పక్కన పెట్టే ఉద్యోగ మహిళలు ఈ సమస్యకు ఎక్కువగా గురవుతున్నారు.

థైరాయిడ్ అంటే ఏమిటి?
థైరాయిడ్ అనేది మెడ భాగంలో ఉండే చిన్న గ్రంథి. ఇది సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఈ గ్రంథి నుంచి విడుదలయ్యే T3, T4 హార్మోన్లు మన శరీరంలోని మెటాబాలిజం, శక్తి స్థాయి, గుండె స్పందన, బరువు నియంత్రణ, చర్మం, జుట్టు వంటి అనేక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. ఈ హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటే శరీరం మొత్తం ప్రభావితమవుతుంది. మహిళల్లో నెలసరి, గర్భధారణ, ప్రసవం, మెనోపాజ్ వంటి దశల్లో హార్మోన్ల మార్పులు ఎక్కువగా జరుగుతాయి. ఈ మార్పులే థైరాయిడ్ గ్రంథిపై ప్రభావం చూపి సమస్యలకు దారి తీస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

ఉద్యోగమూ కారణమే
ఉద్యోగ జీవితం కూడా థైరాయిడ్ సమస్యలు పెరగడానికి ఒక ప్రధాన కారణంగా మారింది. ఎక్కువ పని గంటలు, సమయానికి భోజనం చేయకపోవడం, ఫాస్ట్ ఫుడ్ అలవాటు, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి అంశాలు శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా ఆఫీస్ పనితో పాటు ఇంటి బాధ్యతలు కూడా చూసుకునే మహిళల్లో ఈ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరం అలసటకు లోనవుతూ థైరాయిడ్ సమస్యలు నెమ్మదిగా పెరుగుతాయి. చాలామంది మహిళలు ఈ లక్షణాలను సాధారణ అలసటగా భావించి సంవత్సరాల పాటు పరీక్షలు చేయించుకోకుండా ఉంటున్నారు.

థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఎప్పుడూ అలసటగా ఉండటం, బరువు అకస్మాత్తుగా మారడం, జుట్టు ఎక్కువగా రాలిపోవడం, చర్మం పొడిబారడం, చిరాకు, డిప్రెషన్ భావనలు, మరిచిపోవడం, మాసిక ధర్మంలో అవకతవకలు వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవన్నీ నిర్లక్ష్యం చేయకుండా సమయానికి రక్త పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. TSH, T3, T4 వంటి పరీక్షల ద్వారా థైరాయిడ్ స్థాయులను తెలుసుకోవచ్చు. ముందుగానే గుర్తిస్తే మందులతో సులభంగా నియంత్రించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

జీవనశైలిలో ఈ మార్పులు
థైరాయిడ్ సమస్యను నియంత్రించాలంటే మందులతో పాటు జీవనశైలిలో మార్పులు కూడా తప్పనిసరి. సమయానికి భోజనం చేయడం, పోషకాహారం తీసుకోవడం, రోజుకు కనీసం 7–8 గంటలు నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం చేయడం ఎంతో అవసరం. చికిత్స చేయని థైరాయిడ్ సమస్యలు గర్భధారణపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందుకే ఉద్యోగ మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సమయానికి గుర్తించి చికిత్స తీసుకుంటే థైరాయిడ్‌తో కూడా సాధారణ, ఆరోగ్యకరమైన జీవితం గడపడం సాధ్యమే.

Related News

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

ఏసీ గదిలో ఉంటే చర్మం పొడిబారుతోందా? ఈ చిన్న చిట్కాతో మీ చర్మాన్ని కాపాడుకోండి

Big Stories

×