E-Paper
Advertisement

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. నిద్ర లేవగానే ఇవి చూస్తే దరిద్రం !

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. నిద్ర లేవగానే ఇవి చూస్తే దరిద్రం !
Advertisement

Chanakya Niti: చాణక్య నీతి.. ఒక వ్యక్తి ఉదయం నిద్ర లేవగానే కొన్ని వస్తువులను లేదా దృశ్యాలను చూడకూడదని,మరికొన్నింటిని తప్పకుండా చూడాలని సూచిస్తోంది. ఉదయం వేళ చూసే దృశ్యాలు లేదా వస్తువులు ఆ రోజంతా మన మనస్సుపై, పనులపై ప్రభావం చూపుతాయని చాణక్యుడు తెలిపాడు. అందుకే సానుకూలత, విజయాన్ని ప్రోత్సహించే వస్తువులను చూడటం, ప్రతికూలతను లేదా దురదృష్టాన్ని సూచించే వాటిని నివారించడం శ్రేయస్కరం అని ఆయన చెప్పారు.

ఉదయం చూడకూడని వస్తువులు:

Advertisement

ఇతరుల ముఖం: నిద్ర లేవగానే ఇతరుల ముఖం, ముఖ్యంగా మీకు నచ్చని లేదా కోపం, అసూయ వంటి భావాలు ఉన్న వ్యక్తుల ముఖాలను చూడకూడదు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి యొక్క ప్రతికూల శక్తి మీ మనస్సుపై ప్రభావం చూపి, రోజంతా మీ ఆలోచనలు, పనులు దెబ్బతింటాయని నమ్ముతారు. ఉదయం ప్రశాంతంగా.. సంతోషంగా రోజును ప్రారంభించాలంటే దీనిని నివారించాలి.

పగిలిపోయిన లేదా విరిగిపోయిన వస్తువులు: విరిగిన అద్దాలు, పగిలిన పాత్రలు లేదా ఇతర విరిగిపోయిన వస్తువులను ఉదయాన్నే చూడటం అశుభం. ఇవి జీవితంలో దురదృష్టం, నష్టం, వ్యర్థాలను సూచిస్తాయి. ఇలాంటి దృశ్యాలు మనస్సుకు అశాంతిని కలిగించి, ప్రతికూల ఆలోచనలకు దారితీస్తాయి. కాబట్టి.. ఇంట్లో ఎలాంటి విరిగిపోయిన వస్తువులు లేకుండా చూసుకోవడం మంచిది.

Advertisement

మురికి లేదా చెత్త: ఉదయాన్నే మురికి ప్రదేశాలు, చెత్తకుండీలు లేదా అపరిశుభ్రమైన వాతావరణం చూడకూడదు. ఎందుకంటే.. ఇవి నిస్సత్తువ, వ్యాధి, లక్ష్మీదేవి ఆగ్రహాన్ని సూచిస్తాయి. ఉదయం ఇలాంటివి చూడటం వల్ల రోజంతా ఉత్సాహం లోపించి.. నిరుత్సాహంగా మారే అవకాశం ఉంది. శుభ్రత అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. అందుకే ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలని చాణక్యుడు తెలిపాడు.

క్రూరమైన జంతువుల ఫొటోలు లేదా బొమ్మలు: నిద్ర లేవగానే క్రూరమైన లేదా భయంకరమైన జంతువుల చిత్రాలను చూడటం కూడా మంచిది కాదని భావిస్తారు. ఇవి మనస్సులో భయం, హింస, అశాంతిని ప్రేరేపిస్తాయి.

ఉదయం చూడాల్సిన వస్తువులు:
చాణక్యుడు ఉదయం లేవగానే చేయాల్సిన, చూయకూడని అనేక సానుకూల విషయాలను సూచించారు. ఇవి రోజును ఉత్సాహంగా, విజయవంతంగా ప్రారంభించడానికి సహాయపడతాయి.

అరచేతులు: ఉదయం లేవగానే ముందుగా మీ అరచేతులను చూడాలి. అరచేతిలో లక్ష్మీ (సంపద), సరస్వతి (జ్ఞానం), గోవిందుడు (శక్తి) నివసిస్తారని నమ్ముతారు. అర చేతులను చూస్తూ ఈ శ్లోకాన్ని పఠించాలి. “కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ| కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనమ్॥” ఇలా చేయడం వల్ల సంపద, జ్ఞానం, దైవశక్తి లభిస్తాయని చాణక్య నీతి చెబుతోంది.

శుభప్రదమైన విగ్రహాలు: ఉదయాన్నే దేవుడి విగ్రహాలు, దీపం, పసుపు, కుంకుమ, తులసి మొక్క లేదా శంఖం వంటి శుభప్రదమైన చిహ్నాలను చూడటం వల్ల మనస్సులో సానుకూలత ఏర్పడి, రోజంతా ఆనందంగా ఉంటుంది.

పచ్చదనం, నీరు: నిద్ర లేచిన వెంటనే పచ్చని చెట్లు, మొక్కలు లేదా నిర్మలమైన నీటిని (ఉదాహరణకు నది లేదా కొలను) చూడటం వల్ల మనస్సుకు శాంతి, ప్రశాంతత లభిస్తాయి.

Also Read: ఇలాంటి వారికి దూరంగా ఉండకపోతే.. జీవితంలో చాలా నష్టపోతారు !

అగ్నిహోత్రం (లేదా సూర్యోదయం): అగ్ని లేదా సూర్యుడిని చూడటం తేజస్సు, శక్తి, శుభాన్ని సూచిస్తుంది. సాధ్యమైతే, సూర్యోదయానికి ముందు మేల్కొని.. సూర్యుడికి నమస్కరించడం ఆయురారోగ్యాలను ఇస్తుందని చాణక్య నీతి చెబుతుంది.

చాణక్య నీతి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే.. ఉదయం సమయాన్ని సానుకూలతతో, శాంతితో ప్రారంభించాలి. చూడకూడని వస్తువులన్నీ అశుభం, నిస్సత్తువ లేదా ప్రతికూలతను సూచించేవి. వాటిని నివారించడం ద్వారా.. మనస్సును ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంచుకోవచ్చు. తద్వారా పనులలో విజయం, సంపద, శ్రేయస్సు లభిస్తాయని చాణక్యుడు తన నీతిశాస్త్రంలో పేర్కొన్నాడు.

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×