E-Paper
Advertisement

Annagaru Vostaru Teaser : అన్నగారు వచ్చేసారు, కామెడీ పోలీస్ యాక్షన్ మోడ్ లోకి దిగితే?

Annagaru Vostaru Teaser : అన్నగారు వచ్చేసారు, కామెడీ పోలీస్ యాక్షన్ మోడ్ లోకి దిగితే?
Advertisement

Annagaru Vostaru Teaser : కార్తీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పేరుకు తమిళ నటుడు అయినా కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ఇప్పటికీ కూడా పలు ఇంటర్వ్యూస్ లో కార్తీ మాట్లాడుతూ నాకు తమిళ్ ప్రేక్షకులు కంటే కూడా తెలుగు ప్రేక్షకులు ఎక్కువ ఇష్టం అని చెబుతుంటాడు. తన సినిమాలకు కూడా తనే డబ్బింగ్ చెప్పుకోవడంతో ఇంకా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిపోయాడు. కేవలం తెలుగులో మాట్లాడటం కాకుండా పాటలు కూడా పాడుతుంటాడు.

అతను నటించిన సత్యం సుందరం సినిమా తెలుగులో విడుదలై మంచి సక్సెస్ సాధించుకుంది. ఆ ఈవెంట్ లో కార్తి పాడిన అదే నీవు అనే పాట ఇంస్టాగ్రామ్ లో అప్పట్లో వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం కార్తీ నలన్ కుమారు స్వామి దర్శకత్వంలో అన్నగారు వస్తారు అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. తెలుగు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ టీజర్ లాంచ్ చేశారు.

అన్నగారు వస్తున్నారు టీజర్ 

Advertisement

ఈ టీజర్ అద్భుతమైన బ్యాండ్ మేళంతో మొదలవుతుంది. పోలీస్ డ్రెస్ లో కార్తీక్ కనిపిస్తాడు. కేవలం కనిపించడం మాత్రమే కాకుండా అద్భుతమైన స్టెప్పులు కూడా వేస్తూ మంచి ఫన్ క్రియేట్ చేశాడు. అక్కడ క్రేజీగా డాన్స్ చేస్తున్న తరుణంలోనే ఊహించని విధంగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ సెలబ్రేషన్ నుంచి సీరియస్ మోడ్ లో కార్తి కనిపిస్తారు.

మొత్తానికి ఈ టీజర్ చూస్తుంటే సినిమా మీద కొంత మేరకు అంచనాలు పెరుగుతున్నాయి. పోలీస్ పాత్రలో కార్తీ మరోసారి సక్సెస్ కొట్టేలా ఉన్నాడు. గతంలో పోలీస్ పాత్రలో కనిపించిన ఖాకీ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో కూడా మరోసారి అది రిపీట్ అయ్యేటట్లు ఉంది.

Advertisement

సక్సెస్ వైబ్స్ 

మొత్తానికి ఈ టీజర్ కార్తీకి మంచి సక్సెస్ ఇస్తుంది అనిపించేలా ఉంది. ఈ సినిమాలో కార్తీతో పాటు కృతి శెట్టి నటిస్తుంది. ఉప్పెన సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన కృతికి ఆ సినిమా తర్వాత, ఊహించిన సక్సెస్ ఇప్పటివరకు రాలేదు.

ఇక ఈ సినిమా అయినా చెప్పుకునే సక్సెస్ ఇస్తుందేమో చూడాలి. ఈ సినిమాకి సంతోష్ నారాయన్ సంగీతం అందిస్తున్నారు. జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేస్తున్నారు. అదే రోజున తెలుగులో సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన మొగ్లీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Also Read: Actress Mirchi Madhavi: ఆ డైరెక్టర్ కమిట్మెంట్ అడిగాడు, చెప్పు తీసుకొని కొడతా అని చెప్పా

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×