Ram – Bhagyashri borse : రామ్ పోతినేని మరియు భాగ్యశ్రీ కలిసి నటించిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిన్ననే విడుదలైంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. రామ్ పోతినేని ఒక సక్సెస్ఫుల్ సినిమా చేసి చాలా రోజులు అయిపోయింది.
ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత తను చేసిన సినిమాలేవి కూడా ఊహించిన స్థాయిలో సక్సెస్ పొందలేదు. అందుకే తన అంచనాలన్నీ కూడా ఈ సినిమా మీద పెట్టుకున్నాడు. మొత్తానికి ఈ సినిమా పాజిటివ్ టాక్ సాధించుకుంది. కొద్దిసేపటి క్రితమే చిత్ర నిర్మాతలు సక్సెస్ ప్రెస్ మీట్ కూడా పెట్టారు.
ఈ సక్సెస్ ప్రెస్ మీట్ కు రామ్ పోతినేని మరియు భాగ్యశ్రీ హాజరు కాలేదు. వీళ్ళిద్దరూ హాజరు కాకపోవడానికి అసలైన కారణం వీళ్ళు అమెరికాలో సినిమాను ప్రమోట్ చేయడమే. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత కూడా చెప్పారు. అయితే అమెరికాలో వీరిద్దరి ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అయితే ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత విపరీతంగా పాపులర్ అయింది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాను యుఎస్ లో ప్రమోట్ చేయడానికి వెళ్లారు. కానీ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఫొటోస్ చాలా తక్కువగా మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీరిద్దరూ ప్రత్యేకంగా దిగిన ఫోటోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భాగ్యశ్రీ ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సెల్ఫీ వీడియో తీస్తున్న తరుణంలో రామ్ స్పెక్ట్స్ పెట్టుకుంటాడు, పక్కనుంచి అబ్బో అని భాగ్యశ్రీ అంటుంది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే వీరిద్దరూ బాగా క్లోజ్ గా దిగిన ఫోటోలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. దీనితో చాలామంది సినిమా ప్రమోషన్ కోసం యూఎస్ వెళ్లారా లేకపోతే ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కొత్తగా రామ్ కూడా ప్రేమ పాటలు రాయడానికి కారణం ప్రేమలో ఉండటమే అని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. మొత్తానికి వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అయితే అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇది సినిమా చూస్తే అర్థమవుతుంది.
ఇక ప్రస్తుతం ఆఫ్లైన్లో కూడా వీళ్లు ఇదే కెమిస్ట్రీని మెయింటైన్ చేస్తూ అమెరికా వీధుల్లో చక్కెర్లు కొడుతున్నారా? దీనిపైన నిర్మాతలు ఏమైనా స్పందించే అవకాశం ఉంటుందా లేదా వేచి చూడాలి. నిజమైన మొత్తానికి ఒక వైపు రాం పోతినేనికి మరోవైపు భాగ్యశ్రీ కి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో సక్సెస్ చేరువైనట్లే.
Also Read: Annagaru Vostaru Teaser : అన్నగారు వచ్చేసారు, కామెడీ పోలీస్ యాక్షన్ మోడ్ లోకి దిగితే?