E-Paper
Advertisement

ADHD Symptoms: ఈ అబ్బాయిలు ఉన్నారే.. వీళ్లకి తిండి కంటే అదే ఎక్కువట!

ADHD Symptoms: ఈ అబ్బాయిలు ఉన్నారే.. వీళ్లకి తిండి కంటే అదే ఎక్కువట!
Advertisement

ADHD Symptoms: నేటి ఈ టెక్ యుగంలో చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దవాళ్ల వరకు, వయసుతో సంబంధం లేకుండా.. స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కు పోతున్నారు. ఇక పిల్లలయితే, భోజనం చేయకుండా అయినా ఉంటారేమో కానీ, ఫోన్ చూడకుండా మాత్రం క్షణం కూడా ఉండలేకపోతున్నారు. అంతలా ఫోన్‌కి, స్క్రోలింగ్‌కి, ఆన్‌లైన్ గేమ్స్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. ఆ అలవాటే ఇప్పుడు వారి భవిష్యత్తుని అగమ్యగోచరం చేస్తోంది. ఇకపోతే.. స్క్రీన్ ఎక్స్‌పోజర్, ఆధునిక జీవనశైలి బాలికల్లో కంటే, బాలురపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తోందట. తద్వారా ADHD లక్షణాలతో బాధపడుతున్నారట.

ADHD అంటే ఏమిటి?

ప్రస్తుత ఆధునిక జీవనశైలి ద్వారా వచ్చే మార్పులు, ఎక్కువగా స్క్రీన్ ముందు కూర్చోవడం ద్వారా పిల్లల్లో ADHD లక్షణాలు కనిపిస్తున్నాయని హైదరాబాద్‌కి చెందిన మానసిక నిపుణులు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ADHD (Attention Deficit Hyperactivity Disorder) అంటే.. పిల్లలు చాలా విషయాల్లో అజాగ్రత్త వహించడం (దేని పైనా అంతగా శ్రద్ధ పెట్టకపోవడం) అని అర్థం. బాలికలతో పోలిస్తే బాలురలోనే ఈ లక్షణాలు అధికంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

స్క్రీన్ ఎక్స్‌పోజరే మెయిన్ విలన్..

Advertisement

6 నుంచి 10 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లల్లో ADHD లాంటి లక్షణాలు క్రమంగా పెరుగుతున్నాయని సైకాలజిస్టులు గుర్తించారు. ఎక్కువ స్క్రీన్ సమయం ప్రధాన కారకంగా మారుతోందని పేర్కొన్నారు. రోజుకు రెండు గంటలకు పైగా స్క్రీన్‌ను చూస్తున్న పిల్లల్లో ఏకాగ్రత, ప్రవర్తన సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం 7.7 రెట్లు అధికమని తెలిపారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకపోవడం వల్ల కూడా వారి దృష్టి, భావోద్వేగ నియంత్రణను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.

ప్రమాదకర ఘంటికలు..

పిల్లలు అల్లరి చేస్తున్నారనో.. అన్నం తినడం లేదనో.. ఇలా ఏదో ఒక కారణం చేత తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అలవాటు చేస్తున్నారు. ఇది పిల్లల మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే, పిల్లల మానసిక పరిస్థితిలో మార్పులు వచ్చినప్పుడు, ADHD లక్షణాలు ఉన్నాయని తెలిస్తే.. వారితో కఠినంగా కాకుండా సానుభూతితో వ్యవహరిస్తూ పిల్లల్లో మార్పులు తీసుకురావచ్చని సైకాలజిస్ట్‌‌లు సూచిస్తున్నారు.

Related News

సోషల్ మీడియాలో ఏళ్ల తరబడి ఒకే ప్రొఫైల్ ఫొటో పెట్టేవారు చాలా స్పెషల్.. సైకాలజీ ఏం చెబుతోందంటే?

లెక్కలో యమ ఫాస్ట్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణులు

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

Big Stories

Advertisement
×