Ind vs Aus: భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5 టీ-20 ల సిరీస్ లో భాగంగా మొదటి టి-20 వర్షం కారణంగా రద్దయింది. ఇక రెండవ టి-20లో భారత జట్టుపై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో {నవంబర్ 2} ఆదివారం రోజున మూడవ టి-20 ప్రారంభమైంది. ఈ సిరీస్ నెగ్గాలంటే మూడవ టి-20 లో భారత జట్టు తప్పక నెగ్గాల్సి ఉంది. ఓడితే మాత్రం సిరీస్ ని గెలిచే అవకాశాలు లేవు. కేవలం సిరీస్ ని సమం చేసే అవకాశాలు మాత్రమే ఉంటాయి. ఈ మూడవ టి-20 హోబర్డ్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచింది. ఈ నేపథ్యంలో మొదట బౌలింగ్ ఎంచుకుంది భారత జట్టు. మొదటి రెండు టీ-20లలో టాస్ ఓడిన భారత జట్టు.. మొదట బ్యాటింగ్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో భారత జట్టు మొదట బౌలింగ్ చేయబోతోంది.
Also Read: Lara: గంభీర్ ఘోరమైన తప్పు చేస్తున్నాడు… టీమిండియాను దేవుడు కూడా కాపాడలేడు
ఆస్ట్రేలియా జట్టు – మిచెల్ మార్ష్ (C), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (WK), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, సీన్ అబాట్ (జోష్ హాజిల్‌వుడ్ స్థానంలో).
ఇండియా జట్టు – శుభ్‌మాన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివం దుబే, జితేష్ శర్మ (WK) (సంజు సామ్సన్ స్థానంలో), వాషింగ్టన్ సుందర్ (కుల్దీప్ యాదవ్ స్థానంలో), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ (హర్షిత్ రాణా స్థానంలో).
టీమిండియా టి20 స్పెషలిస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ కి ఈ మూడవ టి-20లో అవకాశం లభించింది. గత రెండు టి-20 లలో అతడిని పక్కన పెట్టారు. భారత్ తరఫున టి-20 ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా అర్షదీప్ సింగ్ ఉన్నాడు. అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన నాటినుండి అర్షదీప్ సింగ్ కి అవకాశాలు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు, క్రీడాభిమానుల నుండి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో హర్షిత్ రానా ని పక్కన పెట్టి ఈ మ్యాచ్ లో అర్షదీప్ సింగ్ కి అవకాశం కల్పించారు. రెండవ టి-20 లో హర్షిత్ రానా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఓవర్ కి 13.25 ఎకానమీతో పరుగులు ఇచ్చుకున్నాడు. ఏ మాత్రం పసలేని బౌలింగ్ వేస్తుండడంతో అతడిని ఈ మ్యాచ్ లో పక్కన పెట్టారు. అంతేకాకుండా మరో రెండు మార్పులు కూడా చేశారు. కుల్దీప్ యాదవ్, సంజు ని కూడా పక్కన పెట్టారు. వారి స్థానాలలో జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్ లను తుది జట్టులోకి తీసుకున్నారు.
రెండవ టి-20 లో ఘోర వైఫల్యం తర్వాత భారత జట్టు కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, గిల్ గాడిలో పడాలని.. తిలక్ వర్మ, దూబే, సంజు శాంసంన్ ల నుంచి భారీ స్కోర్ బాకీ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్ హేజల్ వుడ్ లేకపోవడం భారత్ కి కలిసి వచ్చే అంశం. ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో కెప్టెన్ మార్ష్, ట్రావీస్ హెడ్, ఇంగ్లిస్ మంచి ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్ లో బౌన్సీ పిచ్ లపై నిప్పులు చెరిగే బార్ట్ లెట్, ఎలిస్, స్టోయినిస్ లు భారత ప్రధాన బ్యాటర్ లను ఆదిలోనే కుప్పకూల్చాలని భావిస్తున్నారు.