E-Paper
Advertisement

Tomato Sauce: మీరు కొన్న కొన్న టమోటా కెచప్ మంచిదో కల్తీదో చూసుకోండి, మార్కెట్లో భారీగా కల్తీ సరుకు

Tomato Sauce: మీరు కొన్న కొన్న టమోటా కెచప్ మంచిదో కల్తీదో చూసుకోండి, మార్కెట్లో భారీగా కల్తీ సరుకు
Advertisement

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సుమారు 200 లీటర్ల కల్తీ టమోటా సాస్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సాస్ సాధారణంగా కనిపించినప్పటికీ, దానిలో ప్రమాదకరమైన పదార్థాలు కలిపినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా యాసిడ్ పదార్థాలు, నిషేధిత రంగులు ఉపయోగించినట్లు బయటపడింది. దీంతో ఆ కెచప్ తయారీ కేంద్రంపై దాడి చేశారు. అక్కడ ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలతో టమోటా సాస్ తయారు చేస్తున్నట్లు తేలింది. ఈ సాస్‌ను మార్కెట్లోకి పంపించే ముందు పట్టుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి.

కల్తీసాస్ తో సమస్యలు
ఇలాంటి కల్తీ సాస్ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కడుపు నొప్పులు, అల్సర్లు, వాంతులు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా ఇలాంటి పదార్థాలు తీసుకుంటే కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపే ప్రమాదం కూడా ఉంది. చిన్నపిల్లలు ఎక్కువగా టమోటా సాస్ తీసుకునే అవకాశం ఉండటంతో, వారికి ఇది మరింత ప్రమాదకరం.

Advertisement

మంచిదో కాదో ఇలా తెలుసుకోండి
మనం ఇంట్లోనే సులభంగా కొన్ని పరీక్షలు చేసి టమోటా సాస్ నాణ్యతను గుర్తించవచ్చు. మొదటి పరీక్షగా నీటి పరీక్ష చేయవచ్చు. ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ సాస్ వేసినప్పుడు అది నెమ్మదిగా కిందకు కూర్చుంటే అది స్వచ్ఛమైనదని భావించవచ్చు. కానీ వెంటనే నీటిలో కలిసిపోయి రంగు మారితే, అది కల్తీ అయి ఉండే అవకాశం ఉంది.

Also read: BedRoom Vastu: బెడ్‌రూమ్‌లో ఉండకూడని వస్తువులు ఇవన్నీ, అవి ఉంటే ఇంట్లో గొడవలే

Advertisement

టిష్యూ లేదా బ్లాటింగ్ పేపర్ పై ఒక చుక్క సాస్ ను టిష్యూపై వేస్తే అది సహజంగా ఒకచోటే ఉండాలి. కానీ రంగు బయటకు వ్యాపించి గాఢ ఎరుపు మరకలా కనిపిస్తే, అందులో కృత్రిమ రంగులు ఉన్నట్లు అర్థం. వాసన, రుచి ద్వారా పరీక్షించవచ్చు. సహజ టమోటా సాస్‌కు తేలికపాటి పుల్లటి వాసన ఉంటుంది. కానీ దుర్వాసన లేదా కెమికల్ వాసన వస్తే, అది నాణ్యత లేనిదని గుర్తించాలి. అలాగే రుచి కూడా సహజంగా లేకపోతే జాగ్రత్తగా ఉండాలి.

ఇంట్లోనే సాస్ తయారు చేసుకోవడం ఉత్తమ మార్గం. తాజా టమోటాలను మరిగించి, వాటిని మెత్తగా గ్రైండ్ చేసి, కొద్దిగా ఉప్పు, వెల్లుల్లి, బెల్లం కలిపి సాస్ తయారు చేయవచ్చు. ఇది ఆరోగ్యానికి మంచిది, ఎలాంటి హానికర పదార్థాలు ఉండవు. అలాగే బీట్‌రూట్, క్యారెట్ వంటి కూరగాయలను కూడా టమోటాతో కలిపి సాస్ తయారు చేయవచ్చు. ఇవి సహజ రంగు ఇస్తాయి. పోషకాలను కూడా పెంచుతాయి. ముఖ్యంగా పిల్లలకు ఇవి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు.

మార్కెట్లో సాస్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్యాకెట్‌పై FSSAI లైసెన్స్ నంబర్ ఉందా చూడాలి. చాలా ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉన్న సాస్‌ను కొనకుండా ఉండటం మంచిది.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×