E-Paper
Advertisement

అవమానాలకు అడ్డ బీఆర్ఎస్ పార్టీ: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

అవమానాలకు అడ్డ బీఆర్ఎస్ పార్టీ: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Advertisement

Kiran Kumar Reddy: స్వేచ్ఛ బ్యూరో: అవమానాలకు అడ్డా బీఆర్ ఎస్ అంటూ ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి 14 బీ ఫారాలు ఇచ్చిందని ఎంపీ గుర్తుచేశారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో 50 కౌన్సిలర్ స్థానాలు ఉంటే 20 జీవన్ రెడ్డి మనుషులకు ఇచ్చారని వెల్లడించారు. జగిత్యాల డీసీసీ అధ్యక్ష పదవి జీవన్ రెడ్డి వర్గానికి ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని దర్జాగా గౌరవించిందన్నారు.

కొల్లాపూర్‌లో..

బీఆర్ ఎస్ పార్టీ హిస్టరీని జీవన్ రెడ్డి గుర్తు చేసుకోవాలన్నారు. గతంలో గాదే ఇన్నయ్య, ఆలే నరేంద్ర పరిస్థితులను ఊహించుకోవాలన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో తుమ్మల నాగేశ్వరరావుపై కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుని కనీసం సభ్యత్వ నమోదు పుస్తకాలను కూడా తుమ్మలకు ఇవ్వలేదన్నారు. అదే విధంగా కొల్లాపూర్ లో జూపల్లిపై పోటీ చేసి గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని జూపల్లికి సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇవ్వకుండా అవమానించారన్నారు.

Advertisement

Also Read: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఒక వసూల్ రాజా : కేటీఆర్

కవితను లిక్కర్ కేసు..

2014లో ఆరు నెలలు కాకముందే డిప్యూటీ సీఎం రాజయ్యను బర్తరఫ్ చేశారన్నారు. కుటుంబ సభ్యుడు హరీష్ రావును మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించారన్నారు. కవితను లిక్కర్ కేసు బయటపడక ముందే లిక్కర్ రాణి ఇంట్లో కుటుంబ సభ్యులు అవమానించారన్నారు. బీసీ బిడ్డ ఈటెల రాజేందర్ ను అవమానకరంగా బర్తరఫ్ చేయలేదా…?అంటూ ఎంపీ చామల గుర్తు చేశారు. ఇవన్నీ తెలిసి కూడా జీవన్ రెడ్డి బీఆర్ ఎస్ లో ఎలా చేరుతున్నారో? అర్థం కావడం లేదని ఎంపీ చెప్పారు.

Advertisement

Also read: కౌశిక్ రెడ్డివి దొంగ దీక్షలు.. డంపింగ్ యార్డ్ వెనుక ఉన్న అసలు కథ ఇదే..?

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×