E-Paper
Advertisement

Birth Time Prediction: డెలివరీ ఎప్పుడో చెప్పేసే ఇండియన్ AI.. గర్భిణీలకు వరం, ఇక రిస్కులకు చెక్!

Birth Time Prediction: డెలివరీ ఎప్పుడో చెప్పేసే ఇండియన్ AI.. గర్భిణీలకు వరం, ఇక రిస్కులకు చెక్!
Advertisement

Birth Time Prediction: గర్భస్థ శిశువు ఎప్పుడు జన్మిస్తుందో తెలుసుకోవడానికి ఇకపై మనం విదేశీ లెక్కలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. మన శాస్త్రవేత్తలు భారతీయుల శరీరతత్వానికి సరిపోయేలా ఒక ప్రత్యేకమైన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మోడల్‌ను రూపొందించారు. ఇది ప్రసవ సమయాన్ని ఖచ్చితంగా చెప్పడమే కాకుండా.. నెలలు నిండకుండానే బిడ్డ పుట్టే ప్రమాదాన్ని ముందుగానే పసిగడుతుంది. తద్వారా తల్లీ బిడ్డల ప్రాణాలకు రక్షణ లభిస్తుంది.

ఇక మన ‘దేశీ’ లెక్కలే పక్కా!
సాధారణంగా గర్భం దాల్చిన తర్వాత శిశువు ఎప్పుడు పుడుతుందో లెక్కించడానికి డాక్టర్లు ‘హెడ్‌లాక్’ లేదా ‘ఇంటర్ గ్రోత్’ వంటి ఫార్ములాలను ఉపయోగిస్తారు. అయితే.. ఇవన్నీ ఇతర దేశాల మహిళల డేటా ఆధారంగా రూపొందించినవి. విదేశీ మహిళలతో పోలిస్తే.. ఇక్కడి మహిళల శారీరక నిర్మాణం, పోషకాహారం, లైఫ్ స్టైల్ భిన్నంగా ఉంటాయి. అందుకే విదేశీ పద్ధతుల ద్వారా వేసే అంచనాలు మన దగ్గర కొన్ని సార్లు తప్పుతుంటాయి.

Advertisement

ఈ లోపాన్ని సరిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం ‘గర్భ్-ఇని’ (Garbh-Ini) అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టింది. సుమారు 12 వేల మంది భారతీయ గర్భిణీల డేటాను విశ్లేషించి.. మన దేశానికి సరి పోయే సరి కొత్త ఏఐ మోడల్‌ను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు.

ఈ AI మోడల్ ఎందుకు ప్రత్యేకం?
ఖచ్చితమైన ప్రసవ తేదీ: గర్భం దాల్చిన ఎన్ని వారాలకు బిడ్డ జన్మిస్తుందో.. ఈ మోడల్ చాలా ఖచ్చితంగా చెబుతుంది.

Advertisement

అవగాహన లేని వారికి వరం: మన దేశంలో చాలా మంది మహిళలకు తమ చివరి నెలసరి తేదీ గుర్తుండదు. మరికొందరు గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో డాక్టర్ దగ్గరకు వెళ్లరు. అలాంటి వారికి ఈ ఏఐ టూల్ ద్వారా గర్భం వచ్చిన సరైన వయస్సును నిర్ధారించవచ్చు.

ముందస్తు ప్రసవాల గుర్తింపు: నెలలు నిండకుండానే బిడ్డ పుట్టే అవకాశం ఉంటే.. ఈ మోడల్ ముందుగానే హెచ్చరిస్తుంది. దీని వల్ల డాక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకునే సమయం దొరుకుతుంది.

ముందస్తు ప్రసవాలు:
అలీఘడ్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ చేసిన అధ్యయనం ప్రకారం.. ఇండియాలో శిశు మరణాలకు ప్రధాన కారణం ముందస్తు ప్రసవాలే.

దేశంలో చనిపోతున్న ప్రతి నలుగురు శిశువుల్లో.. ఒకరు ‘ప్రీ-టర్మ్’ కాంప్లికేషన్స్ వల్లే మరణిస్తున్నారు.

అధ్యయనం చేసిన శిశువుల్లో దాదాపు 29% మంది 34 వారాల కంటే ముందే జన్మిస్తున్నట్లు తేలింది.

టీబీ, నిమోనియా వంటి వ్యాధులపై ఉన్నంత అవగాహన ‘ప్రీ-టర్మ్ బర్త్’ గురించి ప్రజల్లో లేకపోవడం విచారకరం.

Also Read: హాట్ కాఫీ వర్సెస్ కోల్డ్ కాఫీ.. పోషకాలు దేనిలో ఎక్కువ?

భవిష్యత్తులో మార్పులు:
కేంద్ర ప్రభుత్వం ఈ ఏఐ టూల్‌ను త్వరలోనే దేశ వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకు రానుంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ రిపోర్టులను ఈ ఏఐ మోడల్‌తో అనుసంధానం చేయడం ద్వారా.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందుతాయి.

“భారతీయ డేటాతో తయారైన ఈ సాంకేతికత, మన ఆరోగ్య రంగంలో ఒక విప్లవాత్మక మార్పు. ఇది కేవలం అంకెలు చెప్పడమే కాదు.. వేలమంది పసిపిల్లల ప్రాణాలను కాపాడుతుంది.”

సాంకేతికత ఎంత పెరిగినా గర్భిణీలు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు తోడైన ఈ ‘దేశీ AI’ డాక్టర్లకు ఒక శక్తివంతమైన ఆయుధంగా మారి, సురక్షితమైన ప్రసవాలకు బాటలు వేస్తుంది.

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×