E-Paper
Advertisement

Excess Hunger: ఎంత తిన్నా తరచూ ఆకలి వేస్తుందా? అయితే ఈ సమస్యలో ఏదో ఒకటి మీకుంది

Excess Hunger: ఎంత తిన్నా తరచూ ఆకలి వేస్తుందా? అయితే ఈ సమస్యలో ఏదో ఒకటి మీకుంది
Advertisement

కొంతమందిలో భోజనం చేసిన అరగంటకే మళ్లీ ఆకలి వేస్తుంది. ఆహారం తిన్నా కూడా పొట్ట నిండిన భావన ఉండదు. ఏదో తినాలనే కోరిక పుడుతుంది. మొదట ఇది సాధారణ విషయంలా అనిపించవచ్చు. కానీ ఇది కొన్ని నెలల పాటూ కొనసాగితే నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని పాలీఫాజియా అనే ఆరోగ్య సమస్యకు సంకేతంగా చెబుతున్నారు. పాలీఫాజియా అంటే అధికంగా ఆకలి వేయడం. ఈ సమస్య ఉంటే ఎంత తిన్నా సరిపోనట్టు అనిపించదు. ఇది సాధారణ ఆకలితో పోల్చితే భిన్నంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన శక్తి అందకపోతే లేదా హార్మోన్ల పనితీరులో మార్పులు వస్తే ఈ సమస్య కనిపిస్తుంది. పెద్దలతో పాటు యువతలో కూడా ఈ లక్షణాలు ఎక్కువగా గమనిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు.

మధుమేహం, థైరాయిడ్ వల్ల
ఈ సమస్యకు ప్రధాన కారణాల్లో ఒకటి మధుమేహం. షుగర్ ఉన్నవారిలో గ్లూకోజ్ కణాల్లోకి సరిగా చేరదు. దాంతో శరీరం శక్తి లోపంలో ఉన్నట్టు భావించి మళ్లీ మళ్లీ ఆకలి సంకేతాలు పంపుతుంది. ఫలితంగా ఎంత తిన్నా తృప్తి కలగదు. అందుకే షుగర్ ఉన్నవారిలో ఈ సమస్య తరచూ కనిపిస్తుంది. ఇంకో కారణం థైరాయిడ్. థైరాయిడ్ హార్మోన్లు అధికంగా విడుదలైతే శరీర జీవక్రియ వేగంగా సాగుతుంది. ఆహారం త్వరగా జీర్ణమైపోతుంది. కొద్దిసేపటికే మళ్లీ తినాలనిపిస్తుంది. బరువు తగ్గడం, చెమటలు ఎక్కువగా రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలతో పాటు అధిక ఆకలి కనిపించవచ్చు. నిద్రలేమి కూడా ఈ సమస్యకు దారి తీస్తుంది. రోజూ సరైన నిద్ర లేకపోతే ఆకలిని నియంత్రించే హార్మోన్ల పనితీరు దెబ్బతింటుంది. అలాగే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయి పెరుగుతుంది. దీని ప్రభావంతో తినాలనే కోరిక ఎక్కువగా కలుగుతుంది. అందుకే ఒత్తిడిలో ఉన్నవారు తరచూ ఏదో తినాలనిపిస్తుందని చెబుతారు.

Advertisement

Also Read: Epilepsy in kids: ఫిట్స్ వ్యాధి ఉన్న పిల్లలకు ఎలాంటి ఆహారాలు తినపించకూడదు?

డీ హైడ్రేషన్ వల్ల కూడా
శరీరంలో నీటి లోపం కూడా ఆకలిలా అనిపించవచ్చు. శరీరానికి నీరు తక్కువగా అందుతున్నప్పుడు దాహం వేస్తున్నట్టు అనిపిస్తుంది. అది కూడా ఆకలిగా భావించే అవకాశం ఉంటుంది. అందుకే ఆకలి వేస్తే ముందుగా ఒక గ్లాస్ నీళ్లు తాగి చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమందిలో అలా చేస్తే తినాలనే కోరిక తగ్గిపోతుంది. పాలీఫాజియా ఉన్నవారిలో ఇతర లక్షణాలు కూడా కనిపించవచ్చు. బరువు పెరగడం లేదా తగ్గిపోవడం, అలసట, చిరాకు, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ కలిపి కనిపిస్తే తప్పకుండా వైద్యుడి సలహా తీసుకోవాలి.

Advertisement

ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఈ సమస్యను నియంత్రించుకోవాలంటే జీవనశైలిలో మార్పులు అవసరం. ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, సంపూర్ణ ధాన్యాలు చేర్చాలి. ప్రోటీన్ ఉన్న ఆహారం కడుపు నిండిన భావన అందిస్తుంది. చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, మైదా ఆహారం, ఫాస్ట్ ఫుడ్ తగ్గించడం మంచిది. రోజుకు కనీసం ఏడు గంటల నిద్ర అవసరం. నడక, యోగా, ధ్యానం వంటి అలవాట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. దీని వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. అధిక ఆకలి చాలాకాలంగా కొనసాగితే ఇంటి చిట్కాలతో సరిపెట్టుకోవడం సరైన మార్గం కాదు. షుగర్ పరీక్షలు, థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×