E-Paper
Advertisement

Epilepsy in kids: ఫిట్స్ వ్యాధి ఉన్న పిల్లలకు ఎలాంటి ఆహారాలు తినపించకూడదు?

Epilepsy in kids: ఫిట్స్ వ్యాధి ఉన్న పిల్లలకు ఎలాంటి ఆహారాలు తినపించకూడదు?

ఫిట్స్ వ్యాధి అంటే మూర్ఛ లేదా ఎపిలెప్సీ సమస్య. ఎంతో మంది పిల్లలు ఈ మూర్చ వ్యాధితో బాధపడుతున్నారు. దీని వల్ల తల్లిదండ్రులు ఎంతో ఆందోళనకు గురవుతారు. మందులతో పాటు ఆహార అలవాట్లు కూడా ఫిట్స్ ను నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని రకాల ఆహారాలు పిల్లల్లో మూర్ఛ తీవ్రతను పెంచే అవకాశం ఉంటుంది. అందుకే ఫిట్స్ ఉన్న పిల్లలకు ఏం తినిపించాలి? అనే విషయంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సరైన ఆహార నియమాలు పాటిస్తే మందులు కూడ చక్కగా పనిచేస్తాయి.

ఎలాంటి ఆహారాలు పెట్టకూడదు?
మూర్ఛ వ్యాధి ఉన్న పిల్లలకు కొన్ని రకాల ఆహారాలు పెట్టకూడదు. మొదటిగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను ఇవ్వకూడదు. చాక్లెట్లు, కేకులు, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్, ప్యాకెట్ జ్యూస్ వంటి వాటిలో అధికంగా చక్కెర ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా మార్చుతాయి. ఈ మార్పులు మెదడు పనితీరుపై ప్రభావం చూపి ఫిట్స్ వచ్చే అవకాశాన్ని పెంచవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే కృత్రిమ రంగులు, ఫ్లేవర్లు కలిగిన మిఠాయిలు కూడా పిల్లల నరాల వ్యవస్థను చెడుగా ప్రభావితం చేస్తుంది. అందుకే వీలైనంత వరకు సహజ ఆహారాలకే ప్రాధాన్యం ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు.

కెఫీన్ వద్దు
కెఫైన్ కలిగిన పదార్థాలు కూడా ఫిట్స్ ఉన్న పిల్లలకు ఏమాత్రం మంచివి కావు. టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, చాక్లెట్ పానీయాలు వంటి వాటిలో కెఫైన్ ఉంటుంది. ఇది మెదడును ఉత్తేజితం చేసి నిద్రలేమికి కారణం అవుతుంది. నిద్రలేమి ఫిట్స్ వచ్చే ప్రధాన కారణాలలో ఒకటిగా వైద్యులు చెబుతున్నారు. పిల్లలకు రాత్రి నిద్ర సరిపడా లేకపోతే మూర్ఛ వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకే కెఫైన్ కలిగిన ఏ ఆహారం లేదా పానీయం పిల్లలకు ఇవ్వకూడదు.

ఇవి పెట్టకండి
అధిక ఉప్పు కలిగిన, ప్రాసెస్డ్ ఆహారాలు కూడా ఫిట్స్ ఉన్న పిల్లలకు మంచివి కావు. చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్యాకెట్ స్నాక్స్ వంటి వాటిలో ఉప్పు, రసాయన పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఈ అసమతుల్యత మెదడు సంకేతాలపై ప్రభావం చూపి ఫిట్స్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే ఈ ఆహారాలు జీర్ణక్రియపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి.

కొన్ని పిల్లలకు ఆహార అలర్జీలు లేదా కొన్ని ప్రత్యేక ఆహారాలు కూడా ఫిట్స్ పెరిగిపోతుంది. ఉదాహరణకు మోనోసోడియం గ్లూటమేట్ కలిగిన ఆహారాలు, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు, కృత్రిమ స్వీట్‌నర్స్ ఉన్న వస్తువులు కొందరికి సమస్యలు కలిగించవచ్చు. ప్యాకెట్ ఫుడ్స్ లేబుల్ చదివి ఇవి ఉన్నాయా లేదా చూసుకోవడం అవసరం. అలాగే అధికంగా నూనెతో వేయించిన ఆహారాలు జీర్ణం కావడానికి కష్టం అవుతాయి. దీని వల్ల శరీరంపై ఒత్తిడి పెరిగి మూర్ఛకు దారితీసే పరిస్థితులు ఏర్పడవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మొత్తంగా ఫిట్స్ ఉన్న పిల్లల విషయంలో ఆహారం ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేయాలి. చక్కెర, కెఫైన్, అధిక ఉప్పు, రసాయనాలతో కూడిన ప్రాసెస్డ్ ఆహారాలను వీలైనంత వరకు దూరంగా ఉంచడం మంచిది. పిల్లలో ఫిట్స్ ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో వస్తోందో గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా న్యూరాలజిస్ట్ లేదా డైటీషియన్ సలహాతో ఆహార నియమాలు పాటించాలి.

Related News

ఏసీలో పడుకుంటే తలనొప్పి వస్తోందా? నిపుణులు చెబుతున్న అసలు కారణాలివే!

టీనేజర్ల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఎనర్జీ డ్రింక్స్.. తస్మాత్ జాగ్రత్త!

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

Big Stories

×