E-Paper
Advertisement

Brushing Mistakes: బ్రష్ చేస్తున్నారా.. లేక ఎనామెల్‌ను పోగొట్టుకుంటున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి !

Brushing Mistakes: బ్రష్ చేస్తున్నారా.. లేక ఎనామెల్‌ను పోగొట్టుకుంటున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి !
Advertisement

Brushing Mistakes: పంటి ఆరోగ్యం అనేది మన మొత్తం శరీర ఆరోగ్యానికి పునాది వంటిది. చాలా మంది రోజుకు రెండు సార్లు బ్రష్ చేసినప్పటికీ.. పంటి సమస్యలతో బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం బ్రష్ చేసే విధానంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు. డెంటిస్టులు హెచ్చరిస్తున్న కొన్ని సాధారణ బ్రష్షింగ్ తప్పులు, వాటి పరిష్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. అతిగా బ్రష్ చేయడం:
చాలా మంది గట్టిగా బ్రష్ చేస్తే పళ్ళు తెల్లగా మెరుస్తాయని భావిస్తారు. కానీ.. ఇది చాలా పెద్ద తప్పు. పళ్ళపై ఉండే రక్షణ కవచం ‘ఎనామెల్’ చాలా సున్నితమైనది. గట్టిగా రుద్దడం వల్ల ఈ ఎనామెల్ అరిగిపోయి, పళ్ళు సెన్సిటివిటీకి గురవుతాయి. చల్లని లేదా వేడి పదార్థాలు తిన్నప్పుడు పళ్ళు లాగడం దీని వల్లే జరుగుతుంది.

Advertisement

2. తప్పుడు బ్రష్ ఎంపిక:
మార్కెట్లో రకరకాల బ్రష్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే.. చిగుళ్ళ ఆరోగ్యం కోసం ఎప్పుడూ ‘సాఫ్ట్ బ్రిజిల్స్’ ఉన్న బ్రష్‌నే వాడాలని డెంటిస్టులు సూచిస్తారు. హార్డ్ లేదా మీడియం బ్రిజిల్స్ చిగుళ్ళను గాయపరిచి, చిగుళ్ళు వెనక్కి వెళ్ళిపోయేలా చేస్తాయి.

3. బ్రష్ చేసే సమయం, విధానం:
కనీసం 2 నిమిషాల పాటు బ్రష్ చేయడం అవసరం. చాలా మంది 30 సెకన్లలోనే ముగించేస్తుంటారు. దీని వల్ల పళ్ళ సందుల్లో ఉన్న ఆహార పదార్థాలు సరిగ్గా శుభ్రపడవు. అలాగే, బ్రష్‌ను పళ్ళపై అడ్డంగా కాకుండా, చిగుళ్ళ నుంచి పంటి వరకు వృత్తాకారంలో లేదా పైకి కిందకు సున్నితంగా కదిలించాలి.

Advertisement

4. బ్రష్ మార్చకపోవడం:
ఒకే బ్రష్‌ను ఆరు నెలలు, ఏడాది పాటు వాడటం ఆరోగ్యానికి హానికరం. బ్రష్ బ్రిజిల్స్ వంగిపోయినా లేదా అరిగిపోయినా అది పళ్ళను శుభ్రం చేయలేదు. ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి తప్పనిసరిగా బ్రష్ మార్చాలి. అలాగే ఏదైనా జబ్బు (జలుబు, జ్వరం) పడి తగ్గిన తర్వాత కూడా బ్రష్ మార్చడం మంచిది.

5. నాలుకను శుభ్రం చేయకపోవడం:
నోటి దుర్వాసనకు ప్రధాన కారణం నాలుకపై పేరుకుపోయే బ్యాక్టీరియా. పళ్ళు తోముకున్న తర్వాత టంగ్ క్లీనర్ లేదా బ్రష్‌తో నాలుకను శుభ్రం చేయడం మర్చిపోకూడదు.

6. భోజనం చేసిన వెంటనే బ్రష్ చేయడం:
మనం ఆహారం తిన్నప్పుడు.. ముఖ్యంగా పుల్లటి పదార్థాలు లేదా తీపి పదార్థాలు తిన్నప్పుడు నోటిలో యాసిడ్స్ విడుదలవుతాయి. ఆ సమయంలో ఎనామెల్ కొంచెం మెత్తబడుతుంది. తిన్న వెంటనే బ్రష్ చేస్తే ఎనామెల్ త్వరగా అరిగిపోతుంది. కాబట్టి.. భోజనం చేసిన తర్వాత కనీసం 30 నుంచి 60 నిమిషాల ఆగాలి.

డెంటిస్టుల ముఖ్య సూచనలు:
రోజుకు రెండుసార్లు (ఉదయం, పడుకునే ముందు) తప్పనిసరిగా బ్రష్ చేయాలి.

ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌ను వాడటం వల్ల పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి.

పళ్ళ సందుల్లో పేరుకున్న మురికిని తొలగించడానికి ‘ఫ్లాసింగ్’ అలవాటు చేసుకోవాలి.

ఏడాదికి రెండుసార్లు డెంటిస్ట్‌ను సంప్రదించి రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి.

మీరు బ్రష్ చేసే విధానంలో ఈ చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఖరీదైన డెంటల్ ట్రీట్‌మెంట్స్ అవసరం లేకుండానే మీ చిరునవ్వును కాపాడుకోవచ్చు.

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×