E-Paper
Advertisement

Psychological-Social thriller OTT: క్రిమినల్స్ ను చంపే డెలివరీ బాయ్… అదిరిపోయే బెంగాలీ సిరీస్

Psychological-Social thriller OTT: క్రిమినల్స్ ను చంపే డెలివరీ బాయ్… అదిరిపోయే బెంగాలీ సిరీస్
Advertisement

Psychological-Social thriller OTT : తెలుగులో వచ్చిన ‘ఆజాద్’, ‘ఠాగూర్’ లాంటి సినిమాలలో సమాజానికి పట్టిన చీడ పురుగులను లేపేస్తుంటారు. ఇక ప్రజల గుండెల్లో వీళ్ళు సూపర్ హీరోలుగా నిలిచిపోతారు. సేమ్ ఇలాంటి కథతోనే ఓ బెంగాలీ సిరీస్ ఓటీటీలోకి వచ్చింది. ఒక డెలివరీ బాయ్ క్రిమినల్స్ ని లేపేస్తుంటాడు. దీంతో అతను సూపర్ హీరోగా పాపులర్ అవుతాడు. ఈ బెంగాలీ సిరీస్ ను మీరు కూడా చూడాలనుకుంటే ఓ లుక్ వేయండి. ఇది ఏ ఓటీటీలో ఉంది, దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ బెంగాలీ సైకలాజికల్ సోషల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘AKA ‘. ఇది 2025 సెప్టెంబర్ 4నుంచి Hoichoi ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ బెంగాలీ నటుడు అఫ్రాన్ నిషో, మాసుమ రెహమాన్ నబిలా ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. మొత్తం 7 ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్ ను విక్కీ జహీద్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సిరీస్‌ను Hoichoi ప్లాట్‌ఫామ్‌లో చూడవచ్చు.

Advertisement

Read Also :  మెట్రో స్టేషన్ లో మతిపోగొట్టే డెడ్లీ డెత్ గేమ్స్… మెట్రో అంటేనే గుండె జారిపోయేలా చేసే మూవీ

స్టోరీ ఏమిటంటే

ఆజాద్ అనే వ్యక్తి ఒక కొరియర్ కంపెనీలో డెలివరీ బాయ్ గా పనిచేస్తుంటాడు. అతను చాలా నెమ్మదస్తుడు. ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతుంటాడు. ఒక రోజు ఆజాద్ అనుకోకుండా ఒక ప్రమాదకరమైన నేరస్థుడిని కొట్టి చంపేస్తాడు. అయితే చనిపోయిన వ్యక్తి సమాజానికి చెడు చేసేవాడు కావడంతో, ప్రజలు ఆజాద్‌ను ఒక హీరోగా చూడటం మొదలుపెడతారు. 1990లలో నేరస్థులను వేటాడే “AKA” అనే ఒక వ్యక్తి ఉండేవాడని ప్రజల నమ్మకం. ఆజాద్ చేసిన పని చూసి, ఆ పాత “AKA” మళ్ళీ తిరిగి వచ్చాడని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తాయి. ఇక సోషల్ మీడియా నుండి వస్తున్న ప్రశంసలు, తన గతం కలిగించిన గాయాలు ఆజాద్‌ను ప్రేరేపిస్తాయి. అతను చట్టం శిక్షించలేని నేరస్థులను స్వయంగా వెతికి పట్టుకుని శిక్షించడం మొదలెడతాడు.

Advertisement

ఒకవైపు సామాన్య ప్రజలు ఆజాద్‌ను ఆరాధిస్తుంటే, మరోవైపు పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సంఘటనలు ఏమిటి ? Aka ఇలా ఎంత మందిని చంపుతాడు ? పోలీసులు అతన్ని పట్టుకుంటారా ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి. ఇక దర్శకుడు విక్కీ జహీద్ ఈ కథను డార్క్ థీమ్‌తో రూపొందించారు. అఫ్రాన్ నిషో నటన ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇది కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఒక మనిషిలోని మానసిక కోణాలను కూడా కళ్ళకు కట్టినట్లు చూపించింది.

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×