E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్ అరెస్టును ఆపేసిన అప్పు

Brahmamudi Serial Today January 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్ అరెస్టును ఆపేసిన అప్పు
Advertisement

Brahmamudi serial today Episode:

కావ్య డెలివరీ అయిన హాస్పిటల్‌ లోనే మినిస్టర్‌ దర్మేంద్ర భార్య కూడా డెలివరీ అవుతుంది. అయితే ఆమె బిడ్డ కదలడం లేదని ఇంక్యుబేటర్‌లో పెడతారు. తర్వాత డాక్టర్ మెల్లగా డల్లుగా ఆఫరేషన్‌ థియేటర్‌ నుంచి బయటకు వస్తాడు. ఉత్సాహంగా ఉన్న దర్మేంద్ర డాక్టర్‌ను తనకు ఎవరు పుట్టారని అడుగుతాడు. డాక్టర్‌ ఆడపిల్ల పుట్టింది సార్‌ అని చెప్పగానే.. ఆడపిల్ల అని అంత డల్లుగా చెప్తావేంటయ్యా..పాప అంటే ఇంటికి మహాలక్ష్మీ పుట్టింది.. నాకు కంగ్రాట్స్‌ చెప్పవయ్యా…? చెప్పు అనగానే..  డాక్టర్‌ ఆడపిల్ల పుట్టింది కానీ అనగానే.. ఏంటి చక్రవర్తి ఇలాంటి గుడ్‌ న్యూస్‌ చెప్పే పద్దతి ఇదా..? ఏమైంది నీకు.. నేను వెంటనే పాపను చూడాలి మా ఆవిడతో మాట్లాడాలి పదా అంటూ ధర్మేంద్ర లోపలికి వెళ్లబోతుంటే.. డాక్టర్‌ ఆపేసి సార్‌ ఒక్క నిమిషం సార్‌ అనగానే.. దర్మేంద్ర ఏంటి చక్రవర్తి ఎందుకు అదోలా ఉన్నావు.. నన్నెందుకు కంగారుపెడుతున్నావు అని అడగ్గానే..

సార్‌ నేను చెప్పే విషయం కాస్త జాగ్రత్తగా ధైర్యం తెచ్చుకుని వినండి.. సార్‌.. పాప కండీషన్‌ బాగాలేదు సార్‌.. అని డాక్టర్‌ చెప్పగానే.. మేడం సమస్య లేకుండా ప్రసవించినా..? పుట్టిన పాపకు మాత్రం ఒక ప్రాబ్లమ్‌ వచ్చింది అని చెప్పగానే.. ధర్మేంద్ర బాధగా చక్రవర్తి ప్రమాదం ఏమీ లేదు కదా..? అని అడగ్గానే.. చాలా ప్రమాదం సార్‌.. ఈ కండీషన్‌లో బేబీకి గుండె ఎడమభాగం సరిగ్గా పని చేయదు. దాని వల్ల ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఆపరేషన్‌ చేయాలి అని చెప్పగానే.. దానికి ఎందుకు చక్రవర్తి అంత ఆలోచిస్తున్నావు.. వెంటనే చేసేయ్‌ ఎవరో స్పెషలిస్టు ఉన్నారని చెప్తున్నావు కదా..? అని దర్మేంద్ర అడగ్గానే.. సార్‌ ఆ సర్జరీ ఇప్పుడు చేయకూడదు. బేబీ అండర్‌ వెయిట్ ఉంది. ఇంక్యూబేటర్‌లో పెట్టాం తను పూర్తిగా డెవలప్ అయిన తర్వాతే ఆపరేషన్‌ చేయగలం.. అది ఎప్పుడు అనేది స్పష్టంగా చెప్పలేం అంటాడు

Advertisement

దీంతో ధర్మేంద్ర ఏం మాట్లాడుతున్నావు చక్రవర్తి బేబీ కడుపులో ఉన్నప్పుడు చాలా హెల్దీగా ఉందని చెప్పావు కదా..? అంటాడు. అప్పుడు అంత వరకే తెలుస్తుంది. డెలివరీ అయ్యాక పాప చాలా సేపు కదలలేదు.. అప్పుడు టెస్టులు చేస్తే తెలిసింది ప్రాబ్లమ్‌ ఏంటా అనేది.. అని డాక్టర్‌ చెప్పగానే.. అంటే ఓ సంవత్సరం పోయాక పాపకు సర్జరీ చేయోచ్చా..? అని దర్మేంద్ర అడగ్గానే.. చేయోచ్చు కానీ పాప చనిపోయే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది సార్‌. అంటే సర్జరీని తట్టుకునే శక్తి పాపకు ఉండాలి కదా..? అని చెప్పగానే.. ధర్మేంద్ర బాధపడుతుంటాడు.. దీంతో డాక్టర్‌ ధర్మేంద్రను ఓదారుస్తాడు. పక్క నుంచి రుద్రాణి అంతా వింటుంది.

మరోవైపు కావ్యను ఐసీయూలోకి వెళ్లి అందరూ కలిసి హ్యాపీగా ఫీలవుతుంటారు. ఇంతలో కానిస్టేబుల్స్‌ వెళ్లి రాజ్‌ను పోలీస్‌ స్టేషన్‌కు రమ్మని అడుగుతారు. రాజ్‌ కూడా వస్తాను పదండి అంటూ వెళ్లబోతుంటే అప్పుడే కళ్యాణ్‌, అప్పు అవస్తారు. మా బావ ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు కానిస్టేబుల్స్‌ అని చెప్తుంది. దీంతో కానిస్టేబుల్‌ మేడం ఇప్పటిదాకా మీ వల్లే ఇతనికి ఈ టైం ఇవ్వాల్సి వచ్చింది. మళ్లీ మీరే అడ్డు పడటం అని అడగ్గానే.. అడ్డు పడుతుంది నేను కాదు కోర్టు అంటూ రాజ్‌ నిర్దోషి అంటూ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్‌ చూపిస్తుంది. మా బావ మీద ఆరోపణ చేసిన వాడే కుట్రపూరితంగా రాజ్‌ను ఇరికించాను అని మన ఎస్సై గారి ముందు ఒప్పుకున్నాడు. శాండీ గాడి సాక్ష్యం బట్టే జడ్జి గారిని కలవడం జరిగింది. జడ్జి గారు మా బావను నిర్దోషి అని నమ్మి ఈ అరెస్ట్‌ను ఆపమని ఆర్డర్‌ ఇచ్చారు. మీరే చూశారు కదా..? మన ఎస్సై గారే సాక్షి. కావాలంటే ఫోన్‌ చేసి కనుక్కోండి. ఇక మీరు వెళ్తారా..? అనగానే..

Advertisement

సారీ మేడం అంటూ కానిస్టేబుల్స్‌ వెళ్లిపోతారు. ఇక కావ్య ఏడుస్తూ.. అప్పు నీకెలా థాంక్స్‌ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు.. అని చెప్పగానే..  అప్పు అప్పుడే నేను డ్యూటీ చేశాను. ఇప్పుడు కుటుంబంలో ఒకదానిలా చేశాను అని చెప్తుంది అప్పు. దీంతో అందరూ అప్పుకు సారీ చెప్తారు. అందరూ హ్యాపీగా ఉంటారు. రాహుల్‌, రేఖ మాత్రం ఇరిటేటింగ్‌ గా ఫీలవుతారు. మరోవైపు మినిస్టర్‌ ధర్మేంద్ర దగ్గరకు రుద్రాణి వెళ్లుంది. నీ భార్య ప్రాణాలు కాపాడుకోవాలి అంటే ఇంక్యుబేటర్‌లో ఉన్న బిడ్డను మార్చమని చెప్తుంది. ధర్మేంద్ర అవసరం లేదని వెళ్లిపోతాడు. మరోవైపు కావ్య, తన పక్కన కూర్చున్న రాజ్‌ తో పాత విషయాలు గుర్తు చేసుకుని బాధపడుతుంది. కావ్యను రాజ్‌ ఓదారుస్తుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×