E-Paper
Advertisement

BabyCorn Manchurian: బేబీ కార్న్ మంచూరియన్ .. ఇంట్లో సులువుగా రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదిగో

BabyCorn Manchurian: బేబీ కార్న్ మంచూరియన్ .. ఇంట్లో సులువుగా రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదిగో
Advertisement

బేబీ కార్న్ మంచూరియన్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన స్టార్టర్. బయట హోటళ్లలో తినే రుచికి ఏమాత్రం తగ్గకుండా, ఇంట్లోనే శుభ్రంగా, తక్కువ నూనెతో తయారు చేసుకోవచ్చు. సాయంత్రం స్నాక్‌గా ఈ బేబీ కార్న్ మంచూరియన్ చాలా బాగుంటుంది. దీన్ని ఎలా వండాలో తెలుసుకోండి.

బేబీకార్న్ మంచూరియన్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బేబీ కార్న్ – 250 గ్రాములు
కార్న్ ఫ్లవర్ – అర కప్పు
బియ్యం పిండి – అర కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
కారం పొడి – అర టీస్పూన్
నూనె – వేయించడానికి అవసరమైనంత

Advertisement

సాస్ తయారీకి
వెల్లుల్లి (సన్నగా తరిగినది) – 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ – 1 (చిన్న ముక్కలుగా కట్ చేసినది)
సోయా సాస్ – 2 టేబుల్ స్పూన్లు
టొమాటో సాస్ – 2 టేబుల్ స్పూన్లు
చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్ (ఐచ్చికం)
పచ్చిమిర్చి – 1 (చిన్న ముక్కలు)
స్ప్రింగ్ ఆనియన్ / కొత్తిమీర తరుగు – గుప్పెడు

బేబీకార్న్ మంచూరియన్ రెసిపీ
1. ముందుగా బేబీ కార్న్ ను శుభ్రంగా కడిగి పొడవుగా లేదా రెండు భాగాలుగా కట్ చేయాలి. తర్వాత ఒక గిన్నెలో నీరు మరిగించి అందులో బేబీ కార్న్ ముక్కలు వేసి 5 నిమిషాలు ఉడికించాలి.
2. ఇలా చేస్తే బేబీ కార్న్ మృదువుగా మారి వేయించినప్పుడు లోపల బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత నీరు వడకట్టి పక్కన పెట్టాలి.
3. ఒక పెద్ద గిన్నెలో కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
4. ఇప్పుడు కొద్దిగా కొద్దిగా నీరు పోసుకుంటూ ఉండలు లేకుండా పిండిని తయారు చేసుకోవాలి.
5. ఉడికించిన బేబీ కార్న్ ముక్కలను ఈ పిండిలో వేసి అన్ని ముక్కలకూ పిండి బాగా పట్టేలా కలపాలి.
6. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక అందులో బేబీ కార్న్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి.
7. గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించిన తర్వాత పేపర్ టవల్ మీద తీసి పెట్టాలి. ఇలా చేస్తే అదనపు నూనె తొలగిపోతుంది.
8. ఇప్పుడు మంచూరియన్ సాస్ తయారు చేయాలి. మరో కళాయి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు నూనె వేడి చేయాలి.
9. నూనె వేడయ్యాక వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి వేసి వాసన వచ్చే వరకు వేయించాలి.
10. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం మృదువుగా మారే వరకు కలపాలి.
11. ఇప్పుడు సోయా సాస్, టొమాటో సాస్, చిల్లీ సాస్ వేసి బాగా కలపాలి. అవసరమైతే చాలా కొద్దిగా నీరు పోసి సాస్ చిక్కగా ఉండేలా చేయాలి. రుచికి తగినంత ఉప్పు సర్దుకోవాలి.
12. ఇప్పుడు వేయించి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కలను ఈ సాస్ లో వేసి రెండు నిమిషాలు బాగా కలపాలి.
13. అన్ని ముక్కలకు ఈ సాస్ బాగా పట్టాక స్టవ్ ఆఫ్ చేయాలి. పైన స్ప్రింగ్ ఆనియన్ లేదా కొత్తిమీర చల్లాలి.

Advertisement

ఈ బేబీ కార్న్ మంచూరియన్ ను వేడి వేడిగానే తింటే అదిరిపోతుంది.ఇది క్రిస్పీగా కావాలంటే బేబీ కార్న్ ముక్కలు రెండుసార్లు వేయించవచ్చు. గ్రేవీలా కావాలంటే సాస్ లో కొద్దిగా కార్న్ ఫ్లోర్ నీరు కలపవచ్చు.

Related News

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

Big Stories

Advertisement
×