E-Paper
Advertisement

Megastar Chiranjeevi: విజయ్ జననాయగన్ వల్ల సమస్యల్లో చిక్కుకున్న మెగాస్టార్ తదుపరి సినిమా..!

Megastar Chiranjeevi: విజయ్ జననాయగన్ వల్ల సమస్యల్లో చిక్కుకున్న మెగాస్టార్ తదుపరి సినిమా..!
Advertisement

Megastar Chiranjeevi: మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా తరువాత ప్రస్తుతం చిరంజీవి తదుపరి సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెగ వైరల్ అవుతుంది. వాల్తేరు వీరయ్య వంటి భారీ హిట్ తర్వాత, చిరంజీవి మరోసారి దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ)తో కలిసి సినిమా చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రకటన కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రారంభం ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

మొదట ప్లాన్ ప్రకారం..చిరంజీవి..బాబీ సినిమా మన శంకర వర ప్రసాద్ గారు షూటింగ్ పూర్తయిన వెంటనే మొదలవ్వాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ ప్లాన్ మారింది. దీనికి కారణం KVN ప్రొడక్షన్స్ ఎదుర్కొంటున్న ఆర్థిక, న్యాయపరమైన సమస్యలే. ముఖ్యంగా జన నాయకన్ సినిమా విషయంలో సీబీఎఫ్‌సీతో నడుస్తున్న న్యాయపోరాటం వల్ల నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

అప్పటివరకు చిరంజీవి సినిమా కష్టమే..!

Advertisement

ఈ సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు చిరంజీవి సినిమా ప్రారంభించలేకపోతున్నారని టాక్. ప్రస్తుతం KVN ప్రొడక్షన్స్ తమ దృష్టంతా జన నాయకన్ సినిమా సమస్యలపైనే పెట్టిందట. కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందుకే చిరంజీవి సినిమా ఆలస్యం కావచ్చని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

రెండు మార్గాలు మాత్రమే..!

ఇలాంటి పరిస్థితిలో నిర్మాతల ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, జన నాయకన్ సమస్యలు పూర్తిగా తీరే వరకు వేచి చూడడం. రెండోది, లైన్ ప్రొడ్యూసర్‌ను తీసుకుని సహనిర్మాణం ద్వారా చిరంజీవి సినిమా షూటింగ్‌ను త్వరగా మొదలుపెట్టడం. ప్రస్తుతం మెగాస్టార్ క్రేజ్ బాగా ఉన్నందున, ఆలస్యం చేయకుండా షూటింగ్ మొదలుపెడితే మంచిదనే అభిప్రాయం కూడా ఉంది.

Advertisement

ఇంకా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రియమణి చిరంజీవి భార్య పాత్రలో కనిపించవచ్చని టాక్. అలాగే కృతి శెట్టి చిరంజీవి కుమార్తె పాత్ర కోసం చర్చల్లో ఉన్నట్లు సమాచారం.
ఇవన్నీ ఇప్పటికి ఊహాగానాలే. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే అసలు నిజం బయటపడే అవకాశం ఉంది. అప్పటివరకు చిరంజీవి అభిమానులు కాస్త ఓపికగా ఎదురు చూడాల్సిందే.

ALSO READ: Peddi special song: పెద్ది స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్.. వర్కౌట్ అయ్యేనా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×