E-Paper
Advertisement

తిన్నది అరగట్లేదా? రోజూ మీరు చేసే ఈ 6 తప్పులే అసలు కారణం

తిన్నది అరగట్లేదా? రోజూ మీరు చేసే ఈ 6 తప్పులే అసలు కారణం
Advertisement

Bad Digestion Habits: ఈ రోజుల్లో.. వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న కామన్ ప్రాబ్లం.. జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం. “ఏం తిన్నా అరగట్లేదు బాబోయ్, కడుపు ఉబ్బరంగా ఉంది, గ్యాస్ ఫామ్ అయిపోతుంది” అని వాపోయే వాళ్ల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. అయితే..దీనికి కేవలం మనం తినే ఫుడ్ మాత్రమే కారణం కాదు. మన డైలీ లైఫ్ స్టైల్,మనం తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు కూడా మన పొట్టను పాడుచేస్తాయి. మన జీర్ణ వ్యవస్థను నెమ్మదిగా లోపల నుంచి నాశనం చేస్తున్న ఆ 6 రోజువారీ అలవాట్లు ఏంటో, వాటిని ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణవ్యవస్థను నాశనం చేసే ఆ 6 రోజువారీ అలవాట్లు:

Advertisement

1.ఫుడ్ సరిగ్గా నమలకుండా మింగేయడం:
ఈ బిజీ లైఫ్ లో ప్రశాంతంగా కూర్చుని తినే టైమ్ ఎవరికీ ఉండట్లేదు. ప్లేట్ ముందు పెట్టుకుని గబగబా నమిలీ నమలకుండా మింగేస్తుంటారు. జీర్ణ క్రియ అనేది మన నోటి నుంచే ప్రారంభమవుతుంది. నోట్లో ఆహారాన్ని బాగా నమిలినప్పుడే లాలాజలం దాంతో కలిసి జీర్ణ ప్రక్రియ సులువవుతుంది. అలా కాకుండా.. డైరెక్ట్ గా మింగేస్తే, జీర్ణకోశంపై విపరీతమైన భారం పడి అజీర్తి, గ్యాస్ సమస్యలు మొదలవుతాయి.

2.తిన్న వెంటనే లీటర్ల కొద్దీ నీళ్లు తాగడం:
చాలా మందికి తింటున్నప్పుడు లేదా తిన్న వెంటనే గటగటా నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. ఆహారం అరగడానికి మన పొట్టలో కొన్ని రకాల జీర్ణ రసాలు, యాసిడ్లు విడుదలవుతాయి. తిన్న వెంటనే ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఆ యాసిడ్లు పలచబడిపోతాయి. దీని వల్ల ఆహారం సరిగ్గా అరగకుండా పొట్టలో కుళ్ళిపోయి గ్యాస్,ఎసిడిటీకి దారి తీస్తుంది.

Advertisement

3. నైట్ లేట్ గా డిన్నర్ చేయడం:
రాత్రి 10 లేదా 11 గంటలకి హెవీగా డిన్నర్ చేసి, వెంటనే బెడ్ ఎక్కి నిద్రపోయే అలవాటు ఉందా ? అయితే మీ పొట్ట డేంజర్ జోన్ లో ఉన్నట్లే. మనం పడుకున్నప్పుడు జీర్ణక్రియ రేటు చాలా మందగిస్తుంది. లేట్ నైట్ ఫుడ్ తినడం వల్ల అది అరగడానికి చాలా టైమ్ పడుతుంది. దీని వల్ల ఉదయానికి కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురవుతాయి.

4.తిన్న వెంటనే పడుకోవడం:
మధ్యాహ్నం అయినా.. రాత్రి అయినా తిన్న వెంటనే కొందరు బెడ్ పై వాలిపోతారు.మరి కొందరు వాకింగ్ లేదా వర్కవుట్స్ స్టార్ట్ చేస్తారు. ఈ రెండు అలవాట్లు తప్పే. తిన్న వెంటనే.. పడుకుంటే పొట్టలోని యాసిడ్లు పైకి వచ్చి గుండెల్లో మంట వస్తుంది. అలాగే.. కఠినమైన పనులు చేయడం వల్ల రక్త ప్రసరణ జీర్ణకోశానికి కాకుండా కండరాలకు మళ్లుతుంది. దీంతో జీర్ణక్రియ ఆగిపోతుంది.

5.స్ట్రెస్ (మానసిక ఒత్తిడి) లో ఫుడ్ తినడం:
మన మెదడుకు, పొట్టకు గట్టి కనెక్షన్ ఉంటుంది. ఆఫీస్ టెన్షన్ లోనో, కోపంలోనో, మొబైల్ చూస్తూ తీవ్రమైన ఒత్తిడిలో తింటే.. జీర్ణ క్రియ అస్తవ్యస్తం అవుతుంది. స్ట్రెస్ వల్ల శరీరం ‘ఫైట్ లేదా ఫ్లైట్’ మోడ్ లోకి వెళ్తుంది, దీని వల్ల జీర్ణవ్యవస్థకు అందాల్సిన రక్తప్రసరణ తగ్గిపోయి అజీర్తి హార్మోన్లు విడుదలవుతాయి.

6. శారీరక శ్రమ అస్సలు లేకపోవడం:
రోజంతా కుర్చీకే పరిమితమై, తిన్న తర్వాత కనీసం అడుగు కూడా కదపకపోవడం వల్ల పేగుల కదలికలు మందగిస్తాయి. శారీరక శ్రమ లేకపోవడం వల్ల మెటబాలిజం రేటు పడిపోతుంది. ఇది దీర్ఘ కాలిక మలబద్ధకానికి దారి తీస్తుంది.

మీ జీర్ణక్రియను మెరుగు పరుచుకోవడానికి.. ఈ 6 చెడు అలవాట్లను మార్చుకోవడానికి మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఖరీదైన సిరప్‌లు, గ్యాస్ టాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేకుండానే.. కేవలం మీ లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా రూపాయి ఖర్చు లేకుండా మీ పొట్టను సూపర్ హెల్తీగా మార్చుకోవచ్చు. కడుపు ఫ్రీగా ఉంటే రోజంతా హ్యాపీగా ఉండొచ్చు బాస్.

Related News

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

Big Stories

Advertisement
×