E-Paper
Advertisement

Fashion Guidelines: స్టైలిష్‌గా కనిపించడానికి ఖరీదైన బట్టలే అవసరం లేదు.. ఈ ఫ్యాషన్ రూల్స్ పాటిస్తే చాలు!

Fashion Guidelines: స్టైలిష్‌గా కనిపించడానికి ఖరీదైన బట్టలే అవసరం లేదు.. ఈ ఫ్యాషన్ రూల్స్ పాటిస్తే చాలు!
Advertisement

Fashion Guidelines: నలుగురిని ఆకట్టుకునేలా, అందంగా కనిపించాలనుకోవడం ప్రతి ఒక్కరి కోరికే. కానీ ఏం వేసుకుంటే బాగుంటుంది? అనే సందేహం చాలామందికి ఉంటుంది. కంటికి నచ్చిన దుస్తులు కొనేసి వేసుకోవడం చాలాసార్లు వర్కవుట్ అవ్వకపోవచ్చు. ఫ్యాషన్ అనేది ఖరీదైన బట్టల విషయం కాదు, సరైన ఎంపికల విషయం అని స్టైలింగ్ నిపుణులు చెబుతున్నారు. కొన్ని బేసిక్ రూల్స్ పాటిస్తే, మీ లుక్ సహజంగానే మారిపోతుందట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మీ బాడీ టైప్ ఏంటో తెలియాలి:

ప్రతి ఒక్కరి శరీర ఆకృతి వేరు. కొందరు సన్నగా ఉంటారు, మరికొందరు కాస్త బరువు ఎక్కువగా ఉంటారు. అందుకే ట్రెండ్‌లో ఉంది కదా అని ఏ దుస్తులు అయినా వేసుకుంటే సరిపోదు. మీ బాడీ టైప్‌కు సూట్ అయ్యే దుస్తులు ఎంచుకున్నప్పుడే లుక్ బాగా కనిపిస్తుంది. సన్నగా ఉన్నవారు చాలా లూజ్ దుస్తులు వేసుకుంటే, బరువు ఉన్నవారు మరీ టైట్ దుస్తులు వేసుకుంటే లుక్ పాడవుతుంది. కంఫర్ట్‌తో పాటు సరైన ఫిట్ ఉండే దుస్తులే బెస్ట్.

ఫిట్టింగ్ లేకపోతే లుక్ ఉండదు:

Advertisement

దుస్తులు చౌకవైనా.. ఎంత ఖరీదైనవైనా ఫిట్టింగ్ సరిగా లేకపోతే అస్సలు ఆకట్టుకోవు. అందుకే కొనుగోలు చేసే సమయంలోనే ఫిట్‌పై దృష్టి పెట్టాలి. అవసరమైతే టైలరింగ్ ద్వారా మీ సైజ్‌కు పర్ఫెక్ట్‌గా అల్టరేషన్ చేయించుకోవడం మంచిది. జీన్స్ పొడవు ఎక్కువగా ఉన్నా, షర్ట్ కాస్త లూజ్‌గా ఉన్నా సరిచేసుకుంటే లుక్ చాలా మెరుగ్గా మారుతుంది.

సింపుల్‌గానే స్టైలిష్‌గా:

హెవీ డిజైన్లు, ఎక్కువ వర్క్ ఉంటేనే స్టైలిష్ అని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల మాట ప్రకారం.. సింపుల్ డిజైన్ ఉన్న దుస్తులే ఎప్పటికీ ట్రెండీగా ఉంటాయి. ఎక్కువ ఎంబ్రాయిడరీ, చమ్కీలు ఉన్న దుస్తులు కొన్నిసార్లు ఓవర్‌గా కనిపిస్తాయి. అవసరమైతే లైట్ డిజైన్ ఉన్నవే ఎంచుకోవడం మంచిది.

కలర్ ఆప్షన్స్ చాలా ముఖ్యం:

Advertisement

రంగులు కూడా మీ లుక్‌పై పెద్ద ప్రభావం చూపిస్తాయి. స్కిన్ టోన్‌కు నప్పే రంగులు ఎంచుకుంటే సహజంగానే అందంగా కనిపిస్తారు. మొత్తం ఒకే రంగులో డ్రెస్ కొందరికి బాగానే నప్పినా, అందరికీ సూట్ అవ్వదు. ముఖ్యంగా పురుషులు షర్ట్, ప్యాంట్‌లలో మంచి కలర్ కాంబినేషన్ చూసుకోవాలి. మహిళలు రెండు లేదా మూడు రంగులకే పరిమితమైతే లుక్ క్లీన్‌గా ఉంటుంది.

వెళ్లే చోటును బట్టి స్టైల్:

ఎక్కడికైనా ఒకే రకమైన దుస్తులు వేసుకుంటే స్టైల్‌గా కనిపించదు. ఆఫీసుకు ఫార్మల్ డ్రెస్, ఫంక్షన్లకు ట్రెడిషనల్ వేర్, పార్టీలకు క్యాజువల్ లేదా ట్రెండీ అవుట్‌ఫిట్స్ ఎంచుకోవాలి. అలాగే స్నేహితులతో బయటికి వెళ్లేటప్పుడు సింపుల్ క్యాజువల్ డ్రెస్సింగ్ చాలు. ప్రదేశానికి తగ్గట్టుగా డ్రెస్ చేసుకుంటేనే లుక్ బాగా వర్క్ అవుతుంది.

యాక్సెసరీస్‌తో ఫినిషింగ్ టచ్:

చెయిన్, వాచ్, బెల్ట్ లాంటి యాక్సెసరీస్ లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. కానీ అతిగా వాడితే అవే లుక్‌ను పాడుచేస్తాయి. వేసుకున్న దుస్తులకు మ్యాచ్ అయ్యే యాక్సెసరీస్ ఎంచుకోవాలి. ఫార్మల్ డ్రెస్‌కు సింపుల్ వాచ్, సన్నని చెయిన్ బాగుంటాయి. ట్రెండీ, మందమైన యాక్సెసరీస్ అన్నిచోట్లా సూట్ కావు.

గుడ్డిగా ఫాలో అయిపోవద్దు:

ఫ్యాషన్ ప్రపంచంలో రోజుకో కొత్త ట్రెండ్ వస్తూనే ఉంటుంది. కానీ అన్నీ మనకు సూట్ అవుతాయని అనుకోవడం పొరపాటే. ట్రెండ్‌లో ఉంది కదా అని గుడ్డిగా ఫాలో అవకుండా, అది మీ బాడీ టైప్‌కు, కంఫర్ట్‌కు సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. లేకపోతే డబ్బు వృథా అవడమే కాకుండా మీ లుక్ కూడా పాడవుతుంది. అయితే మీరు ఏ దుస్తులు వేసుకున్నా, ఎలా కనిపించినా ఆత్మవిశ్వాసంతో ఉండటమే అసలైన స్టైల్ అని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు.

Related News

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

Big Stories

Advertisement
×