E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

బాత్రూమ్ తలుపులు ఎప్పుడూ మూసి ఉంచుతున్నారా?అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!

బాత్రూమ్ తలుపులు ఎప్పుడూ మూసి ఉంచుతున్నారా?అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!
Advertisement

Bathroom Ventilation : ఇంట్లో ఏ రూమ్ ఉన్నా లేకున్నా బాత్ రూమ్ అనేది పక్కాగా ఉంటుంది. దాని ఇంపార్టెన్స్ అలాంటిది మరి. అయితే చాలా మంది ఆ బాత్రూం నుండి బ్యాడ్ స్మెల్ వస్తుందనో లేక ఇంట్లోకి ఎవరైనా వస్తే చూడటానికి బాగుండదనో అస్తమానం ఆ డోర్స్ మూసేసే ఉంచుతాం. అయితే అలా మూసేసి బ్యాడ్ స్మెల్ నుండి తప్పించుకోవడం కాదు అంతకు మించిన అనర్థాలు దాని వల్ల కలుగుతాయన్న సంగతి మీకు తెలుసా ?

బ్యాక్టీరియాకు అదొక స్వర్గం

Advertisement

బాత్రూమ్ అనేది ఇంట్లో ఎక్కువ శాతం నీళ్ళతో ఉండే ప్రాంతం. మనం స్నానం చేసినప్పుడు లేదా నీటిని వాడినప్పుడు అక్కడ గాలిలో తేమ (Humidity) విపరీతంగా పెరుగుతుంది. మీరు గనుక తలుపులు మూసి ఉంచితే, ఆ తేమ బయటకు వెళ్లే దారి లేక లోపలే ఉండిపోతుంది. ఇక అలాంటి తడి వాతావరణం అంటే బ్యాక్టీరియా, ఫంగస్, మరియు ‘మోల్డ్’ (బూజు) లకి ఒక స్వర్గ ధామం. అంటే మీరు డోర్స్ మూసేసి వాటి స్వర్గానికి డోర్స్ తెరుస్తున్నారన్న మాట.

ఆ దుర్వాసన ఇంకా పెరుగుతుంది
ఇక చాలామంది బ్యాడ్ స్మెల్ రాకూడదని తలుపులు వేస్తారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా ?, గాలి ఎటూ వెళ్ళకుండా ఆ గదిలోనే చక్కర్లు కొడుతూ ఆ బ్యాడ్ స్మెల్ ని మరింత పెంచేస్తుంది.ఇక లోపల ఉన్న గాలి రీసైకిల్ కాకపోతే, ఆ గాలి బాత్రూమ్‌లోని గోడలకు, టవల్స్‌కు పట్టేస్తుంది. ఫలితంగా మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఒక రకమైన ముక్క వాసన లాంటిది వస్తుంది. అదే తలుపులు తెరిచి ఉంచితే లేదా వెంటిలేషన్ బాగుంటే, ఫ్రెష్ ఎయిర్ లోపలికి వెళ్లి చెడు వాసనను బయటకు పంపేస్తుంది.

Advertisement

టూత్ బ్రష్‌ చాలా  డేంజర్ 

ఇక దీని వల్ల మనం ఫేస్ చేసే మరో ఇంట్రెస్టింగ్ డేంజర్ ఏంటో … అటాచ్డ్‌ బాత్రూమ్ తలుపులు మూసి ఉంచి, వెంటిలేషన్ లేకపోతే లోపల గాలిలో తడితో పాటు మనం వెళ్ళిన షిట్ లోని పార్టికల్స్ గాలిలో తేలుతూ ఉంటాయి. అవి డైరెక్ట్ గా మన టూత్ బ్రష్‌లు, సోపులు, టవల్స్‌పైకి చేరిపోతాయ్.సో డోర్స్ గట్టిగా బిగించకుండా ఎయిర్ సర్క్యులేషన్ పెంచేలా చేస్తే దీన్ని నుండి తప్పించుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

also read :గంటన్నర యోగా.. ఒక్క నిమిషం కథ.. ‘రంగస్థలం’ వెనుక అసలు గుట్టు విప్పిన జగ్గుభాయ్!

గోడలు,పెయింట్లు పాడవడం పక్కా 

ఇలా బాత్రూం డోర్స్ మూసేయడం వల్ల ఆరోగ్యమే మాత్రమే కాదండోయ్ ..మన ఇంటి అందానికి కూడా దెబ్బడిపోతుంది.ఎలాగంటారా..తేమ లోపలే ఉండిపోవడం వల్ల బాత్రూమ్ టైల్స్ మధ్య నల్లటి బూజు చేరుతుంది. గోడల పెయింట్ ఊడిపోవడం, మెటల్ ఫిట్టింగ్స్ (నల్లాలు) త్వరగా తుప్పు పట్టడం వంటివి జరుగుతాయి. అలా కాకుండా తలుపులు తెరిచి ఉంచారనుకోండి .. బాత్రూమ్ త్వరగా ఆరిపోయి, అన్నీ సేఫ్ గా ఉంటాయన్న మాట.

మరి పరిష్కారం 

మరి దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచిస్తున్నారా ..స్నానం చేసిన తర్వాత కనీసం 15-20 నిమిషాల పాటు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంచండి. తలుపులు కొంచెం తెరిచి ఉంచండి ఇంట్లో ఎవరూ లేనప్పుడు లేదా బాత్రూమ్ వాడనప్పుడు తలుపులను పూర్తిగా కాకపోయినా, కనీసం కొంచెం (Gap) తెరిచి ఉంచడం వల్ల గాలి అటు ఇటూ సర్క్యులేట్ అవుతుంది.దీనితో పాటు కిటికీలు వాడండి. బాత్రూమ్‌లో చిన్న కిటికీ ఉన్నా సరే, దాన్ని ఎప్పుడూ మూసి ఉంచకండి. గాలి, వెలుతురు లోపలికి వస్తేనే బ్యాక్టీరియా చనిపోతుంది మరి.

మొత్తంగా క్లీన్ గా ఉండటం అంటే కేవలం తలుపులు వేసి లోపల ఉన్నదాన్ని దాచడం కాదు.. గాలిని, వెలుతురును లోనికి వచ్చేలా చేయడం. సో ఇకనైనా మూయకుండా ఓపెన్ చేసి పెడతారు కదూ !

also read :నిన్ను కోరి’ రీ-రిలీజ్ హంగామా.. పాత జ్ఞాపకాలు బయటపెట్టిన ఆది పినిశెట్టి

Related News

మహిళలు ఇంట్లో చేసే ఈ తప్పుల వల్లే ఆర్థిక కష్టాలు.. వాస్తు శాస్త్రంలో ఏముందంటే

రోజంతా కూర్చొని పనిచేసేవారిలో చెప్పుకోలేని ఆ ఒక్క ఆరోగ్య సమస్య తీవ్రం.. డాక్టర్ల హెచ్చరిక

దాంపత్య జీవితంలో ప్రేమతో పాటు ఆత్మగౌరవం చాలా ముఖ్యం.. ఈ విషయాల్లో ఎప్పుడూ రాజీ పడకండి

10 రోజుల్లో 5 కిలోల బరువు తగ్గొచ్చా? బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు డాక్టర్ చేసిన సూచనలు

ఇంటి ఖాళీ టెర్రెస్‌ను కూల్ లుక్‌తో ఇలా మార్చండి.. అందమైన రూఫ్ టాప్ కెఫె డిజైన్

అన్నం తిన్నాక టీ తాగడం మంచిదా? కాదా? సైన్స్ ఏం చెబుతోంది?

వర్షాకాలంలో హెల్తీగా ఉండాలా? ఈ 8 ఈజీ టిప్స్ ఫాలో అవ్వండి!

ఉల్లి పాయను ఇలా కోస్తే.. అసలు కళ్లే మండవు, మీరు చేస్తున్న తప్పు ఇదే!

Big Stories

×