E-Paper
Advertisement

గంటన్నర యోగా.. ఒక్క నిమిషం కథ.. ‘రంగస్థలం’ వెనుక అసలు గుట్టు విప్పిన జగ్గుభాయ్!

గంటన్నర యోగా.. ఒక్క నిమిషం కథ.. ‘రంగస్థలం’ వెనుక అసలు గుట్టు విప్పిన జగ్గుభాయ్!
Advertisement

jagapathi Comments : ”సుకుమార్ కి అస్సలు కథ చెప్పడమే రాదు”..అదేంటి సినిమాలతో ఏకంగా వేల కోట్లు కొల్లగొట్టేస్తుంటే కథ చెప్పడం రాకపోవడమేంటి అంటారా ..యస్..తనతో వరుస పెట్టి సినిమాలు చేసిన జగపతి బాబు ఆలియాస్ జగ్గూ భాయే సుక్కుకి కథ చెప్పడం రాదంటున్నాడు మరి.ఇక జగ్గు బాయ్ చేసిన ఈ కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతున్నాయ్.అసలు ‘రంగస్థలం’ కథను సుకుమార్ ఎలా చెప్పారో వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

విపరీతమైన లేడీ ఫాలోయింగ్‌

Advertisement

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘జగ్గుభాయ్’ స్టైలే వేరు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా విపరీతమైన లేడీ ఫాలోయింగ్‌ తెచ్చుకున్న జగపతి సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘లెజెండ్’ విలన్‌గా విశ్వరూపం చూపించాడు.ఇక అక్కడ మొదలు వరుస సినిమాలతో సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు.ఇక ఈ మే 8న ‘గోదారి గట్టుపైన’ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకి రానున్న సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇలా సుక్కు గురించి అసలు విషయం చెప్పుకొచ్చాడు.

అసలు కథ చెప్పడమే రాదు

Advertisement

స్టార్ డైరెక్టర్ సుకుమార్ అంటే మనకు గుర్తొచ్చేది లెక్కల మాస్టర్, పక్కా స్క్రీన్ ప్లే. కానీ జగపతిబాబు మాత్రం సుకుమార్‌కు అసలు కథ చెప్పడమే రాదు అంటూ బాంబు పేల్చారు. ఈ విషయాన్ని స్వయంగా సుకుమారే ఒప్పుకుంటారని జగ్గుభాయ్ సరదాగా చెప్పడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా సమయంలో సుకుమార్ ఏదో చెప్పడానికి ప్రయత్నించి, చివరకు తడబడుతూ.. “సార్.. ఇవన్నీ కాదు, మీరు చేసేయండి అంతే” అని చేతులెత్తేశారట. దర్శకుడి విజన్‌పై ఉన్న నమ్మకంతో జగపతిబాబు కూడా మారుమాట్లాడకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఫలితం మనం చూసిన స్టైలిష్ విలన్ క్యారెక్టర్.

also read :వంగ మార్క్ వైలెన్స్ vs వంశీ పైడిపల్లి క్లాస్.. 2027 ఈద్ విన్నర్ ఎవరు?

గంటన్నర సేపు యోగా చేసి వచ్చి

అంతేకాదండోయ్..‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమా వెనుక ఉన్న ఒక ఫన్నీ సీక్రెట్‌ను కూడా బయటపెట్టేశాడు మన జగ్గుబాయ్. ప్రెసిడెంట్ పాత్ర గురించి చెప్పడానికి జగపతిబాబు దగ్గరకు వచ్చిన సుకుమార్, ఏకంగా గంటన్నర సేపు యోగా చేసి వచ్చి.. “సార్.. మీరు ప్రెసిడెంట్ సార్. చొక్కా ఉండదు.. చుట్ట ఉంటుంది.. అంతే సార్.. చాలా బావుంటుంది సార్!” అని కేవలం ఒక్క ముక్కతోనే స్టోరీ డిస్కషన్ కంప్లీట్ చేసేశాడట.దీంతో ఒక్క నిమిషంలోనే సుక్కు చెప్పిన ఆ నారేషన్ విన్న జగ్గుభాయ్ సుక్కు పరిస్థితి అర్థం చేసుకుని వెంటనే షూటింగ్ ఎప్పుడో చెప్పమని అడిగేశాడట . ఇక జగపతి విషయానికి వస్తే నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న జగపతిబాబు 90s లో ‘గాయం’, ‘మావిచిగురు’, ‘అంతఃపురం’ వంటి సినిమాలతో ఒక వెలుగు వెలిగాడనే చెప్పాలి.

సుక్కు ఎలా రియాక్ట్ అవుతాడో

ఇక హీరోగా కెరీర్ గ్రాఫ్ తగ్గుతున్న సమయంలో 2014లో వచ్చిన బాలయ్య ‘లెజెండ్’తో విలన్‌గా మారి తనలోని మరో యాంగిల్ ని పరిచయం చేశాడు జగ్గు బాయ్.ఇక అప్పటి నుండి వరుస పెట్టి ‘సలార్’, ‘శ్రీమంతుడు’ అంటూ ఎన్నో సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఆయన, సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన ‘మేమ్ ఫేమస్’ తర్వాత వస్తున్న ‘గోదారి గట్టుపైన’ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 8న రిలీజ్ కి రెడీ అవుతుంది.చూడాలి మరి అసలు కథే చెప్పడం రాదు అని జగ్గు చేసిన కామెంట్స్ పై సుక్కు ఎలా రియాక్ట్ అవుతాడో!

also read :భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతుల మీదుగా ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్ రిలీజ్

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×