Ninnu Kori: రీ-రిలీజ్‌ల ట్రెండ్ ఇపుడు టాలీవుడ్‌లో జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా పాత కల్ట్ క్లాసిక్ సినిమాలను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఎగబడుతున్నారు ఆడియన్స్. అయితే, మాస్ సినిమాల మధ్యలో ఒక ప్యూర్ ఎమోషనల్ సినిమా థియేటర్లలోకి వస్తే ఆ కిక్కు మాములుగా ఉండదు.అలా న్యాచురల్ స్టార్ నాని కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిన ‘నిన్ను కోరి’ ఇప్పుడు మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తన మ్యాజిక్ రిపీట్ చేసేందుకు సిద్ధమైంది. మే 8న వేసవి కానుకగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో సోషల్ మీడియాలో సినిమాపై డిబేట్స్ పెట్టేస్తున్నారు ఫిల్మీ ఫ్యాన్స్.
మెలోడీల మ్యాజిక్.. మళ్ళీ థియేటర్లలో!
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో యూత్‌లో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. వైజాగ్ నుండి అమెరికా వరకు సాగే ఈ లవ్ స్టోరీలో నాని ‘ఉమా మహేశ్వరరావు’గా చూపించిన నటన, నివేదా థామస్ పలికించిన హవాభావాలు నెక్స్ట్ లెవెల్.ముఖ్యంగా గోపీ సుందర్ అందించిన ‘అడిగా అడిగా’ సాంగ్ ఇప్పటికీ చాలా మంది ప్లేలిస్ట్‌లో టాప్ లో ఉంటుందంటే ఆశ్చర్యం లేదు. ఓవరాల్ గా అంతమంచి ఇంపాక్ట్ చూపించిన ఈ సినిమా మళ్ళీ థియేటర్లలోకి వస్తుండటంతో మురిసిపోతున్నారు మూవీ లవర్స్.
ఆ పాత్ర ఒప్పుకోవడానికి కారణం అదే!
ఈ సినిమా రీ-రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్రంలో కీరోల్ చేసిన ఆది పినిశెట్టి సినిమాకి సంబంధించి పాత జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. ఇక సినిమా గురించి ఆది పంచుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవడం విశేషం.
also read :భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతుల మీదుగా ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్ రిలీజ్
ఆది మాట్లాడుతూ.. “నిన్ను కోరి సినిమా నా కెరీర్‌లో చాలా స్పెషల్. అరుణ్ అనే పాత్రను శివ నిర్వాణ నాకు చెప్పినప్పుడు, అందులో ఒక మెచ్యూరిటీ కనిపించింది. పెళ్ళైన భార్య మాజీ ప్రియుడు ఇంట్లోకి వస్తే.. ఒక భర్త ఎలా రియాక్ట్ అవుతాడు అనే పాయింట్ అప్పట్లో ఒక రిస్క్ అనుకున్నారు. కానీ, ఆ ఎమోషన్‌ను జనాలు అంత బాగా రిసీవ్ చేసుకుంటారని ఊహించలేదు”అంటూ మనసులోని మాటని బయటపెట్టాడు ఈ వెర్సటైల్ యాక్టర్.
క్లైమాక్స్ సీన్ చేస్తున్నప్పుడు నాని కళ్ళలో నీళ్లు..
క్లైమాక్స్ షూటింగ్ గురించి ఆది చెప్తూ.. “చివరి సీన్‌లో నాని, నేను, నివేదా ముగ్గురం ఉన్నప్పుడు సెట్‌లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేది. నాని ఆ సమయంలో పాత్రలోకి ఎంతలా వెళ్ళిపోయారంటే.. ఆయన కళ్ళలో ఆ బాధ క్లియర్ గా కనిపించింది. ఆ సీన్ పూర్తయ్యాక మేము ముగ్గురం ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాం. అది సినిమా కాదు, ఒక ఎమోషన్ అని మాకు అప్పుడే అర్థమైంది”అంటూ అని పాత విషయాలను గుర్తు చేసుకున్నారు ఆది .
బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ రికార్డులు ఖాయమేనా?
డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మించిన ఈ చిత్రం టీవీ మరియు ఓటీటీలో ఇప్పటికే మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషం.ఇక లేటెస్ట్ గా
రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తుండటంతో, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను మళ్ళీ థియేటర్లలో చూడటానికి క్యూ కట్టడం పక్కా.చూడాలి మరి అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ లవ్ స్టోరీ మే 8న బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో వసూళ్లు కొల్లగోడుతుందో !
also read :గంటన్నర యోగా.. ఒక్క నిమిషం కథ.. ‘రంగస్థలం’ వెనుక అసలు గుట్టు విప్పిన జగ్గుభాయ్!
Aadhi Pinisetty shares his love for #NinnuKori
In theatres from May 8 🎬 pic.twitter.com/4CrjlKI0OS
— TrackTollywood (@TrackTwood) May 6, 2026