E-Paper
Advertisement

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?
Advertisement

Bathroom Difference: మన రోజువారీ జీవితంలో ‘బాత్‌రూమ్’, ‘వాష్‌రూమ్’, ‘రెస్ట్ రూమ్’ అనే పదాలను తరచూ ఉపయోగిస్తుంటాం. చాలామంది ఈ మూడూ ఒకటే అని భావిస్తుంటారు. కానీ డిక్షనరీ ప్రకారం, పలు దేశాల సంస్కృతి, ప్రాంతీయ భాషను బట్టి ఈ పదాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నాయి. అసలు వీటి అర్థాలేంటి? ఏ సందర్భంలో ఏ పదాన్ని ఉపయోగించాలో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బాత్‌రూమ్ (Bathroom)

‘బాత్’ (Bath) అంటే స్నానం చేయడం అని అర్థం. పేరుకు తగ్గట్లే స్నానం చేయడానికి వీలుగా బాత్‌టబ్ (Tub) లేదా షవర్ (Shower) ఉన్న గదిని ‘బాత్‌రూమ్’ అంటారు. సాధారణంగా ఇవి ఇళ్లు, హోటల్స్ లో ఉంటాయి. ఇందులో టాయిలెట్‌తో పాటు స్నానానికి కావలసిన వసతులు ఉంటాయి. స్నానం చేసే సదుపాయం లేని ప్రాంతాలను ‘బాత్‌రూమ్’ అని పిలవడం కరెక్ట్ కాదని చెప్పవచ్చు.

వాష్‌రూమ్ (Washroom)

Advertisement

కేవలం చేతులు, ముఖం కడుక్కోవడానికి, టాయిలెట్ ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండే గదిని ‘వాష్‌రూమ్’ అంటారు. ఇందులో స్నానం చేసే షవర్లు, టబ్‌లు ఉండవు. ఆఫీసులు, థియేటర్లు, రెస్టారెంట్లు, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్‌లలో వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. కెనడా, బ్రిటన్ (UK) దేశాలలో వాష్ రూమ్ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.

Also Read: ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

రెస్ట్ రూమ్ (Restroom)

Advertisement

అమెరికన్ ఇంగ్లీషులో పబ్లిక్ టాయిలెట్లను పిలవడానికి ‘రెస్ట్రూమ్’ అనే పదాన్ని ఉపయోగిస్తారు. షాపింగ్ మాల్స్, ఎయిర్‌పోర్టులు, బస్ స్టేషన్లు, పెట్రోల్ బంకుల్లో ఉండే టాయిలెట్ సదుపాయాలను రెస్ట్రూమ్స్ కిందకే వస్తాయి. ప్రయాణాల్లో అలసిపోయిన వారు కాసేపు సేదతీరడానికి (Rest), ముఖం కడుక్కుని ఫ్రెష్ అవ్వడానికి వీలుగా ఉండే ప్రజోపయోగ స్థలం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది.

Also Read: ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×